హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖుల కుటుంబాల్లో విషాదం నింపిన హైదరాబాద్ రోడ్డు ప్రమాదాలు(పిక్చర్స్)

హైదరాబాద్ నగరంలో తరచూ చోటు చేసుకుంటున్న ఘోర రోడ్డు ప్రమాదాలు సామాన్యులతోపాటు ప్రముఖుల కుటుంబాల్లోనూ విషాదాల్ని నింపుతున్నాయి. నగర రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో తరచూ చోటు చేసుకుంటున్న ఘోర రోడ్డు ప్రమాదాలు సామాన్యులతోపాటు ప్రముఖుల కుటుంబాల్లోనూ విషాదాల్ని నింపుతున్నాయి. నగర రోడ్లపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ఇంటి నుంచి బయటికి వెళ్లిన వ్యక్తి.. తిరిగి వచ్చే వరకూ నమ్మకం లేకుండా పోతోంది. అతివేగం వల్ల కొందరు చనిపోతే... వారి తప్పులేకుండానే ఎదుటివారి నిర్లక్ష్యానికి మరికొందరు బలవుతున్నారు. ఇలా నగరంలో పలువురు ప్రాణాలు వదిలి తమ కుటుంబాల్లో విషాధాల్ని నింపారు.

రమ్య

రమ్య

మద్యం మత్తులో కొందరు యువకులు నిర్లక్ష్యంగా నడిపి చిన్నారి రమ్మ ప్రాణాలు తీశారు.
గత సంవత్సరం జులై 1 జరిగిన రోడ్డుప్రమాదంలో రమ్య బాబాయి అక్కడికక్కడే మృతిచెందగా.. పదిరోజుల పాటు పోరాడి కన్నుమూసింది రమ్య. మరో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న రమ్య తాతయ్య మధుసూదనాచారి కూడా కొద్దిరోజుల్లోనే మృతిచెందారు. కాగా, తమ కుటుంబంలోని ముగ్గురి ప్రాణాలను బలిగొన్న ఆరుగురు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని రమ్య కుటుంబసభ్యులు డిమాండ్ చేశారు. ఆరుగురు నిందితుల్లో ఒకరినే అరెస్ట్ చేశారని అన్నారు. ప్రమాదానికి కారణమైన ఆరుగురు నిందితులతోపాటు వారి కుటుంబసభ్యులపైనా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మద్యం మత్తులో..

మద్యం మత్తులో..

నాగార్జున సర్కిల్ వద్ద కారు పైన కారు పడిన ప్రమాదంలో తొమ్మిదేళ్ల చిన్నారి రమ్య ప్రాణాలు కోల్పోయింది. మద్యం మత్తులు కారును నడిపిన యువకులు అదుపుతప్పి ఫ్లైఓవర్ కింద వెళుతున్న మరో కారుపై కారుతో సహా పడిపోయారు. దీంతో ఆ కారులో ఉన్న రమ్యతోపాటు మరో ఇద్దరు కుటుంబసభ్యులు మృతి చెందారు. కాగా, నిందితులు మాత్రం చిన్న గాయాలతో ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.

కోమటిరెడ్డికి విషాదం మిగిల్చిన కొడుకు మృతి

కోమటిరెడ్డికి విషాదం మిగిల్చిన కొడుకు మృతి

మెదక్ జిల్లా రామచంద్రాపురం మండలం కొల్లూరు వద్ద డిసెంబర్ 19, 2011 జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మాజీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుమారుడు ప్రతీక్ రెడ్డి మరణించాడు. ప్రతీక్ రెడ్డితో పాటు సుచిత్ రెడ్డి, చంద్రారెడ్డి అనే యువకులు కూడా ఈ ప్రమాదంలో మరణించారు. ఎదురుగా వస్తున్న గొర్రెలను తప్పించబోయి ప్రతీక్ రెడ్డి కారు డివైడర్‌కు ఢీకొట్టింది. దీంతో కారు నుజ్జు నుజ్జు అయింది. హైదరాబాద్ నుంచి పటాన్‌చెరులోని ఓ మిత్రుడి ఇంటికి కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం సంభవించించింది. కొడుకు మృతితో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుటుంబంలో విషాదం నెలకొంది. కోమటిరెడ్డి కొడుకు మృతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు.

అజారుద్దీన్ కొడుకు: రేసింగ్ తీసిన ప్రాణం

అజారుద్దీన్ కొడుకు: రేసింగ్ తీసిన ప్రాణం

ఔటర్ రింగ్ రోడ్డుపై బైక్ రేసింగ్‌ల్లో పాల్గొన్న భారత మాజీ కెప్టెన్ మొహమ్మద్ అజారుద్దీన్(19) కొడుకు మొహమ్మద్ అయాజుద్దీన్ బైక్‌పై నుంచి పడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సెప్టెంబర్ 17, 2011న మృతి చెందాడు. దీంతో అజారుద్దీన్ కుటుంబంలో తీరని శోకం మిగిలింది.

కోట శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం

కోట శ్రీనివాసరావు కుటుంబంలో విషాదం

ఆదివారం(జూన్ 20, 2010) జరిగిన రోడ్ యాక్సిడెంట్ లో సీనియర్ సినీ నటుడు కోట శ్రీనివాసరావు కుమారుడు వెంకటసాయి ప్రసాద్‌(39) మృతి చెందాడు. తన ఏకైక కుమారుడు ప్రమాదంలో చనిపోవడంతో కోట శ్రీనివాసరావు భాధకి అంతులేకుండా పోయింది. కోట కొడుకు వెంకట సాయిప్రసాద్‌ తన స్పోర్ట్స్‌ బైక్ ‌పై శంషాబాద్‌ వెళ్తుండగా ఈ దుర్ఘటన జరిగింది. కోట ప్రసాద్‌ భార్య, పిల్లలు, స్నేహితుడి కుటుంబంతో కలిసి ఓ వేడుకలో పాల్గొనేందుకు ఆదివారం మధ్యాహ్నం 1 గంటకు ఫిలింనగర్‌ నుంచి శంషాబాద్‌ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలోని నోవాటెల్‌ హోటల్ ‌కు బయల్దేరారు. ప్రసాద్‌ తన 1000 సీసీ స్పోర్ట్స్‌ బైకు(ఏపీ0938 డీఎక్స్‌-8474)పై ఒంటరిగా వెళుతున్నారు. మిగతా వారంతా కలిసి కారులో ప్రయాణిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌ పోలీసు అకాడమీ (అప్పా) దాటిన తరువాత దర్గా మలుపు వద్ద ఓ డీసీఎం(ఏపీ29టీఏ-4656) రింగురోడ్డుపైకి దూసుకొచ్చింది. బైక్ ‌పై వేగంగా వెళుతున్న ప్రసాద్‌ డీసీఎంను గమనించి హఠాత్తుగా బ్రేక్‌ వేశారు. దీంతో బైక్‌ రోడ్డును రాసుకుంటూ వెళ్లి డీసీఎం వ్యానును ఢీకొట్టింది. ఒక్కసారిగా బ్రేక్‌ వేయటంతో ప్రసాద్‌ ఎగిరి ఇరవై అడుగుల దూరంలో పడ్డారు. ఆయన తలకు తీవ్ర గాయాలై మరణించారు.

బాబు మోహన్ కొడుకు

బాబు మోహన్ కొడుకు

ప్రముఖ సినీ నటుడు, రాజకీయ నేత బాబు మోహన్ కుమారుడు పి పవన్ కుమార్(26) కూడా నగరంలో అక్టోబర్ 12, 2003లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన అతను ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న సమయంలోనే ఈ ప్రమాదం చోటు చేసుకోవడం జరిగింది. ద్విచక్ర వాహనంపై వేగంగా ఇంటికి వెళుతున్న సమయంలో బైక్ అదుపుతప్పి డివైడర్‌కు ఢీకొట్టడంతో వపన్ కుమార్ అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. పవన్ మృతితో బాబు మోహన్ కుటుంబంలో విషాదఛాయలు నెలకొన్నాయి.

హరికృష్ణ కొడుకు

హరికృష్ణ కొడుకు

రెండేళ్ల క్రితం సినీనటుడు, టీడీపీ నేత హరికృష్ణ కుమారుడు నందమూరి జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలోనే మృతి చెందారు. హరికృష్ణ పెద్ద కుమారుడు జానకీరామ్‌ 2014, డిసెంబర్‌ 6న నల్గొండ జిల్లా ఆకుపాముల వద్ద హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డుప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

నిశిత్

నిశిత్

హైదరాబాద్ జూబ్లీహిల్స్‌ రోడ్‌ నెంబర్‌ 36లో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డుప్రమాదంలో ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్‌ నారాయణ(22), అతడి స్నేహితుడు రవిచంద్ర మృతి చెందారు. వీరిద్దరూ ప్రయాణిస్తున్న బెంజ్‌ కారు అదుపుతప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. గురువారం నెల్లూరులో నిశిత్ అంత్యక్రియలు జరగనున్నాయి. కాగా, ఏపీకి చెందిన టీడీపీ కీలక నేతలు ఎర్రన్నాయుడు, లాల్ జాన్ బాషా, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత శోభానాగిరెడ్డిలు కూడా రోడ్డు ప్రమాదాల్లోనే ప్రాణాలు కోల్పోయారు. దాదాపు అన్ని రోడ్డు ప్రమాదాలకు అతివేగం, నిర్లక్ష్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది.

English summary
Celebrity families have got tragedy with road accidents in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X