కర్నూలు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

5 లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూం ఇవ్వండి : మృతదేహలతో రామాపురం వాసుల డిమాండ్

|
Google Oneindia TeluguNews

గద్వాల : వెల్దుర్ది రోడ్డు ప్రమాదంలో విగతజీవులుగా మారిన కుటుంబాలను ఆదుకోవాలని రామాపురం వాసులు డిమాండ్ చేశారు. కర్నూలు సర్వజన ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించి .. మృతదేహాలను స్వగ్రామానికి తరలించారు. ఇంతలో గద్వాల జిల్లా శాంతినగర్‌లో బంధువులు ఆందోళన చేపట్టారు. వీరికి ప్రజా సంఘాలు, మందకృష్ణ మాదిగ మద్దతు తెలిపారు.

ఆదుకోండి ...
మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం, డబుల్ బెడ్ రూం ఇళ్లు, దళితులకు మూడెకరాల భూమి, పిల్లలకు ఉచిత విద్య అందించాలని కోరారు. మృతుల కుటుంబాలని ఆదుకోవాలని వేడుకున్నారు. వీరి నిరసనతో అధికారులు స్పందించారు. వారి డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి న్యాయం చేస్తామని అధికారులు హామీనివ్వడంతో ఆందోళన విరమించారు.

rs 5 lakhs, double bedroom gave to death families

పరామర్శ ....
అంతకుముందు కర్నూలు ఆస్పత్రిలో మృతుల కుటుంబాలను పలువురు నాయకులు పరామర్శించారు. తెలంగాణ మంత్రి నిరంజన్ రెడ్డి, పాణ్యం మాజీ ఎమ్మెల్యే రాంభూపాల్ రెడ్డి బాధితులను పరామర్శించి .. అండగా ఉంటామని హామీనిచ్చారు. అలంపూర్ ఎమ్మెల్యే అబ్రహం రాత్రి ఆస్పత్రిలోనే ఉండి .. పోస్టుమార్టం ఏర్పాట్లు త్వరితగతిన జరిగేలా చర్యలు తీసుకున్నారు.

English summary
The people of Ramapuram demanded that the families who turned into exterior wolves in Velderdi road accident. Kurnool organized the postmaster in the Sarvana hospital and the bodies were moved to the village. Meanwhile relatives in the area of ​​Sadhinagar in Gadwal district took up concern. They are supported by Mandakrishna.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X