వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

బాగుపడనున్న రోడ్లు...రూ. 570 కోట్లు విడుదల : కేసీఆర్

|
Google Oneindia TeluguNews

ఇటివల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న రోడ్ల మరమ్మత్తుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వర్షాలకు పాడై పోయిన రోడ్లకు మరమ్మత్తులు చేయించేందుకు క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇందుకోసం 571 కోట్ల రూపాలయను విడుదల చేస్తున్నట్టు సీఎం కేసీఆర్ ప్రకటించారు. త్వరలో వీటికి టెండర్లు పిలుస్తామని చెప్పారు. పాడైన రోడ్లను రెండు నెలల్లో పునర్మిస్తామని చెప్పారు.

క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు

క్యాబినెట్‌లో కీలక నిర్ణయాలు

తెలంగాణ సీఎం కేసీఆర్ అధ్యక్షతన చేపట్టిన క్యాబినెట్‌లో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. క్యాబినెట్‌లో పలు అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సంధర్భంగా క్యాబినెట్‌లో తీసుకున్న వివరాలను స్వయంగా సీఎం కేసీఆర్ ప్రకటించారు. ముఖ్యంగా 50 రోజులకు పైగా కొనసాగిన ఆర్టీసీ సమ్మెకు ఈ సంధర్భంగా ఫుల్‌స్టాప్ పెట్టారు. కార్మికులు రేపే ఉద్యోగాల్లో చేరాలని కోరారు. ఇందుకోసం ఎలాంటీ షరతులు విధించమని చెప్పారు. మరోవైపు నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో పాడైన రోడ్ల మరమ్మత్తుకు సంబంధించి 571 కోట్ల రూపాయలను విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. రోడ్డు మరమ్మత్తు పనులను యుద్దప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించినట్టు చెప్పారు.

వరిపై ప్రత్యేక ప్రత్యేక పాలసీ

వరిపై ప్రత్యేక ప్రత్యేక పాలసీ

ధాన్యం కొనుగోలుగులు సంబంధించి పలు నిర్ణయాలు ప్రకటించారు. మొత్తం వ్యవసాయానికి సంబంధించి మూడు రకాల పంటలు ఉన్నాయని అందులో పత్తి, వరి, మొక్కజొన్న పంటలు ప్రధానంగా ఉన్నాయని అన్నారు. ఇక మిగతా పంటల్లో ఎలాంటీ సమస్యలు లేవని చెప్పారు. అయితే వరి ధాన్యంలో కొన్ని ఇబ్బందులు ఎర్పడుతున్నాయని చెప్పారు. అందుకోసమే వరి అమ్మకాలు, కొనుగోళ్లపై సమీక్ష జరిపామని చెప్పారు. రానున్న రోజుల్లో వరి పంటలు నిరంతరంగా పండించనున్న నేపథ్యంలోనే దానిపై త్వరలోనే ఒక పాలసీని తీసుకువస్తామని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం వల్ల పంటలు మరింత పెరిగే అవకాశం ఉందని అన్నారు

కార్పోరేషన్ల చట్టానికి సవరణ

కార్పోరేషన్ల చట్టానికి సవరణ

ఇక రాష్ట్రంలో ఉన్న పలు కార్పోరేషన్లకు ఎమ్మెల్యేను చైర్మన్లను తీసుకురావాలనే ఆలోచనలో ఉన్న సీఎం...అందుకు సంబంధించి చట్టాలు అడ్డంకిగా మారాయని వివరించారు. దీంతో కార్పోరేషన్ల చట్టాన్ని మార్చానున్నట్టు సీఎం ప్రకటించారు. కార్పోరేషన్ల చట్టాన్ని అమెండ్‌మెంట్ తేవాలని క్యాబినెట్ నిర్ణయించందని చెప్పారు. . ఇందుకు సంబంధించి వెంటనే ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించినట్టు చెప్పారు. చట్ట సవరణ తర్వాత మొత్తం 28 కార్పేరేషన్లకు గాను ఎమ్మెల్యేలతో పాటు, ఇతరులను చైర్మన్లను నియమించనున్నట్టు చెప్పారు.

English summary
Telangana CM KCR presided over the Cabinet meeting. The details taken in the cabinet was announced by CM KCR.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X