వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాధాకరం, కఠిన చట్టాలు రావాలి: అమృతకు కోమటిరెడ్డి పరామర్శ, కౌసల్య ఓదార్పు

|
Google Oneindia TeluguNews

Recommended Video

ప్రణయ్‌ కుంటుంబ సభ్యులను కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శ

నల్గొండ: కులాంతర ప్రేమ వివాహం కారణంగా మిర్యాలగూడలో హత్యకు గురైన ప్రణయ్‌ కుంటుంబ భ్యులను శుక్రవారం కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకటరెడ్డి పరామర్శించారు. అనంతరం మీడియాతో మాట్లాడతూ.. ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్‌పై విమర్శలు గుప్పించారు. రాష్ట్రంలో చోటుచేసుకున్న భయానక ఘటనలపై కేసీఆర్‌ స్పందించిన తీరు సరికాదన్నారు.

 అత్యంత బాధాకరం

అత్యంత బాధాకరం

ప్రేమ వివాహం చేసుకున్న ప్రణయ్‌ ప్రాణాలు తీయడం అత్యంత బాధాకరమని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు.

అమృత వద్దకు నేతల క్యూ, ఆఫర్లు: ఏం సహకారం కావాలని కలెక్టర్ అడగ్గా.. అమృత వద్దకు నేతల క్యూ, ఆఫర్లు: ఏం సహకారం కావాలని కలెక్టర్ అడగ్గా..

అధికారంలోకి రాగానే..

అధికారంలోకి రాగానే..

ఎప్పుడూ ఫామ్‌హౌక్‌కే పరిమితమయ్యే కేసీఆర్‌.. సచివాలయానికి రాకున్నా ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు తక్షణమే స్పందించాలని హితవు పలికారు. కొండగట్టు బస్పు ప్రమాదంలో 60 మంది చనిపోయినప్పుడు కూడా కేసీఆర్‌ రాకపోవడం విస్మయం కలిగిచిందని చెప్పారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే పరువు హత్యలపై కఠిన చట్టాలు తెస్తామని వెల్లడించారు.

ప్రత్యేక చట్టం తేవాలి..

ప్రత్యేక చట్టం తేవాలి..


కులాంతర వివాహితుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని సామాజికవేత్త, తమిళనాడులో హత్యకు గురైన శంకర్‌ భార్య కౌసల్య డిమాండ్‌ చేశారు. మిర్యాలగూడలో ప్రణయ్‌ భార్య అమృత వర్షిణిని పరామర్శించిన ఆమె కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం(కేవీపీఎస్‌) ఆధ్వర్యంలో సుందరయ్య విజ్ఞానకేంద్రంలో మీడియాతో మాట్లాడారు.

అంకుల్! నేను మిస్టర్ ఫర్‌ఫెక్ట్-అమృతను మహారాణిలా..: ప్రణయ్ డైరీలో ఏముందంటే?అంకుల్! నేను మిస్టర్ ఫర్‌ఫెక్ట్-అమృతను మహారాణిలా..: ప్రణయ్ డైరీలో ఏముందంటే?

 నేను చూస్తుండగానే నా భర్తను..

నేను చూస్తుండగానే నా భర్తను..

‘నేను ఒక దళిత యువకుడిని వివాహం చేసుకున్నందుకు కక్షగట్టిన నా తల్లిదండ్రులు, బంధువులు 2016 మార్చి 13న నా భర్త శంకర్‌ను నేను చూస్తుండగానే దారుణంగా హత్య చేశారు. ఆ దాడిలో తీవ్రంగా గాయపడిన నా తలకు 36 కుట్లు పడ్డాయి. నా భర్తను చంపిన వారిని కఠినంగా శిక్షించాలని పోరాటం చేశాను. అందుకు జిల్లా కోర్టు నా తండ్రితోపాటు మరో ఐదుగురికి మరణ శిక్ష, ఒకరికి యావజ్జీవ కారగార శిక్ష విధించింది' అని కౌసల్య వివరించారు. జిల్లా కోర్టు నా తండ్రికి రెండుసార్లు ఉరిశిక్ష వేయమని తీర్పునిచ్చిందని చెప్పారు. హైకోర్టుకు వెళ్లినా వారు శిక్ష నుంచి తప్పించుకోలేకపోతున్నారని చెప్పారు.

అమృతకు రక్షణ కల్పించాలి

అమృతకు రక్షణ కల్పించాలి


నిందితులు 58 సార్లు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నా రాకుండా చేశానని కౌసల్య చెప్పారు. ప్రభుత్వం తనకు పూర్తి రక్షణ కల్పించడంతో పాటు ముగ్గురు పబ్లిక్‌ ప్రాసిక్యూటర్స్‌ను తన తరపున వాదించేందుకు నియమించిందని చెప్పారు. తన భర్త పేరున శంకర్‌ సోషల్‌ జస్టిస్‌ ట్రస్టును ఏర్పాటు చేసి 30 మంది విద్యార్థులకు విద్యా సహాయం చేయడంతోపాటు వారికి డప్పులో శిక్షణ ఇస్తున్నానని, ప్రేమికులకు మద్దతు, రక్షణ కల్పించడంతోపాటు వారి వివాహానికి సహకారం అందిస్తున్నట్లు కౌసల్య చెప్పారు. ప్రణయ్ భార్య అమృతకు ఇక్కడి ప్రభుత్వ రక్షణ కల్పించాలని ఆమె డిమాండ్ చేశారు.

English summary
: It's a connection that no one would want. But when two women met each other in a town in Telangana on Friday, the familiarity of what they have been through appeared to lend a degree of comfort: that even though their worlds had been torn apart equally due to ugly face caste-hatred, they are not alone.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X