వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లారీని ఢీకొట్టిన కారు: ముగ్గురు యువ ఇంజనీర్ల దుర్మరణం

|
Google Oneindia TeluguNews

మంచిర్యాల: జిల్లాలోని హాజీపూర్‌ మండలం కేంద్రంలోని జాతీయరహదారిపై గురువారం ఉదయం ఓ కారు లారీని వెనుకనుంచి ఢీక్టొట్టిన దుర్ఘటనలో ముగ్గురు యువ ఇంజినీర్లు మృత్యువాతపడగా.. మరో యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.

పోలీసుల వివరాల ప్రకారం... వైజాగ్‌కు చెందిన ఉండబట్ల చంథ్రేఖర్‌(28), జ్యోతు లగంగ సత్యశశిధర్‌(29), హైదరాబాద్‌కు చెందిన తేజస్వి(28) రాచ సాయితేజ(29) మంచిర్యాల జిలల్లా జైపూరులోని సింగరేణి విద్యుదుత్పత్తి కేంద్రంలో ఆరునెలల క్రితం ఇంజినీర్లుగా చేరారు. నస్పూర్‌లో నివాసముండే ఈ నలుగురు బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని వారి గదికి చేరుకున్నారు.

అనంతరం కారులో అర్ధరాత్రి దాటిన తర్వాత కరీంనగర్‌ బయలుదేరారు. మంచిర్యాల మీదుగా లక్షెట్టిపేట వైపునకు అతి వేగంగా వస్తున్న క్రమంలో హాజీపూర్‌ దగ్గర ఓ లారీని అధిగమించబోయి అదుపుతప్పి ఢీక్టొట్టారు. ప్రమాదంలో చంథ్రేఖర్‌, సత్యశశిధర్‌, తేజస్వి అక్కడికక్కడే మృతిచెందారు.

కారు నడుపుతున్న సాయితేజ తీవ్రంగా గాయపడ్డాడు. సత్య శశిధర్‌ తండ్రి గంగాధర్‌రావు వైజాగ్‌లోని స్టీల్‌ ప్లాంటులో ఉద్యోగి. తేజస్వి తల్లిదండ్రులు శ్రీధర్‌ స్వర్ణలక్ష్మ హైదరాబాద్‌లో నివాసముంటున్నారు. చంథ్రేఖర్‌ది విశాఖ జిల్లాలోని చోడవరం.

road accident: Three engineers killed

గుండెపోటుతో ఆర్‌పీఎఫ్‌ హెడ్‌కానిస్టేబుల్‌ మృతి

వరంగల్‌: విధి నిర్వహణలో భాగంగా స్వర్ణజయంతి ఎక్స్‌ప్రెస్‌లో సహచరులతో కలిసి ఎస్కార్ట్‌ డ్యూటీలో ఉన్న వరంగల్‌ ఆర్‌పీఎఫ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ భవంతుల రాజుకుమార్‌ గురువారం గుండెపోటుతో మృతిచెందాడు. బుధవారం రాత్రి ముగ్గురు సహచరులతో కలిసి రాజ్‌కుమార్‌ వరంగల్‌ నుంచి జమ్ముతావి ఎక్స్‌ప్రెస్‌ (16687)లో ఎస్కార్ట్‌గా బల్లార్షకు వెళ్లాడు.

తిరిగి గురువారం తెల్లవారుజామున 2.55 గంటలకు బల్లార్ష నుంచి హజ్రత్‌నిజాముద్దీన్‌-విశాఖపట్నం స్వర్ణజయంతి (12804) ఎక్స్‌ప్రెస్‌లో వరంగల్‌కు బయలుదేరాడు. రైలు సిర్పూర్‌కాగజ్‌నగర్‌ దాటిన తరువాత రాజ్‌కుమార్‌కు గుండెపోటు రావటంతో పరిస్థితి విషమించింది. వెంట ఉన్న సహచరుల సమాచారంతో వరంగల్‌ ఆర్‌పీఎఫ్‌ ఏఎస్సై జనార్ధన్‌ ఆర్‌పీఎఫ్‌, రైల్వే ఉన్నతాధికారులతో మ్లాడి అదే రైల్లో వరంగల్‌కు తీసుకువచ్చి కాజీపేట రైల్వే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు.

అనంతరం మృతదేహానికి ఎంజీఎంలో పోస్టుమార్టం నిర్వహించి బంధువులకు అప్పగించారు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నాడు. సహాయ భద్రతా కమిషనర్‌ పి. మురళికృష్ణ, సీఐ సయ్యద్‌ ఇక్బాల్‌, మహబూబాబాద్‌ ఎస్సై మధు, వరంగల్‌ జీఆర్‌పీ సీఐ ి. స్వామి, ఆర్‌పీఎఫ్‌ ఎఎస్సైలు బి. జనార్ధన్‌, మధన్‌సింగ్‌, ధారాసింగ్‌ నివాళులర్పించారు. కేసు నమోదు చేసుకొని హెడ్‌ కానిస్టేబుల్‌ బి. మురళి దర్యాప్తు చేస్తున్నట్లు వరంగల్‌ జీఆర్‌పీ సీఐ స్వామి చెప్పారు.

English summary
Three engineers killed in a road accident, which is occurred in Mancherial.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X