• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

‘bore kodthundi’:రైల్ రైడా సాంగ్ యూ ట్యూబ్‌లో ట్రెండ్, 1 రోజులో లక్ష 43 వేల వ్యూస్..

|

రోల్ రైడా.. ర్యాపర్‌గా కన్నా బిగ్ బాస్-2 కంటెస్టెంట్‌గా బాగా తెలుసు. బిగ్ బాస్ తర్వాత ఆయన పాడిన పాటలతో ఫేం అయ్యారు. బుట్టబొమ్మ పాటతో ఆయన లైమ్‌లైట్‌లోకి వచ్చారు. అప్పడప్పుడు సిచుయేషన్‌కి తగ్గట్టు పాటలు రాసి పాడటం రైడాకు అలవాటు. కరోనా వైరస్ విజృంభిస్తోన్న సమయంలో 'బోర్ కోడుతుంది' అనే పాట పాడి.. తన తోటి కంటెస్టెంట్లతో వీడియో చేశాడు. అలా యూ ట్యూబ్‌లో పెట్టాడో లేదో తెగ ట్రెండ్ అవుతోంది. ఒక్కరోజులోనే లక్ష 43 వేల వ్యూస్ వచ్చాయి.

బోర్ అని..

బోర్ అని..

లాక్ డౌన్ లేని సమయంలో కూడా గెట్టింగ్ బోర్డ్ అని కూడా అంటుంటారు. లాక్ డౌన్ విధించడంతో ఇంట్లోనే ఉంటోన్న జనం .. బోర్ బోర్ అని అంటున్నారు. ఈ క్రమంలో బోరు కోడుతుంది అని రాసి, రోల్ రైడా పాడారు. రోల్ రైడా పాట పాడగా.. బిగ్ బిస్ సీజన్ 2 కంటెస్టెంట్లు తనీశ్, సామ్రాట్, దీప్తి, గీతా మాధురి, శ్యామల, దీప్తి సునైనా తదితరులు ఆడుతూ పాడుతూ కనిపించారు.

మధ్యలో కేసీఆర్..

మధ్యలో కేసీఆర్..

వీడియోలో బోర్ కోడుతుంది అంటే.. ఏం చేద్దాం అని సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్‌లో అనే ఆడియోను కూడా జతపరిచారు. మరో సందర్భంలో అనే థూ.. మీ బతుకులు చెడా అనే ఆడియో ఇచ్చి దీనికి మరింత హైప్ తీసుకొచ్చారు. అలా అని ఊరుకోలేదు.. ఇంట్లోనే ఉండండి, కరోనా వైరస్‌ను తరిమికొట్టండి అని సందేశం కూడా ఇచ్చారు.

ఐడియా ఎలా వచ్చిందంటే..

వాస్తవానికి తనకి ఐడియా తన తండ్రి వల్ల వచ్చిందని చెప్పారు. లాక్ డౌన్ వల్ల ఇంటికే పరిమితం కావడం వల్ల.. నాన్న ఇంట్లో ఉండటం కష్టమనే వారు అని తెలిపారు. కనీసం న్యూస్ పేపర్ తీసుకొచ్చేందుకు కూడా వెళ్లనీయకపోవడంతో.. బోర్ కోడుతుంది అనే వారు అని రోల్ రైడా గుర్తుచేశారు. ఆ ప్రేరణతో తాను సాంగ్ రాసి.. పాడానని.. దానిని తన స్నేహితులకు షేర్ చేశానని పేర్కొన్నారు. తొలిసారి తన ఐ ఫోన్‌లో ఆ పాటను రికార్డు చేశానని.. ఇందులో స్టూడియో సెటప్ ఏమీ లేదని పేర్కొన్నారు. దానికి స్నేహితుల నుంచి మంచి స్పందన వచ్చిందని.. వీడియో వెర్షన్ చేయాలని కోరడంతో ఎక్కువ సమయం పడుతోందని చెప్పానని గుర్తుచేశాడు.

  Coronavirus: COVID-19 Cases Reached 893 Mark In AP With 80 New Cases
  తనీశ్ సలహాతో ఇలా..

  తనీశ్ సలహాతో ఇలా..

  తన స్నేహితుడు, నటుడు తనీశ్ ఒక ఐడియా ఇచ్చాడని రోల్ రైడా పేర్కొన్నారు. అందరం ఇంట్లోనే ఉండి షేర్ చేయాలని సూచించాని పేర్కొన్నారు. అలా అందరితో కో ఆర్డినేట్ చేసుకొని.. వీడియో చేశామని... అందరి వీడియోలు తీసుకొన్నానని పేర్కొన్నారు. దానిని సంతోష్ మీనన్ చాలా జాగ్రత్తగా వీడియోగా మలిచాడని రోల్ రైడా తెలిపారు. హమ్ చేస్తున్నట్టు కాకుండా.. లిరిక్స్ పాడినట్టు, వివిధ కెమెరా యాంగిల్స్, మాట్లాడే వీడియో షేర్ చేయాలని కోరగా.. అందరూ స్పందించారని తెలిపారు. అలా చక్కగా వీడియో వచ్చిందని.. నెటిజన్లు కూడా చాలా బాగా రియాక్టయ్యారని రోల్ రైడా ఆనందం వ్యక్తం చేశారు.

  English summary
  Rapper Roll Rida, one of the few in the Telugu music industry, decided to take that expression and create an anthem ‘bore kodthundi’ went viral within a day of its release.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X