హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

చీరకట్టులో పీవీ సింధు: లాల్‌దర్వాజ అమ్మవారికి మొక్కులు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: రియో ఒలింపిక్స్‌లో భారత్‌కు రజత పతకం సాధించిన తెలుగు తేజం పీవీ సింధు శనివారం ఉదయం నగరంలోని లాల్‌దర్వాజ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో ఆలయం వద్దకు చేరుకున్న సింధు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకుంది.

Rio Olympics silver medallist PV Sindhu visits Lal Darwaza temple in Hyderabad

చీరకట్టులో అచ్చమైన పదహారణాల తెలుగింటి అమ్మాయిలా ముస్తాబై తన తల్లితో కలసి ఆలయానికి వచ్చిన సింధు, తలపై పళ్లెంలో అమ్మవారికి పట్టుబట్టలను తీసుకువచ్చింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన సింధు ప్రతి ఏటా మహంకాళి అమ్మవారిని దర్శించుకుంటానని, ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు అమ్మవారిని దర్శించుకున్నానని తెలిపింది.

రియోలో మెడల్ సాధిస్తే మరోసారి వస్తానని మొక్కుకున్నాని తెలిపారు. మెడల్ సాధించడంతో తిరిగి అమ్మవారి ఆశీస్సులు తీసుకోవాడనికి కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నాని తెలిపారు. తల్లి ఆశీస్సులు తనకు ఎప్పుడు మెండుగా ఉండాలని, మళ్లీ మళ్లీ ఇక్కడికి వస్తానని చెప్పారు. ఒలింపిక్స్‌కు వెళ్లే ముందు సింధు అమ్మవారికి బంగారు బోనం సమర్పించింది.

English summary
Silver medallist in the recent Rio Olympics, P.V. Sindhu, offered ‘pattu vastrams’ to Goddess Durga at the famous Lal Darwaza temple in the Old City of Hyderabad on Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X