• search
  • Live TV
వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

రౌడీ షీటర్ల మేళా ... తెలుగు రాష్ట్రాల్లో ఫస్ట్ టైమ్ ..వరంగల్ పోలీసుల సెన్సేషన్

|

సహజంగా ఎక్కడైనా కార్ మేళాలు, బైక్ మేళాలు, జాబ్ మేళాలు వింటుంటాం.. కానీ రౌడీషీటర్ల మేళా ఎక్కడైనా విన్నారా? కచ్చితంగా విని ఉండరు.. అయితే ఇప్పుడు వరంగల్ పోలీసులు తీసుకున్న వినూత్న నిర్ణయం రౌడీషీటర్ల మేళా ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. అసలీ రౌడీషీటర్ల మేళ ఎందుకు నిర్వహించారు... దీని ఉద్దేశం ఏంటి.. వరంగల్ కమిషనరేట్ పోలీసుల నిర్ణయం వెనుక అసలు కథ ఏంటి తెలుసుకోవాలంటే ఈ కథనాన్ని చదవండి.

రాజధాని విషయంలో పురంధరేశ్వరి ఆసక్తికర వ్యాఖ్యలు ... ఆమెదీ వైసీపీ నేతల మాటే !!

వరంగల్ పోలీస్ కమీషనరేట్ లో రౌడీ షీట్ల తొలగింపు మేళా.. 133 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ ఎత్తివేత

వరంగల్ పోలీస్ కమీషనరేట్ లో రౌడీ షీట్ల తొలగింపు మేళా.. 133 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ ఎత్తివేత

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన ప్రశాంతవంతమైన జీవితం గడుపుతున్న 133 మంది రౌడీ షీటర్లపై రౌడీషీట్‌ తొలగించినట్లుగా వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ ప్రకటించారు. వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సత్ప్రవర్తన కలిగిన వున్నవారిపై రౌడీ షీట్ల తొలగించపు మేళా వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ కార్యాలయములోని రాణి రుద్రమదేవి ప్రాంగణంలో నిర్వహించారు. ఇప్పటి వరకు వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలోని పోలీస్‌ స్టేషన్లనందు 783 మందిపై రౌడీ షీట్లను తెరిచారు . ఇందులో ప్రశాంవంతమైన జీవితంతో పాటు ఎలాంటి చట్టవ్యతిరేక కార్యకలపాలలో పాల్గోకుండా సాధారణ జీవితాన్ని గడుపుతున్న రౌడీ షీటర్లను గుర్తించి వారిపై రౌడీ షీట్‌ తొలగించేందుకుగాను తొలిసారివరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో రౌడీషీట్ల తోలగింపు మేళాను ఏర్పాటు చేశారు .

 నెల రోజుల పాటు కసరత్తు చేసిన అధికారులు .. రౌడీ షీట్ల తొలగింపు

నెల రోజుల పాటు కసరత్తు చేసిన అధికారులు .. రౌడీ షీట్ల తొలగింపు

దీని కోసం సెంట్రల్‌, వెస్ట్‌, ఈస్ట్‌ జోన్ల పరిధిలోని రౌడీషీటర్ల ప్రస్తుత జీవనవిధానంపై సంబంధిత స్టేషన్‌ అధికారులు క్షేత్ర స్థాయిలో సమీక్షా జరిపి రౌడీషీట్‌ తొలగింపు జాబితాను రూపొందించారు . ఈ జాబితాను అనుసరించి సత్ప్రవర్తన కలిగిన వారిపై వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ రౌడీ షీట్‌ తొలగింపు మేళా నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల్లోనే ఇదే తొలిసారి ఈ తరహా రౌడి షీటర్ ల మేళా నిర్వహించటం అని తెలుస్తుంది. ఈ మేళాను ఉద్దేశించి మాట్లాడిన వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌ విశ్వనాధ్ రవీందర్ రౌడీ షీట్‌ తొలగించిన రౌడీషీటర్లను గురించి మాట్లాడుతూ శాంతిభద్రతలకు విఘాతం కలిగించకుండా సాధారణ జీవితం గడుపుతున్న వారిపై రౌడీ షీట్లను ఎత్తివేస్తున్నట్టు తెలిపారు.

 సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్లను ఎత్తివేశామని చెప్పిన సీపీ ..మార్పు కోసమే ఈ ప్రయత్నం అన్న సీపీ రవీందర్

సత్ప్రవర్తన కలిగిన వారిపై రౌడీ షీట్లను ఎత్తివేశామని చెప్పిన సీపీ ..మార్పు కోసమే ఈ ప్రయత్నం అన్న సీపీ రవీందర్

ఎవరైనా నేరాలకు పాల్పడుతూ, ప్రజా జీవనానికి ఇబ్బంది కలిస్తూ , శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే రౌడీ షీట్లు తెరుస్తామని , అలాంటి వారిపై పోలీసుల నిఘా కొనసాగుతుందని పేర్కొన్నారు .ఇక గత కొద్దికాలంగా రౌడీషీటర్లుగా గుర్తింపబడిన వ్యక్తులు సత్ప్రవర్తనతో జీవితాన్నికొనసాగిస్తూ ఎలాంటి నేరాలకు పాల్పడకపోవడాన్ని గుర్తించడం జరిగిందని అందుకే ఇలాంటి వారిపై రౌడీషీట్‌ తొలగింపు చేశామని చెప్పారు. గత సంవత్సర కాలం నుండి ఇప్పటి వరకు 28మందిపై కొత్తగా రౌడీషీట్‌ను తెరవడం జరిగిందన్న ఆయన రౌడీషీట్‌ తొలగించబడిన వ్యక్తులు భవిష్యత్తులో ఎలాంటి నేరాలకు పాల్పడకుండా ప్రశాంతవంతమైన జీవితాన్ని గడపాలని సూచించారు . అలాగే ఏదైనా ,ఎక్కడైనా నేరం జరిగితే పోలీసులకు సమాచారాన్ని అందించే భాధ్యాతయుతమైన పౌరులుగా వుంటూ పోలీసులకు అందించి సహకరిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు . ఆధే విధంగా ఇంత పెద్ద సంఖ్య రౌడీషీట్లను తొలగించినందుకు సంతోషంగా ఉందన్న సీపీ రవీందర్ ముఖ్యంగా హింసతో ఏది సాధించలేమని, ప్రతికార చర్యలతో కాకుండా పరస్పరం చర్చించుకోని సమస్యను పరిష్కరించుకోవాలని తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
The Warangal Police Commissioner has announced that a rowdy sheet has been removed on 133 rowdy sheeters that are living a virtuous and peaceful life under the Warangal Police Commissionerate. The removal of rowdy sheets under the Warangal Police Commissionerate was carried out at the Rani Rudramadevi campus of the Warangal Police Commissionerate's office.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more