వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రోహిత్ వేముల దళితుడు కాడు: తెలంగాణకు చెప్పిన ఎపి

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: కేంద్రీయ విశ్వవిద్యాలయంలో అప్పట్లో ఆత్మహత్య చేసుకున్న పరిశోధక విద్యార్థి రోహిత్ వేముల దళితుడు కాడని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. రోహిత్ వేముల ఎస్టీ కాడని తెలియజేస్తూ గుంటూరు జిల్లా రెవెన్యూ అధికారులు పంపిన నివేదిక తమకు అందినట్లు సైబరాబాద్ పోలీసు కమిషనర్ సందీప్ శాండిల్య చెప్పారు.

కేసులో తదుపరి తీసుకోవాల్సిన చర్యలను తెలియజేయాలని కోరుతూ ఆ నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు ఆయన శుక్రవారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. రోహిత్ వేముల గుంటూరు జిల్లాకు చెందినవాడు కావడం వల్ల అతని కులాన్ని తెలియజేయాలని అక్కడి జిల్లా రెవెన్యూ అదికారలను పోలీసులు కోరినట్లు ఆయన తెలిపారు.

Rohit Vemula isn’t Dalit, AP tells Telangana cops

హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయంలో పిహెచ్‌డి చేస్తు్న రోహత్ వేముల 2016లో ఆత్మహత్య చేసుకున్నాడు. అకడమిక్స్ నుంచి సస్పెండ్ చేసి, హాస్టల్ నుంచి బహిష్కరించడంతో అతను ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి.

రోహిత్ వేముల ఆత్మహత్యతో విశ్వవిద్యాలయంలో ఆందోళనలు పెల్లుబుకాయి. అప్పటి కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయపై, విసి అప్పారావుపై, మరో ముగ్గురిపై ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టారు.

English summary
Cyberabad Police commissioner Sandeep Shandilya said that the department has received a report from the revenue officials of Guntur district stating that Rohit Vemula did not belong to a Scheduled Caste.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X