వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణ సెక్రటేరియట్ లో దోంగలు పడ్డారు ! ?

|
Google Oneindia TeluguNews

అంత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉంటే తెలంగాణ సెక్రటేరియట్ లో దోంగలు పడ్డారు, ఓ సీనియర్ మంత్రికి చెందిన పేషిలో కంప్యూటర్ హర్డ్ డిస్క్ లు, విలువైన ఫైళ్లు మాయం చేశారు. హర్డ్ డిస్క్ ల్లో ఉన్న కీలక సమాచారాన్ని తీసుకునేందుకు వాటిని ఎత్తుకెళ్లారని ఉన్నతాధికారులు భావిస్తున్నారు.

కీలక సమాచారం ఉండే సేక్రటేరియట్

కీలక సమాచారం ఉండే సేక్రటేరియట్

ప్రధానంగా ప్రభుత్వ పరిపాలన అంతా సెక్రటేరియట్ నుండే కొనసాగుతోంది.ఈ నేపథ్యంలోనే పలువురు మంత్రులకు చెందిన ఎన్నో ఫైల్స్, పలు అంశాలకు సంబంధిచిన సమాచారం అంతా అక్కడే భద్రపరచి ఉంచుతారు, ఈనేపథ్యంలనే పలు సెక్యూరిటి రీజన్స్ ను దృష్టిలో పెట్టుకుని ఐడి ప్రూఫ్ లేకుండా లోనికి అనుమతించరు, సాధారణ ప్రజలకైతే, మధ్యహ్నం తర్వాత, ఒక గంటపాటు అధికారులను కలిసేందుకు అనుమతిని ఇస్తారు.సెక్రటేరియట్ భద్రతా కోసం ప్రత్యేకంగా పోలీసు అధికారులు ఉంటారు. ఎలాంటీ దోంగతనాలు జరగకుండా చుట్టూ భద్రతా వలయం ఉంటుంది..అయినా అప్పుడప్పుడు అందులో దొంగలు పడుతూనే ఉంటారు, మంత్రుల పేషిలో సైతం పలు ఫైళ్లు ,కంప్యూటర్ హర్డ్ డిస్క్ లు ఎత్తుకెళ్లిపోతారు.

ప్రభుత్వంలోని కీలక మంత్రి పేషిలో దోంగలు

ప్రభుత్వంలోని కీలక మంత్రి పేషిలో దోంగలు

తాజగా మరోసారి ప్రభుత్వంలోని కీలక స్థానంలో ఉన్న ఓ మంత్రి పేషిలో దోంగలు పడ్డారు, ఆయన కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ హర్డ్ డిస్క్ లు మాయం చేశారు. చాల రోజుల తర్వాత వచ్చిన మంత్రి పేషి సిబ్బంది దోంగలు పడ్డ విషయాన్ని గమనించి అవాక్కాయ్యారు. సాధరణంగా ప్రభుత్వాలు రద్దు అయిన తర్వాత ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో జీఏడీ అధికారులు ఆ మంత్రి పేషి స్వాధినం చేసుకుని సీలు వేశారు. సదరు మంత్రి ఇటివల తిరిగి భాద్యతలు చేపట్టిన నేపథ్యంలో కార్యాలయంలోని కంప్యూటర్లను ఓపేన్ చేశారు.అవి పనిచేయకపోవడంతో సంబంధిత ఐటి డిపార్ట్ మెంట్ కు కోత్తవి ఇవ్వాలని కోరారు. దీంతో వాటిని పరీశీలించిన ఐటి డిపార్ట్ మెంట్ అందులో కీలక సమాచారం ఉండే హర్డ్ డిస్క్ లు మాయం అయినట్టు తెలిపారు.

సాఫ్ట్ వేర్ బ్ర‌హ్మీల‌కు మెట్రో ప్ర‌యాణం బెస్ట్..! హైటెక్ సిటీ రూట్లో మ‌రిన్ని అద‌న‌పు సౌక‌ర్యాలుసాఫ్ట్ వేర్ బ్ర‌హ్మీల‌కు మెట్రో ప్ర‌యాణం బెస్ట్..! హైటెక్ సిటీ రూట్లో మ‌రిన్ని అద‌న‌పు సౌక‌ర్యాలు

అంతర్గత విచారణ

అంతర్గత విచారణ

దీనిపై అధికారులు పోలీసువిచారణకు అదేశం ఇవ్వకుండా అంతర్గత విచారణ చేపట్టారు, సాధరణంగా బయటి వ్యక్తులు వచ్చి వాటిని తీసుకెళ్లే సాహసం చేయరు కాబట్టి ఇంటి దోంగల పని అయి ఉంటుందని భావించిన అధికారులు అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలుస్తోంది.

English summary
robbery in telangana minister peshi at secretariat, hard disks and other importent information theft internal enquiry is going on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X