హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రోహిత్ ఆత్మహత్య, హెచ్‌సియులో ఏళ్లుగా గ్రూపులు: టార్గెట్ మోడీ! (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయంలో (హెచ్‌సియు) వేముల రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా సంచలనం రేపుతోంది. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో విపక్షాలు, కొన్ని విద్యార్థి సంఘాలు కేంద్రమంత్రులు బండారు దత్తాత్రేయ, స్మృతి ఇరానీ, వైస్ ఛాన్సులర్ అప్పారావు రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

రోహిత్ ఆత్మహత్య పైన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, బిఎస్పీ అధినేత్రి మాయావతి, కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ తదితరులు స్పందించారు. ముంబై, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కొన్ని విద్యార్థి సంఘాలు ఆందోళనలు నిర్వహించాయి.

రోహిత్ ఆత్మహత్య దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది. కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ లేఖ, స్మృతి ఇరానీ యూనివర్సిటీకి ఆ లేఖను పంపించడం, రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో బిజెపిని చిక్కుల్లో పడేసేందుకు విపక్షాలు ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే, ఈ అంశం తమకు అంటకుండా బిజెపి ప్రయత్నాలు చేస్తోంది.

దత్తాత్రేయ లేఖ వల్లనే రోహిత్ ఆత్మహత్య చేసుకున్నాడని, ఇందుకు దత్తాత్రేయ స్మృతి ఇరానీ రాజీనామా చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. కేజ్రీవాల్ అయితే ప్రధాని నరేంద్ర మోడీ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రధాని మోడీకి దమ్ముంటే రోహిత్ ఆత్మహత్య పైన ట్వీట్ చేయాలని అసదుద్దీన్ ఓవైసీ అన్నారు.

మరోవైపు, దత్తాత్రేయ లేఖకు, రోహిత్ ఆత్మహత్యకు సంబంధం లేదని బిజెపి స్పష్టం చేసింది. కాంగ్రెస్, తెరాసలు బిసి నేత బండారు దత్తాత్రేయను లక్ష్యంగా మార్చుకున్నారని బిజెపి తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి ఆరోపించారు. రోహిత్ ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుమొద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.

గతంలో విశ్వవిద్యాలయాల్లో పలుమార్లు ఆత్మహత్యలు జరిగాయని, అలాగే, వరంగల్లో రాజయ్య కోడలు, మనవళ్ల ఆత్మహత్యలు జరిగాయని, అప్పుడు రాహుల్ గాంధీ ఎందుకు రాలేదని బిజెపి నేతలు ప్రశ్నించారు. రాజకీయం చేసేందుకే రాహుల్ గాంధీ వచ్చారని ఆరోపిస్తున్నారు. ఇదిలా ఉండగా రోహిత్ ఆత్మహత్యకు రాజకీయ రంగు పులుమొద్దని విద్యార్థులు కూడా ప్లకార్డులు ప్రదర్శించారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం నాడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులతో మాట్లాడుతున్న దృశ్యం.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

సెంట్రల్ విశ్వవిద్యాలయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ వేముల తల్లి రాధికతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ దృశ్యం.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి రాహుల్ గాంధీ వచ్చారు. ఈ సమయంలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్... తల్లి రాధిక విషాదవదనంతో..

రాహుల్ వస్తున్నాడని తెలిసి..

రాహుల్ వస్తున్నాడని తెలిసి..

హైదరాబాద్ సెంట్రల్ విశ్వవిద్యాలయానికి రాహుల్ గాంధీ రావడంతో.. పెద్ద ఎత్తున తరలి వచ్చిన విద్యార్థులు, వివిధ సంఘాలు.

మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

మాట్లాడుతున్న రాహుల్ గాంధీ

వర్సిటీలో విద్యార్థులతో మాట్లాడిన అనంతరం రాహుల్ గాంధీ మాట్లాడుతూ.. రోహిత్ ఆత్మహత్యకు కేంద్రమంత్రులు, వైస్ ఛాన్సులర్ బాధ్యత వహించాలని వ్యాఖ్యానించారు.

రాజకీయ రంగు వద్దు

రాజకీయ రంగు వద్దు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ అంశానికి రాజకీయ రంగు పులిమి, రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని కొందరి నినాదాలు.

రాజకీయ రంగు వద్దు

రాజకీయ రంగు వద్దు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆత్మహత్య చేసుకున్న రోహిత్ అంశానికి రాజకీయ రంగు పులిమి, రాజకీయ లబ్ధికి వాడుకోవద్దని కొందరి నినాదాలు.

నిందితులను శిక్షించండి

నిందితులను శిక్షించండి

రోహిత్ ఆత్మహత్యకు కారకులైన నిందితులను శిక్షించాలని కోరుతూ పలువురు విద్యార్థులు ప్లకార్డులు ప్రదర్శిస్తున్న దృశ్యం.

రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో నిరసన

రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో నిరసన

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో మంగళవారం నాడు నిరసన తెలుపుతున్న విద్యార్థులు.

చుక్కా రామయ్య

చుక్కా రామయ్య

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో మంగళవారం నాడు వర్సిటీలో మాట్లాడుతున్న విద్యావేత్త చుక్కా రామయ్య.

విద్యార్థులతో రాహుల్ గాంధీ

విద్యార్థులతో రాహుల్ గాంధీ

రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో విద్యార్థులతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి.

విద్యార్థులతో రాహుల్ గాంధీ

విద్యార్థులతో రాహుల్ గాంధీ

రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటిలో విద్యార్థులతో మాట్లాడుతున్న రాహుల్ గాంధీ. పక్కన ఉత్తమ్ కుమార్ రెడ్డి.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో వర్సీటికి వచ్చిన రాహుల్ గాంధీ.. తొలుత కొందరితో మాట్లాడించారు.

రాహుల్ గాంధీ

రాహుల్ గాంధీ

రోహిత్ మృతికి కారకులైన వారి పైన కఠిన చర్యలు తీసుకోవాలని ఏఐసీసీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ మంగళవారం నాడు డిమాండ్ చేశారు.

స్మారక స్థూపం

స్మారక స్థూపం

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో రోహిత్ స్మారక స్థూపం ఏర్పాటు చేశారు. స్థూపం వద్ద రాహుల్ గాంధీ నివాళులు అర్పించారు.

వర్సిటీలో కులాల చిచ్చు

రోహిత్ ఆత్మహత్యకు... వర్గాల మధ్య చిచ్చు కారణమనే వాదనలు వినిపిస్తున్నాయి. నాలుగైదేళ్లుగా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రతి చిన్న విషయానికి పెద్ద రగడ సాగుతోందని అంటున్నారు. రోహిత్ ఆత్మహత్యనే మొదటిది కాదు.. గత కొన్నేళ్లుగా దాదాపు పలువురు ఈ వర్సిటీలో చనిపోయారంటున్నారు.

హెచ్‌సియులో విద్యార్థులు వర్గాలుగా చీలిపోయి, కొట్లాడుకుంటున్నారని, అవి తీవ్రస్థాయికి చేరుకుంటున్నాయంటున్నారు. ఏ రెండు వర్గాల మధ్య అయినా పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా ఉంటుందని అంటున్నారు. వర్గాలుగా విడిపోయి కొట్లాడుకోవడం వల్ల చివరకు విద్యార్థులో బలవడం బాధాకరం. హెచ్‌సియులో గతంలోను పలుమార్లు గొడవలు జరిగాయని చెబుతున్నారు.

English summary
The BJP on Tuesday accused Rahul Gandhi of politicising the suicide of a student at Hyderabad Central University after the Congress leader visited the protest-hit campus, and insisted that the issue had nothing to do with the victim being from a particular community.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X