హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

హైదరాబాద్‌లో రూ.2.58 కోట్ల పాత నోట్లు స్వాధీనం

నగరంలోని పాతబస్తీలో రూ.2.58 కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని పాతబస్తీలో రూ.2.58 కోట్ల పాత నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ వ్యవహారంతో సంబంధమున్న నలుగురు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకున్నారు.

కొందరు వ్యక్తులు ఓ ముఠాగా ఏర్పడి పాత నోట్లను మారుస్తామంటూ నమ్మిస్తూ మెసాలకు పాల్పడుతున్నట్లు సమాచారమందుకున్న పోలీసులు ఈ వ్యవహారంపై నిఘా ఉంచారు. అనంతరం ఎట్టకేలకు ఈ ముఠాను పట్టుకున్నారు.

hyderabad-old-notes-seized

శుక్రవారం అర్ధరాత్రి దాటిన తరువాత పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండగా రూ.2.58 కోట్ల విలువైన రద్దయిన పాత నోట్ల కట్టలు వెలుగు చూశాయి. నిందితులు ఈ నోట్లను హైదరాబాద్ నుంచి బెంగళూరు తరలిస్తూ బహదూర్‌పుర పోలీసులకు పట్టుబడ్డారు.

ఇన్‌స్పెక్టర్ ఖలీల్ పాషా, ఆయన అనుచర బృందం ఈ తనిఖీల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా నిందితుల నుంచి రూ. 2.598 కోట్ల పాతనోట్లను, ఓ కారును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

English summary
In Hyderabad's old city on Friday Midnight police seized Rs.2.58 Crore Demonetised Notes. While doing search operation Bahudurpura police catched these notes and in this connection they have taken four persons into their custody. The accused are transporting these old notes to Bangalore to transform them into new currency.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X