వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.2 లక్షల బిల్లు: కరెంట్ బిల్లు చూసి జల్లుమన్న వినియోగదారుడి గుండె..

|
Google Oneindia TeluguNews

కరెంట్ బిల్లు ఒక్క రూపాయి పెంచలేదు అని.. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రకటించారో లేదో ఓ మధ్యతరగతి కుటుంబానికి బిల్లు వాచిపోయింది. అక్షరాలా రూ.2 లక్షల బిల్లు రావడం చూసి ఆ కుటుంబం ఖంగుతిన్నది. ఏంటీ ఇదీ అని విద్యుత్ అధికారులను నిలదీసింది. కానీ సదరు అధికారులు.. విద్యుత్ సిబ్బంది మిన్నకుండిపోవడంతో క్షేత్రస్థాయిలో ఏం జరుగుతుందోననే ఆందోళన నెలకొంది.

మహబూబాబాద్ జిల్లా మరిపెడకు చెందిన వస్రం కరెంట్ మీటర్‌లో సమస్య వచ్చింది. వెంటనే అధికారులకు చెప్పి బాగు చేయించాడు. కానీ అప్పటివరకు ఉన్న రూ.6 వేల నగదు కూడా కట్టేశాడు. కానీ తర్వాత కూడా సమస్య వచ్చింది. ఈ సారి అతనికి రూ.2 లక్షల కరెంట్ బిల్లు వచ్చింది. బిల్లు చూసి ఆయనతోపాటు కుటుంబం షాక్‌నకు గురైంది.

rs 2 lakhs for power bill in one month

తనకు ఇంత మొత్తంలో బిల్లు రావడం అధికారుల నిర్లక్ష్యం వల్లేనని వస్రం అంటున్నారు. రూ.6 వేల బిల్లును ఎలాగోలా కట్టానని.. రూ.2 లక్షల బిల్లు ఎలా కట్టాలని అడుగుతున్నాడు. ఇప్పుడు కూడా బిల్లు అంతే చూపించడంతో అతను ఆందోళన చెందుతున్నాడు. బిల్లు మాఫీ చేయకుంటే తనకు చావే శరణ్యం అని వాపోతున్నాడు. తమ సమస్య పరిష్కరించాలని పాలకులను వేడుకుంటున్నాడు.

English summary
mahabubabad district maripeda town native vasram got rs 2 lakhs for power bill in one month.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X