నిజామాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అర్టీఐ ద్వార సమాచారం కోసం అధికారులు ఎన్ని లక్షలు అడిగారో తెలుసా...!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ : ఒక సంవత్సరం వర్షాపాతానికి సంబంధించిన వివరాలు ఇవ్వాలని ఆర్టిఐ ద్వార సమాచారం అడిగిన ఓ వ్యక్తికి తెలంగాణ రాష్ట్ర అధికారులు షాక్ ఇచ్చారు. అర్జిదారుడు అడిగిన సమాచారం ఇవ్వాలంటే, అక్షరాల ఇరవై లక్షల రుపాయాలు ఇవ్వాలని తెలిపారు. దీంతో అర్జిదారుడు షాక్ తిన్నాడు.

తెలంగాణలోని నిజామాబాద్‌కు చెందిన ఆర్టిఐ కార్యకర్త సెరుపల్లి రాజేశ్ వర్షాపాతానికి సంబంధించిన సమాచారం ఇవ్వాలని ఆర్టిఐ ద్వార జిల్లా చీఫ్ ప్లానింగ్ అధికారిని కోరాడు. అయితే తన అర్జిలో జూన్ 2018 నుండి మే 31 2019 వరకు వాతవరణ కేంద్రం వారిగా నమోదైన వర్షాపాతం వివరాలు అందివ్వాలని కోరాడు. దీంతో రాజేశ్ అప్లికేషన్‌ను స్వీకరించిన అధికారులు అడిగిన సమాచారాన్ని ఇచ్చేందుకు అంగీకరించారు. ఇందుకుగాను రూ. 20 లక్షల 31వేల 960 లు చెల్లించాలని తెలంగాణ రాష్ట్ర అభివృద్ది మరియు ప్లానింగ్ సోసైటి కొరింది.

Rs 20 lakh asked for information about rainfall data by RTI

అధికారులు పేర్కోన్న దాని ప్రకారం మొత్తం 12 నెలల డాటాకు సంబంధించి ఓక్కో వాతవరణ స్టేషన్ డాటాకు గాను రూ.3500 చొప్పున మొత్తం 41 వాతవరణ కేంద్రాలకు గాను 17 లక్షల 22వేల రుపాయలతోపాటు మరో 3లక్షల 9వేల 960 రుపాయాలను కలిపి మొత్తం 20 లక్షల 31వేల 960 రుపాయాలు చెల్లించాలని కొరింది. దీంతో అధికారుల లేఖను తీసుకున్న రాజేశ్ షాక్ తిన్నాడు. కాగా గతంలో ఎన్నోసార్లు అర్టిఐ ద్వార సమాచారాన్ని సేకరించినప్పటకి జీఎస్టీ ఎప్పుడు విధించలేదని, మొదటిసారిగా ఆర్టిఐ సమాచారంపై జీఎస్టి విధించారని తెలిపారు.

అయితే వర్షాపాతం డాటా ద్వార ఏమేరకు రైతులకు ఆయా జిల్లాల్లో వర్షపాతం నమోదైంది. గత సంవత్సరం కరువు పరిస్థితి నెలకొన్న నేపథ్యంలోనే సర్వే నిర్వహించేందుకు సమాచారాన్ని కోరానని తెలిపాడు.దీంతో నిజామాబాద్ సిపీఓను సమాచారాన్ని అడిగానని, కాగా అంతకు ముందు తెలంగాణ సెక్రటేరియట్‌లో స్టాటిటిక్స్ విభాగం సమాచారాన్ని కొరానని ,కాని సెక్రటేరియట్ అధికారులు సంబంధిత సమాచారాన్ని అందించేందుకు నిరాకరించిందని వాపోయాడు.

English summary
an RTI activist was allegedly asked by authorities to pay over Rs 20 lakh in return for information about rainfall data of Nizamabad district of the state.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X