వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రూ.406 కోట్లు: దసరాకు జోరుగా మద్యం విక్రయాలు, గతేడాది కంటే పెరిగిన లిక్కర్ సేల్స్..

|
Google Oneindia TeluguNews

దసరా.. తెలంగాణలో పెద్ద పండుగ. అమ్మవారికి పూజ చేసి, చిన్న, పెద్ద అనే తేడా లేకుండా మద్యం సేవిస్తారు. అయితే ప్రతీసారి దసరా రికార్డుల్లో మద్యం విక్రయాలు జరుగుతుంటాయి. దసరా.. అంతకుముందు రోజుల్లో భారీగా సేల్స్ ఉంటాయి. అయితే కరోనా వైరస్, మాంద్యం నేపథ్యంలో మద్యం విక్రయాలు ఎలా ఉంటాయని అంచనాలు ఉన్నా.. ఈ సారి కూడా రికార్డ్ సేల్స్ జరిగాయి. దసరా.. అంతకుముందు రోజుల్లో రూ.406 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి.

రూ.406 కోట్ల మద్యం

రూ.406 కోట్ల మద్యం

దసరా సందర్భంగా మద్యం డిపోల నుంచి రూ.406 కోట్ల మందును తరలించారు. వైన్ షాపులలో మద్యం స్టోర్ చేశారు. అయితే 22వ తేదీన శుక్రవారం రోజున రూ.131 కోట్ల విలువైన మద్యాన్ని విక్రయించారు. శనివారం రోజున రూ.175 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగాయి. అంతకుముందు రోజు స్టాక్ తీసుకురావడంతో.. దసరా రోజున రూ.100 కోట్ల లిక్కర్ విక్రయాలు జరిగాయి.

4.71 లక్షల కేసుల లిక్కర్

4.71 లక్షల కేసుల లిక్కర్

4.71 లక్షల కేసుల మద్యం (విస్కీ, బ్రాండీ, రమ్, వైన్) 4.44 లక్షల కేసుల బీర్లు ఉన్నాయి. ఆదివారం, సోమవారం కూడా లిక్కర్ విక్రయాలు జరిగాయి. రోజు రూ.70 కోట్ల నుంచి రూ.100 కోట్ల వరకు లిక్కర్ విక్రయాలు జరుగుతుంటాయి. కానీ పండగ సమయంలో 3 రోజుల్లో రూ.406 కోట్ల విక్రయాలు జరిగాయి. ఈ నెల 24వ తేదీ వరకు రూ.1979 కోట్ల మద్యం విక్రయాలు జరిగాయి. గతేడాది ఇదీ రూ.1374 కోట్లు ఉన్న సంగతి తెలిసిందే.

కరోనా సమయంలోనూ..

కరోనా సమయంలోనూ..


కరోనా వైరస్ సమయంలోనూ భారీగా లిక్కర్ విక్రయాలు జరిగాయి. దాదాపుగా రూ.600 కోట్ల లిక్కర్ ఎక్కువగా అమ్ముడుపోయింది. దీంతోపాటు వైరస్‌కు వ్యాక్సిన్ ఇంకా రాకపోవడం.. వైద్యులు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని చెప్పడం కూడా కారణమైంది. కోడి గుడ్లు, చికెన్, విస్కీ విక్రయాలు గణనీయంగా పెరిగాయి. లిక్కర్‌తో పోలిస్తే.. బీర్ల విక్రయాలు కాస్త తక్కువగానే ఉన్నాయి. మొత్తం లిక్కర్ విక్రయాలు ఎక్కువగా జరిగి.. మందుబాబులు మత్తులో జోగారు.

Recommended Video

AP Sets Up Special Enforcement Bureau To Crack Down On Liquor
గొడవలు..ఫిర్యాదులు

గొడవలు..ఫిర్యాదులు

కొన్ని చోట్ల గొడవలు కూడా జరిగాయి. దసరా సందర్భంగా ఆయా పోలీసు స్టేషన్లకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. చాలా చోట్ల ఫిర్యాదులను పోలీసులు తీసుకున్నారు. ప్రాథమికంగా గ్రామంలో మాట్లాడుకోవాలని.. లేదంటే కేసు నమోదు చేస్తామని చెప్పినట్టు తెలుస్తోంది.

English summary
rs.406 crore liquor sales in telangana state excise and prohibition department said in statement
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X