వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హెచ్‌సియులో ఉద్రిక్తత: క్లాస్‌లకు వెళ్తుంటే అడ్డుకున్న ఏఎస్ఏ

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గురువారం నాడు ఉద్రిక్త పరిస్థితులు చోటు చేసుకున్నాయి. కొందరు విద్యార్థులు రీసెర్చ్ కొనసాగిస్తామని చెప్పగా, ఏఎస్ఏ సభ్యులు వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. వేముల రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హెచ్‌సియులో కొద్ది రోజులుగా ఉద్రిక్తత కనిపిస్తోంది.

Pics: HCU లో ఉద్రిక్తత

చాలామంది విద్యార్థులు తమకు క్లాసులు పోతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేముల రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నారని కొందరు విద్యార్థులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో గురువారం విద్యార్థులు రీసెర్చ్ కొనసాగిస్తామని చెబుతూ... క్లాసులకు హాజరయ్యేందుకు వెళ్లారు.

Rohit Vemula suicide: Tension soars as students going for classes

వారిని ఏఎస్ఏ సభ్యులు అడ్డుకున్నారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో ఆయనకు న్యాయం జరిగే వరకు లోనికి వెళ్లనిచ్చేది లేదని అడ్డుకున్నారు. క్లాసులకు వెళ్తున్న ప్రతి విద్యార్థిని ఏఎస్ఏ సభ్యులు అడ్డుకుంటున్నారు. క్లాసులను బహిష్కరించాల్సిందేనని డిమాండ్ చేస్తున్నారు.

మరోవైపు, ఇప్పటికే తమకు ఆలస్యం అవుతోందని, క్లాసులకు హాజరవుతామని విద్యార్థులు చెబుతున్నారు. సైన్స్ విభాగం ఎదుట వారు బైఠాయించారు. ఇరువర్గాల విద్యార్థులు పోటా పోటీగా నినాదాలు చేశారు. రోహిత్ ఆత్మహత్యను రాజకీయం చేస్తున్నాయని ఏబీవీపీ ఇప్పటికే ఆరోపిస్తోంది.

English summary
Tension soars as students going for classes in Hyderabad Central University.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X