హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

దారుణం: రూ. 230 కోసం వ్యాపారిని హత్య చేశారు

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వివిధ ప్రాంతాల నుంచి వచ్చి హైదరాబాద్ నగరంలో స్థిరపడ్డారు. చెడు అలవాట్లకు బానిసలు కావడంతో వచ్చే సంపాదన చాలకపోవడంతో ముఠాగా ఏర్పడి ఎంజీబీఎస్ కేంద్రంగా దొంగతనాలకు పాల్పడ్డారు. వారం రోజుల్లో నాలుగు నేరాలు చేసిన ఈ ముఠా ఓ వ్యాపారిని కిడ్నాప్ చేసి హత్య చేసింది.

ఈ ముఠాకు చెందిన నలుగురిని ఈస్ట్ జోన్ టాస్క్‌పోర్స్ పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. టాస్క్‌ఫోర్స్‌ అదనపు డీసీపీ ఎన్‌.కోటిరెడ్డితో కలిసి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఈస్ట్ జోన్ డీసీపీ డాక్టర్‌ వి.రవీందర్‌ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి.

మధ్యప్రదేశ్, బీహార్, కర్ణాటకల్లోని వివిధ ప్రాంతాలకు చెందిన ఇక్బాల్‌ ఖాన్‌ పఠాన్, మహ్మద్‌ రెహాన్‌ అన్సారీ, షేక్‌ జావేద్‌ బతుకు తెరువు కోసం నగరానికి వలసవచ్చారు. కూలీ పనులు చేస్తూ పొట్టపోసుకునే వీరికి టోలిచౌకి ప్రాంతానికి చెందిన ఇలియాస్‌ అలీ ఖాన్‌తో పరిచయమైంది.

చెడు అలవాట్లకు బానిసైన వీరంతా తేలిగ్గా డబ్బు సంపాదించడం కోసం నేరవృత్తిని ఎంచుకున్నారు. వ్యసనాలు పెరిగిపోవడంతో పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించడం కోసం దోపిడీలు, భారీ దొంగతనాలు చేయాలని ఓ పథకం వేశారు. ఇందులో భాగంగా ఈ నెల 15న సైఫాబాద్‌ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి నుంచి ల్యాప్‌టాప్స్, హార్డ్‌డిస్క్‌లు ఉన్న బ్యాగ్‌ను దొంగిలించారు.

దారుణం: రూ. 230 కోసం వ్యాపారిని హత్య చేశారు

దారుణం: రూ. 230 కోసం వ్యాపారిని హత్య చేశారు

ఈ ముఠా అఫ్జల్‌గంజ్‌లోని మహాత్మాగాంధీ బస్‌స్టేషన్‌-శివాజీ బ్రిడ్జ్‌ మధ్య ఉన్న ‘మూసీ పరీవాహక ప్రాంతాన్ని' తమ అడ్డాగా ఎంచుకున్నారు. ఆ మార్గంలో వెళ్లే వారిని మూసీ ఒడ్డుకు లాక్కెళ్లి దోపిడీ చేయడం అలవాటుగా మార్చుకున్నారు. ఈ నెల 19 రాత్రి ఆ మార్గంలో వెళ్తున్న షేక్‌ అబ్దుల్‌ ఖరీద్‌ను వెంబడించిన ఈ నలుగురూ అదును చూసుకుని అతడిని మూసీ ఒడ్డుకు లాక్కుపోయారు.

దారుణం: రూ. 230 కోసం వ్యాపారిని హత్య చేశారు

దారుణం: రూ. 230 కోసం వ్యాపారిని హత్య చేశారు

అక్కడ ఖరీద్‌ జేబులు తనిఖీ చేసిన ఈ దుండగులకు పర్సులో కేవలం రూ.230 లభించాయి. దీంతో విచక్షణ కోల్పోయిన నలుగురూ అతడిని హత్య చేశారు. ఇది జరిగిన రెండు రోజులకు ద్విచక్రవాహనంపై ఒంటరిగా వెళ్తున్న వ్యక్తిని లిఫ్ట్‌ ఇవ్వమంటూ ఎక్కిన ముఠా సభ్యుడు శివాజీ బ్రిడ్జ్‌ సమీపంలోని సబ్‌-స్టేషన్‌ వద్దకు తీసుకువచ్చాడు.

దారుణం: రూ. 230 కోసం వ్యాపారిని హత్య చేశారు

దారుణం: రూ. 230 కోసం వ్యాపారిని హత్య చేశారు

అక్కడ వాహనం ఆపించగా... మిగిలిన ముగ్గురూ దాడి చేసి బలవంతంగా మూసీ ఒడ్డుకు తీసుకువెళ్ళారు. బాధితుడి నుంచి రెండు సెల్‌ఫోన్లు, నగదు దోచుకుని పారిపోయారు. ఈ నెల 20న రాత్రి 9 గంటల ప్రాంతంలో సబ్‌-స్టేషన్‌ వద్దకు మూత్ర విసర్జనకు వచ్చిన వ్యక్తిని పట్టుకున్న దుండగులు మూసీ ఒడ్డుకు లాక్కువెళ్ళి దాడి చేశారు. అతని వద్ద ఉన్న రూ.2వేల నగదు, రెండు బంగారు బ్రాస్‌లెట్లు, బంగారు ఉంగరం, సెల్‌ఫోన్‌ లాక్కెళ్లారు.

దారుణం: రూ. 230 కోసం వ్యాపారిని హత్య చేశారు

దారుణం: రూ. 230 కోసం వ్యాపారిని హత్య చేశారు

గాయపడిన అతను అతి కష్టం మీద అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. దీంతో ఈస్ట్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ శ్రీధర్‌ నేతృత్వంలోని బృందం రంగంలోకి దిగింది. మంగళవారం ఎంజీబీఎస్‌ వద్ద నిఘా వేసి నలుగురినీ అరెస్టు చేసి అఫ్జల్‌గంజ్‌ పోలీసులకు అప్పగించింది. వీరి నుంచి ఐదు సెల్‌ఫోన్‌లు, ఐదు తులాల బంగారు అభరణాలు, ల్యాప్‌టాప్‌ స్వాధీనం చేసుకున్నారు.

English summary
West Zone police busted an interstate gang and arrested four people who kidnapped and killed a trader for just Rs 230. The gang used to stand near MGBS bus station and rob pedestrians by forcibly dragging them to the isolated river bed of Musi. They robbed three people in the last two weeks in the same manner, in which one victim died and two others were injured.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X