హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారికాసి దోపిడీలు: ముఠా అరెస్ట్, రూ.2లక్షలు, ఆటో సీజ్(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలో దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను డీసీపీ సత్యనారాయణ సోమవారం మీడియాకు తెలిపారు. శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మిస్త్రీగంజ్ ప్రాంతానికి చెందిన మహ్మమద్ ఫైసల్ (21) ఏయిర్‌టెల్ సంస్థలో సిమ్ కార్డ్ అమ్మకాలు చేపడుతూ గడిచిన రంజాన్ మాసంలో హలీం విక్రయాలు చేసేవాడు.

అయితే, రెండు రకాల పనులు చేస్తున్నా.. అధిక మొత్తంలో డబ్బులు రావడం లేదని గ్రహించిన ఫైసల్.. ఎలాగైనా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. ఈ క్రమంలో నగరంలోని వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తన స్నేహితులకు తన ప్రణాళికలను తెలిపాడు.

హుస్సేనిఅలం దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన మహ్మమద్ రియాజుద్దీన్ (20), గోల్కొండ, చోటే బజార్ ప్రాంతానికి చెందిన షేక్ ఆబు బకార్ (20), మోతి దర్వాజా గోల్కొండకు చెందిన అబ్థుల్ ఇమ్రాన్ (23), టోలిచౌకి ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసీఫ్ (21), మెహదీపట్నంకు చెందిన మహ్మమద్ ముక్తార్ (18)లను గ్యాంగ్ సభ్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు.

కాగా, మదీనా ప్రాంతంలోని షాదాబ్ హోటల్ ఔట్‌లెట్‌ను శాలిబండ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. అక్కడ అమ్మకాలు జరిగిన మొత్తాన్ని ఏ రోజుకారోజు మదీనా ప్రాంతంలోని ప్రధాన హోటళ్లలో జమ చేసేవారు. ఈ క్రమంలో జూన్ 29న ఔట్‌లెట్‌లో పని చేసే వ్యక్తులు అమ్మకాలు జరిపిన మొత్తాన్ని తీసుకుని చేలాపుర మీదుగా అర్థరాత్రి షాబాద్ హోటల్‌కు బయలుదేరారు.

దోపిడీ ముఠా అరెస్ట్

దోపిడీ ముఠా అరెస్ట్

హైదరాబాద్ నగరంలో దోపిడీలకు పాల్పడుతున్న ఓ ముఠా సభ్యులను సౌత్ జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ మేరకు వివరాలను డీసీపీ సత్యనారాయణ సోమవారం మీడియాకు తెలిపారు.

దోపిడీ ముఠా అరెస్ట్

దోపిడీ ముఠా అరెస్ట్

శాలిబండ పోలీస్‌స్టేషన్ పరిధిలోని మిస్త్రీగంజ్ ప్రాంతానికి చెందిన మహ్మమద్ ఫైసల్ (21) ఏయిర్‌టెల్ సంస్థలో సిమ్ కార్డ్ అమ్మకాలు చేపడుతూ గడిచిన రంజాన్ మాసంలో హలీం విక్రయాలు చేసేవాడు.

దోపిడీ ముఠా అరెస్ట్

దోపిడీ ముఠా అరెస్ట్

అయితే, రెండు రకాల పనులు చేస్తున్నా.. అధిక మొత్తంలో డబ్బులు రావడం లేదని గ్రహించిన ఫైసల్.. ఎలాగైనా పెద్ద ఎత్తున డబ్బులు సంపాదించాలని పథకం వేశాడు. ఈ క్రమంలో నగరంలోని వేరు ప్రాంతాల్లో నివసిస్తున్న తన స్నేహితులకు తన ప్రణాళికలను తెలిపాడు.

దోపిడీ ముఠా అరెస్ట్

దోపిడీ ముఠా అరెస్ట్

హుస్సేనిఅలం దూద్‌బౌలి ప్రాంతానికి చెందిన మహ్మమద్ రియాజుద్దీన్ (20), గోల్కొండ, చోటే బజార్ ప్రాంతానికి చెందిన షేక్ ఆబు బకార్ (20), మోతి దర్వాజా గోల్కొండకు చెందిన అబ్థుల్ ఇమ్రాన్ (23), టోలిచౌకి ప్రాంతానికి చెందిన సయ్యద్ ఆసీఫ్ (21), మెహదీపట్నంకు చెందిన మహ్మమద్ ముక్తార్ (18)లను గ్యాంగ్ సభ్యులుగా ఏర్పాటు చేసుకున్నాడు.

చేలాపుర ప్రాంతానికి ద్విచక్ర వాహనంపై చేరుకున్న షాబాద్ హోటల్ ఔట్‌లెట్ నిర్వహకులను అడ్డగించిన గ్యాంగ్ సభ్యులు వారి కళ్లల్లో కారం చల్లి నగదును , ఓ సెల్ ఫోన్‌ను తస్కరించుకుని పోయారు. జులై 5 వతేదిన శాలిబండ ప్రాంతంలోని అనుశ్రీ అపార్ట్‌మెంట్లో ఏయిర్‌టెల్ సిమ్ కార్డుల డిస్ట్రిబ్యూషన్ నిర్వహించే షాపులోకి ఇఫ్తార్ సమయంలో ప్రవేశించిన గ్యాంగ్ సభ్యులు అక్కడ విధులు నిర్వహిస్తున్న నవీన్ అనే వ్యక్తిపై దాడి చేశారు. డిస్ట్రిబ్యూషన్ షాపులో ఉన్న దాదాపు 3 లక్షల 40 వేల నగదును ఎత్తుకెళ్లారు.

భాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఆదివారం సాయంత్రం చార్మినార్ బస్‌స్టాండ్ సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఫైసల్‌ను అదుపులోకి తీసుకున్న టాస్క్‌ఫోర్క్ పోలీసులు విచారణ చేపట్టగా చేసిన నేరాలను ఒప్పు కున్నాడు. నిందితుల నుండి 2 లక్షల నగదుతోపాటు 3సెల్ ఫోన్‌లు, దోపిడీకి ఉప యోగించిన ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. కేసు దర్యాప్తులో ఆధారాలు సేకరించడంలో కీలక పాత్ర పోషించిన ఇన్స్‌పెక్టర్ యాదగిరిని ఈ సందర్భంగా డీసీపీ అభినందించారు. ఈ సమావేశంలో టాస్క్‌ఫోర్స్ అదనపు డీసీపీ కోటిరెడ్డి తదితరులు ఉన్నారు.

English summary
A Robbery gang arrested in Hyderabad South Zone on Monday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X