వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సింధూశర్మకు ఊరట .. హైకోర్టు ఆదేశాలతో ఒడికి చేరిన రిషిత.. వారానికి రెండు రోజులు తండ్రి వసిష్ఠ సంరక్షణ

|
Google Oneindia TeluguNews

రిటైర్డ్ జడ్డి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధుశర్మకు పెద్ద కూతురు రిషితను అప్పగించాలని హైకోర్టు గురువారం నాడు ఆదేశాలు జారీ చేసింది. తన పెద్ద కుమార్తె ను అప్పగించాలని హెబియస్ కార్పస్ పిటీషన్ వేశారు సింధూ శర్మ . కోర్టు రిషితను తల్లికి అప్పగించాలని వారానికి రెండు రోజులు తండ్రి వసిష్ఠ దగ్గరకు పంపాలని ఆదేశించింది. దీంతో సింధూ శర్మకు ఊరట లభించింది.

<strong>తెలుగు రాష్ట్రాల విద్యుత్ వెబ్ సైట్లు హ్యాక్ చేసిన అంతర్జాతీయ హ్యాకర్లు .. రూ.35కోట్లు డిమాండ్ </strong>తెలుగు రాష్ట్రాల విద్యుత్ వెబ్ సైట్లు హ్యాక్ చేసిన అంతర్జాతీయ హ్యాకర్లు .. రూ.35కోట్లు డిమాండ్

.హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్‌రావు కోడలు సింధూ శర్మ పోరాటం .. పిల్లల కోసం

.హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్‌రావు కోడలు సింధూ శర్మ పోరాటం .. పిల్లల కోసం

హైకోర్టు రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్‌రావు కుటుంబంపై వరకట్న వేధింపుల ఆరోపణలు చేసిన కోడలు సింధూ శర్మ పోరాటానికి దిగిన విషయం తెలిసిందే . ఆదివారం సింధూ శర్మ మహిళా సంఘాలతో కలిసి అత్తింటి ముందు ధర్నా చేసి తన పిల్లలను తనకు అప్పగించాలని కోరారు.సింధూ శర్మ పోరాటం, మహిళ సంఘాలు, చైల్డ్ లైన్ ప్రతినిధులు అండగా నిలవడంతో.. రామ్మోహన్ రావు కుటుంబం దిగొచ్చింది. సింధూ శర్మకు చిన్న కూతురిని అప్పగించారు.

పెద్ద కూతురు రిషితను తల్లి సింధూశర్మకి అప్పగించాలని కోర్టు ఆదేశాలు

పెద్ద కూతురు రిషితను తల్లి సింధూశర్మకి అప్పగించాలని కోర్టు ఆదేశాలు

రిటైర్డ్ జడ్జి నూతి రామ్మోహన్ రావు కోడలు సింధు శర్మ పెద్ద కూతురు రిషితను తన భర్త నుండి తనకు అప్పగించాలని కోరుతూ హైకోర్టులో బుధవారం నాడు హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై గురువారం నాడు హైకోర్టు విచారణ జరిపింది. రిటైర్డ్ జడ్జి రామ్మోహన్ రావు కొడుకు వశిష్ట వద్ద పెద్ద కూతురు రిషిత ఉంటుంది. కానీ పిల్లలకు తల్లి సంరక్షణ అవసరం అని భావించిన కోర్టు పెద్ద కూతురు రిషితను కూడా తల్లికి అప్పగించాలని ఆదేశించింది.

వారానికి రెండు రోజులు తండ్రి వసిష్ట వద్ద ఉంచాలని ఆదేశం

వారానికి రెండు రోజులు తండ్రి వసిష్ట వద్ద ఉంచాలని ఆదేశం

వారానికి రెండు రోజుల పాటు పెద్ద కూతురును తండ్రి వద్ద ఉంచాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ప్రతి శుక్రవారం సాయంత్రం రిషితను తండ్రి వశిష్టకు అప్పగించాలని సోమవారం నాడు సింధు శర్మ తీసుకెళ్లాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.ఈ ఏడాది జూన్ 4వ తేదీ వరకు ఈ ప్రక్రియను కొనసాగించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇక పెద్ద కుమార్తె రిషిత తన తల్లి వద్దే ఉంటానని చెప్పడంతో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకొంది.

విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోని సింధూ శర్మ .. విడాకులు కోరుతున్న భర్త వసిష్ఠ

విడాకులు ఇచ్చేందుకు ఒప్పుకోని సింధూ శర్మ .. విడాకులు కోరుతున్న భర్త వసిష్ఠ

సింధు శర్మ ఆమె భర్త వశిష్ట మధ్య గొడవలున్నాయి. ఈ తరుణంలో విడాకులు కావాలని వశిష్ట కోరుతున్నారు.అయితే తాను విడాకులు ఇచ్చేందుకు సిద్దంగా లేనని ఇవాళ జరిగిన విచారణ సందర్భంగా కోర్టుకు సింధుశర్మ చెప్పారని సమాచారం. అంతే కాదు భర్తతో కలిసి ఉండటానికి ఆమె సుముఖంగానే ఉన్నారు. వారిపై తాను వేసిన కేసులు ముందు రుజువవ్వాలని.. అప్పటి వరకూ విడాకులు ఇచ్చే ప్రసక్తే లేదంటున్నారు సింధూ శర్మ . కలిసి ఉండేందుకు భర్త వశిష్ట ముందుకొస్తే తాను ఒక అవకాశమిస్తానన్నారు.

English summary
Retired Judge Nuti Ramohan Rao daughter in law sindhu sharma filed a petition Wednesday in the High Court seeking granting of Sindhu Sharma daughter Rishitha from her husband. Eldest daughter Rishitha living near her father Vasishta . But the court also ordered the daughter Rishitha to give her a mother's care. The High Court has ordered the petitioner to keep the elder daughter at her father's home for two days in a week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X