మెదక్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫెడ్ బ్యాంకులో భారీ చోరీ: కేజీ గోల్డ్, రూ. లక్ష అపహరణ(పిక్చర్స్)

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: మల్కాజ్‌గిరిలోని ఫెడ్ బ్యాంకులో మంగళవారం వేకువజామున భారీ చోరీ జరిగింది. ఘటనకు సంబంధించి మల్కాజ్‌గిరి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గీతానగర్‌లో ఉన్న ఫెడరల్ బ్యాంకు అనుబంధ విభాగమైన ఫెడ్ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున దుండగులు బ్యాంకు షెటర్లు తెరిచి చోరీకి పాల్పడ్డారు.

ఈ ఘటనలో బ్యాంకులోని కిలో బంగారం, రూ. 1.25 లక్షల నగదును దొంగలు అపహరించారు. మల్కాజ్‌గిరి ఏసిపి రవిచంద్రన్ రెడ్డి, సిఐ శేఖర్ గౌడ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు. బ్యాంకులో బంగారం చోరీకి గురైందన్న విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు వద్దకు వచ్చి వారు తాకట్టు పెట్టిన బంగారం వివరాలు తెలియజేస్తున్నారు.

నగరంలో భద్రతపై పోలీసుల ప్రత్యేక డ్రైవ్

హైదరాబాద్ నగరంలోని బహిరంగ ప్రదేశాల్లో భద్రత అంశంపై పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ను చేపట్టారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్‌లు, పార్కులు తదితర ప్రాంతాల్లో పోలీసులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో వీధిబాలలు సహా 566 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరి వివరాలను, ఫొటోలను, వేలిముద్రలను సేకరిస్తున్నారు.

రోడ్డుప్రమాదంలో నలుగురికి తీవ్రగాయాలు

మెదక్: ఆర్టీసీ బస్సును ఓ లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన జిల్లాలోని కొల్చారం మండలం కిష్టాపూర్‌లో చోటుచేసుకుంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు.

బ్యాంకు దోపిడీ

బ్యాంకు దోపిడీ

మల్కాజ్‌గిరిలోని ఫెడ్ బ్యాంకులో మంగళవారం వేకువజామున భారీ చోరీ జరిగింది.

బ్యాంకు దోపిడీ

బ్యాంకు దోపిడీ

ఘటనకు సంబంధించి మల్కాజ్‌గిరి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. గీతానగర్‌లో ఉన్న ఫెడరల్ బ్యాంకు అనుబంధ విభాగమైన ఫెడ్ బ్యాంకులో మంగళవారం తెల్లవారుజామున దుండగులు బ్యాంకు షెటర్లు తెరిచి చోరీకి పాల్పడ్డారు.

బ్యాంకు దోపిడీ

బ్యాంకు దోపిడీ

ఈ ఘటనలో బ్యాంకులోని కిలో బంగారం, రూ. 1.25 లక్షల నగదును దొంగలు అపహరించారు.

బ్యాంకు దోపిడీ

బ్యాంకు దోపిడీ

మల్కాజ్‌గిరి ఏసిపి రవిచంద్రన్ రెడ్డి, సిఐ శేఖర్ గౌడ్‌ల ఆధ్వర్యంలో ప్రత్యేక క్లూస్ టీం సిబ్బంది ఆధారాలు సేకరిస్తున్నారు.

బ్యాంకు దోపిడీ

బ్యాంకు దోపిడీ

బ్యాంకులో బంగారం చోరీకి గురైందన్న విషయం తెలుసుకున్న ఖాతాదారులు బ్యాంకు వద్దకు వచ్చి వారు తాకట్టు పెట్టిన బంగారం వివరాలు తెలియజేస్తున్నారు.

బ్యాంకు దోపిడీ

బ్యాంకు దోపిడీ

పెడరల్ బ్యాంకు ప్రతినిధి శివప్రసాద్ మాట్లాడుతూ.. తమ బ్యాంకుకు ఈ బ్రాంచ్‌తో ఎలాంటి సంబంధం లేదని
అన్నారు. కేవలం ఇక్కడ ఆభరణాలు తాకట్టుపెట్టుకుని రుణాలు ఇస్తారని తెలిపారు.

బ్యాంకు దోపిడీ

బ్యాంకు దోపిడీ

ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

బ్యాంకు దోపిడీ

బ్యాంకు దోపిడీ

సిసి కెమెరాల్లో నమోదైన ఫుటేజీ ఆధారంగా ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.

బ్యాంకు దోపిడీ

బ్యాంకు దోపిడీ

కాగా, సెక్యూరిటీ గార్డు లేని కారణంగానే అత్యంత రద్దీగా ఉండే ప్రాంతంలోని బ్యాంకులో దోపిడీ జరిగినట్లు తెలుస్తోంది.

English summary
Robbers on Tuesday early morning robbed in Federal Bank in Malkajgiri, Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X