వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

నకిలీ కరెన్సీ నోట్ల ముఠా అరెస్ట్: రూ. 13 లక్షలు స్వాధీనం

నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసే ముఠాను భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్పీ భాస్కరన్‌ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు

|
Google Oneindia TeluguNews

జయశంకర్‌ భూపాలపల్లి: నకిలీ కరెన్సీ నోట్లు తయారు చేసే ముఠాను భూపాలపల్లి జిల్లా పోలీసులు అరెస్టు చేశారు. ఈ మేరకు ఎస్పీ భాస్కరన్‌ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. నకిలీ కరెన్సీ తయారీ ముఠా సంచరిస్తున్నారనే సమాచారంతో బుధవారం తనిఖీలు చేపట్టారు.

రేగొండ మండల కేంద్రంలోని బస్టాండ్‌లో ఎనిమిది మంది సభ్యులున్న ముఠాను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద రూ. 13, 05,800 నకిలీ కరెన్సీ నోట్లతోపాటు స్కానర్‌, కలర్‌ ప్రింటర్‌, ఇంక్‌ బాటిల్‌, పేపర్లు లభించాయని తెలిపారు.

notes

కొత్త కరెన్సీ నోట్లను ముద్రించి వాటిని చెల్లుబాటు చేసే క్రమంలో వారు పట్టుబడ్డారని ఎస్పీ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు భాస్కరన్‌ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఒఎస్‌డి రమీదర్‌రావు, డిఎస్‌పి శ్రీనివాస్‌, సిఐలు వేణు, శంకర్‌రెడ్డి పాల్గొన్నారు.

మా డబ్బులు మాకు ఇచ్చేందకు ఇన్ని ఇబ్బందులా ?: రైతుల ఆందోళన

రాజన్నసిరిసిల్ల: రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లో విక్రయించగా వచ్చిన మా డబ్బులును బ్యాంకుల్లో జమ చేస్తే మావి మాకు ఇచ్చేందకు బ్యాంకు సిబ్బంది ఎందుకు ఇబ్బందులు పెడుతున్నారంటూ బుధవారం రాజన్న సిరిసిల్లా జిల్లా ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో రైతులు ఆందోళన చేప్టారు. స్థానిక కెడిసిసి బ్యాంకుకు తాళం వేసి నిరసన తెలిపారు.

ఈ సందర్భంగా రైతులు మ్లాడుతూ.. నెల రోజుల క్రితం వరిధాన్యాన్ని కేంద్రాల్లో వియ్రించగా వచ్చిన డబ్బులను బ్యాంకు ఖాతాల్లో జమ చేశారని వాటిని తీసుకుందామంటే నెల రోజుల నుంచి రోజూ తిరుగుతున్నా తమకు డబ్బులు అందించడం లేదని వాపోయారు. కేవలం రెండు నుంచి నాలుగు వేలు ఇచ్చి సిబ్బంది పంపించి వేశారని రైతులు పేర్కొన్నారు.

వందలాది మంది రైతులు నిత్యం డబ్బుల కోసం రావడం బ్యాంకులో డబ్బులు లేవని సిబ్బంది వెనక్కు పంపడంపై ఆగ్రహం వ్యక్తుం చేశారు. డబ్బులు లేని బ్యాంకులోకి అధికారులు ఎలా వస్తారంటూ ఆగ్రహంతో బ్యాంకు గేటుకు తాళంవేసి అధికారులను అడ్బుకున్నారు. అనంతరం సిరిసిల్ల, కామారెడ్డి ప్రధాన రహదారిపై సుమారు గంటకుపైగా రాస్తారోకో చేశారు. దీంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి.

సమాచారం అందుకున్న పోలీ'సులు అక్కడకు చేరుకొని రైతులను సముదాయించడంతో ఆందోళన విరమింపజేశారు. అనంతరం కేడిసిసి బ్యాంకు ఇంఛార్జ్ మేనేజర్‌ మురళితో సంప్రదింపులు జరిపి బ్యాంకులో ఉన్న నగదు రూ. 4 లక్షలను ఒక్కొక్కరికి ఆరువేల చొప్పున చెల్లించేలా ఒప్పించారు. అనంతరం ఇన్‌చార్జి మేనేజర్‌ మురళి మ్లాడుతూ.. దాదాపు రూ. 4 కోట్ల వరకు బ్యాంకుకు ధాన్యం డబ్బులు రావాల్సి ఉందని పేర్కొన్నారు. రైతులు చేప్టిన రాస్తారోకోకు కాంగ్రెస్‌, ఎమ్మార్పీఎస్‌ నాయకులు మద్దతు ప్రకటించారు.

English summary
Rs 13 lakhs Fake currency seized and 8 arrested in warangal.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X