రియో ఒలింపిక్స్: అంగీకరించక తప్పదు.. కంటతడి పెట్టిన సానియా మీర్జా
రియో డీ జెనిరో: రియో ఒలింపిక్స్‌లో భారత స్టార్ ప్లేయర్ సానియా మీర్జా జోడీకి చుక్కెదురైంది. మిక్స్డ్ డబుల్స్‌లో సానియా - రోహన్ బోపన్నల జోడీ తీవ్ర నిరాశకు గురి చేసింది. మ్యాచ్ కోల్పోయిన అనంతరం సానియా, రోహన్ మాట్లాడారు. ఈ సందర్భంగా సానియా కంటతడి పెట్టింది.
నాలుగేళ్లకోసారి ఒలింపిక్స్ వస్తాయని, మళ్లీ ఆడతానో లేదోనని, తనకు మాటలు రావడం లేదని సానియా అన్నారు. ఈ ఓటమి చాలా కష్టంగా ఉందని, కానీ అంగీకరించక తప్పని పరిస్థితి అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆమె కళ్లలో నీళ్లు కనిపించాయి.
రియో ఒలింపిక్స్‌లో మెరుగ్గా రాణించలేకపోయామని, 2004లో పేస్ - భూపతిల ఏతెన్స్ ఒలింపిక్స్‌ను గుర్తుకు తెచ్చిందన్నారు. టెన్నిస్ ప్లేయర్లకు అదృష్టం కలిసి రావాలని, దీని నుంచి బయట పడేందుకు కొంచెం సమయం పడుతుందని చెప్పారు. త్వరలో జరగనున్న డబ్ల్యూటీఏ పోరుకు సిద్ధమవుతామని చెప్పారు.
Comments
sania mirza hyderabad rio olympics 2016 rio olympics rio 2016 dipa karmakar రియో ఒలింపిక్స్ రియో ఒలింపిక్స్ 2016 దీపా కర్మాకర్ సానియా మీర్జా
English summary
Sania Mirza and Rohan Bopanna lose bronze play off.
Story first published: Tuesday, August 16, 2016, 15:56 [IST]