వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అట్టుడికిన హెచ్‌సియు: యాక్టింగ్ వీసీకి చేదు అనుభవం (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వేముల రోహిత్ ఆత్మహత్యపై హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం అట్టుడుకుతోంది. బుధవారం విశ్వవిద్యాలయం ఇంచార్జీ వీసి శ్రీవాస్తవకు చేదు అనుభవం ఎదురైంది. శ్రీవాస్తవ మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో దీక్షాస్థలి వద్ద ప్రత్యక్షమయ్యారు.

అయితే,విద్యార్థులు ఆయన్ను చట్టుముట్టి.. ‘వీసీ గోబ్యాక్‌... వీసీ డౌన డౌన' అంటూ నినాదాలు చేశారు. దీంతో వీసీ వెనక్కు వెళ్లారు. వలయంగా ఏర్పడ్డ పోలీసులు ఆయన్ను కారులో ఎక్కించారు. అయినప్పటికీ కొంత మంది విద్యార్థులు ఆయన కారుపై దాడికి యత్నించారు.

విశ్వవిద్యాలయంలో ప్రశాంత వాతావరణాన్ని నెలకొల్పేందుకు వరుసగా ప్రొఫెసర్లు, డీన్లతో సమావేశాలు నిర్వహిస్తూ పరిస్థితిని సమీక్షిస్తున్న శ్రీవాస్తవ అందులో భాగంగానే దీక్షా స్థలికి వచ్చినట్లు అధికారులు తెలిపారు.

దీక్షా స్థలికి వచ్చిన వీసీ

దీక్షా స్థలికి వచ్చిన వీసీ

విద్యార్థులు దీక్షలు చేస్తున్న శిబిరానికి బుధవారం మధ్యాహ్నం ఇంచార్జీ వీసీ శ్రీవాస్తవ వచ్చారు. అయితే, ఆయనను విద్యార్థులు ఘెరావ్ చేశారు.

విద్యార్థులకు సంఘీభావం

విద్యార్థులకు సంఘీభావం

దీక్ష చేస్తున్న హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం విద్యార్థులకు బయటి నుంచి కూడా మద్దతు లభిస్తోంది.

ఆ బ్లాక్ తెరిపిస్తా..

ఆ బ్లాక్ తెరిపిస్తా..

పరిపాలనా విభాగం బ్లాక్‌ను గురువారం ఉదయం తెరుస్తామని ఇన్‌చార్జ్‌ వీసీ శ్రీవాస్తవ తెలిపారు. బుధవారం సాయంత్రం వర్సిటీ ఫ్యాకల్టీ, డీన్లతో సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్నట్లు శ్రీవాస్తవ తెలిపారు.

ఒక్కరికి ఉద్యోగం...

ఒక్కరికి ఉద్యోగం...


రోహిత్ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కోసం ఎంహెచఆర్‌డీకి లేఖ రాయాలని నిర్ణయించినట్లు శ్రీవాస్తవ తెలిపారు. విద్యార్థులతో మాట్లాడేందుకు వెళ్లిన తనను ఘెరావ్‌ చేయడాన్ని ఆయన వ్యతిరేకించారు.

ఇంచార్జీ వీసి ఆవేదన

ఇంచార్జీ వీసి ఆవేదన

ఉదయం తన ఇంటిని చుట్టముట్టడంపై కూడా శ్రీవాస్తవ అభ్యంతరం వ్యక్తంచేశారు. ఈ అంశంపై స్థానిక డీసీపీతో మాట్లాడినట్లు ఆయన తెలిపారు.

దొరకని అవకాశం...

దొరకని అవకాశం...

వీసీ అప్పారావు సెలవుపై వెళ్లడంతో శ్రీవాస్తవ వీసీ బాధ్యతలు స్వీకరించారు. విశ్వవిద్యాలయంలో పరిస్థితులను చక్కదిద్దడం ఆయనకు తలకు మించిన భారంగా మారింది.

వీసీకి తీవ్ర వ్యతిరేకత

వీసీకి తీవ్ర వ్యతిరేకత

పరిస్థితులు చక్కదిద్దడానికి తీసుకోవాల్సిన చర్యలపై మాట్లాడేందుకు వచ్చిన శ్రీవాస్తవకు దీక్షా శిబిరం వద్ద వ్యతిరేకత ఎదురైంది.

వలయంగా ఏర్పడి...

వలయంగా ఏర్పడి...

వీసీ గో బ్యాక్ అంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ ఆయనను చుట్టుముట్టారు. దీంతో ఆయన చుట్టూ పోలీసులు వలయంగా ఏర్పడి బయటకు తీసుకుని వెళ్లారు.

చేసేది లేక...

చేసేది లేక...

విద్యార్థులు తనతో మాట్లాడేందుకు సిద్ధంగా లేకపోవడంతో చేసేది లేక ఇంచార్జీ వీసీ వెనుదిరిగారు.

English summary
HCU students rejected to hold talks with Incharge VC Srivastava.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X