వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎవరి సొమ్మో?: రూ.45కోట్లను టాటా ఏస్ వాహనంలో తరలించారు!

|
Google Oneindia TeluguNews

నల్గొండ: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకు అధికారుల నిర్లక్ష్యం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఒకటి కాదు రెండు కాదు, ఏకంగా రూ.45కోట్ల బ్యాంకు డబ్బును ఓ సాధారణ టాటాఏస్ ట్రాలీలో తరలించడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని గడియారం సెంటర్‌లో ఉన్న ఎస్బీఐ ప్రధాన బ్యాంకు నుంచి అధికారులు ఇతర బ్రాంచీలకు టాటా ఏస్‌ వాహనంలో రూ.45 కోట్లకు పైగా నగదును తరలించారు. ఓ ఏఎస్సై స్థాయి అధికారిని వాహనంలో వెనకాల నిల్చొబెట్టారు.

Rs 45 crores currency transported in tata ace vehicle to other branches of sbi

ఓ మామూలు వాహనంలో ఇంత భారీ డబ్బుల కట్టలు తీసుకొని వెళ్తుంటే ప్రజలు ఆసక్తిగా చూశారు. ప్రజల డబ్బులు అంటే ఇంత నిర్లక్ష్యమా? అంటూ వారు మండిపడ్డారు.

ఏదైనా ప్రమాదం జరగడం లేదా దొంగలు ఈ డబ్బుపై కన్నేసి ఉంటే ఎలాంటి పరిస్థితులు ఉండేవేనోనని ఆందోళన వ్యక్తం చేశారు. అయితే, బ్యాంకు నుంచి డబ్బులు పంపిణీ చేసే ప్రత్యేక రక్షణతో కూడిన వాహనం లేక అత్యవసర సమయంలో ఇలా చేయాల్సి వచ్చిందని అధికారులు వివరణ ఇచ్చారు.

English summary
Rs 45 crores currency transported in tata ace vehicle to other branches of SBI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X