హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

బ్యూటీ కాంటెస్ట్‌లో ఫస్ట్, వారంలో నిశ్చితార్థం: బస్సు ఢీకొని విద్యార్థినిలు మృతి (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఇద్దరు విద్యార్థినుల ప్రాణాలు బలిగొంది. కవాడిగూడ ప్రాగాటూల్స్ చౌరస్తాలో ఆర్టీసీ బస్సు సృష్టించిన బీభత్సం అందర్నీ కలచివేసింది. వేగంగా వచ్చిన బస్సు ఆటోను ఢీకొట్టి అనంతరం స్కూటీ పైకి దూసుకెళ్లింది.

దీంతో, స్కూటీ పైన వెళ్తున్న ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. ఆటోలో ఉన్న ప్రయాణీకులు సురక్షితంగా బయటపడ్డారు. బస్సు ఢీకొట్టగానే స్కూటీ పైన విద్యార్థులను ఆసుపత్రికి తరలించారు. వారు చికిత్స పొందుతు మృతి చెందారు.

దమ్మాయిగూడ బిపీ రెసిడెన్సీలో ఉండే సుష్మిత శర్మ (22), సైనిక్‌పురికి చెందిన సయ్యద్ హుస్నారజీ (22) ఇద్దరు విద్యార్థినులు ఈ ఘటనలో మృతిచెందారు. వీరిద్దరు వెస్ట్ మారేడుపల్లిలోని కస్తూర్బా డిగ్రీ కళాశాలలో ఎంఎస్సీ కంప్యూటర్స్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. సుష్మితకు త్వరలో నిశ్చితార్థం జరగాల్సి ఉంది.

వచ్చే నెల 27వ తేదీన వివాహం జరగాల్సి ఉంది. అయితే, దోమలగూడ ఏవీ కాలేజీలోని గ్లిడ్జ్ 2కె 2015 ఆధ్వర్యంలో ఇంటర్ కాలేజ్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఈ ఫెస్ట్‌కు నగరంలోని ఎంఎస్సీ, పీజీ విద్యార్థులను ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తూ మృత్యువాత పడ్డారు. దీంతో గ్లిడ్జ్ ఫెస్ట్‌ను రద్దు చేశారు.

ప్రమాదంలో మృతి చెందిన హస్నరీజా

ప్రమాదంలో మృతి చెందిన హస్నరీజా

ఎప్పుడూ హెల్మెట్‌ ధరించి ఓపికగా ద్విచక్ర వాహనంతో పాటు కారు కూడా నేర్పుగా సుష్మిత నడపగలదంటున్నారు. అలాంటి కుమార్తెను ఆర్టీసీ బస్సు బలి తీసుకొని... ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. కూతురు మృతి తట్టుకోలేక తల్లిదండ్రులు గుండెలు అవిసేలా విలపించారు. అదే ప్రమాదంలో మృతి చెందిన మరో విద్యార్థిని హుస్నారజీ కుటుంబం సైతం విషాదంలో మునిగింది.

ప్రమాదంలో మృతి చెందిన సుష్మిత

ప్రమాదంలో మృతి చెందిన సుష్మిత

దమ్మాయిగూడ శశాంక్‌ ఎన్‌క్లేవ్‌లో ఉంటున్న సుబ్రమణ్య శర్మ కుమార్తె సుష్మిత, సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన అలీరిజా కుమార్తె హస్నరీజా(22) ఒకే కళాశాలలో చదువుతున్నారు. కొంతకాలంగా సుస్మిత కళాశాలకు వెళ్లే క్రమంలో నేరెడ్‌మెట్‌లోని హస్నరీజాను తనతోపాటు ద్విచక్ర వాహనంపై తీసుకెళ్లి వచ్చేటప్పుడు ఇంటి వద్ద వదిలి వస్తోంది.

ప్రమాదం - విద్యార్థినులు ప్రయాణిస్తున్న స్కూటీ

ప్రమాదం - విద్యార్థినులు ప్రయాణిస్తున్న స్కూటీ

అయితే దోమలగూడలోని ఏవీ కళాశాలలో జరిగే కళాశాల ఫెస్ట్‌లో పాల్గొనడానికి సుస్మిత, హస్నరీజా శనివారం ఒకే వాహనంపై బయలుదేరారు. ముషీరాబాద్‌ నుంచి వైస్రాయ్‌ కూడలి వైపు వస్తుండగా కల్పన చౌరస్తా వద్ద వీరిని వెనుక నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని స్థానికులు 108 ద్వారా ముషీరాబాద్‌లోని కేర్‌ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇద్దరూ మృతి చెందారు.

ప్రమాదం వద్ద...

ప్రమాదం వద్ద...

తర్వాత మృతదేహాలను గాంధీ ఆసుపత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమాద సమయంలో వాహనం నడిపిస్తున్న సుష్మిత హెల్మెట్ ధరించింది. బస్సు ఢీకొట్టడంతో అది ముక్కలై తలకు తీవ్ర గాయాలయ్యాయి. డ్రైవర్‌ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని పోలీసులు భావిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ డ్రైవర్‌ను కఠినంగా శిక్షించాలని మృతుల బంధువులు, స్నేహితులు డిమాండ్‌ చేశారు. కళాశాల విద్యార్థులు భారీగా శవాగారం వద్దకు చేరుకున్నారు. ప్రమాదం జరిగిన పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. సుష్మిత, హస్నరీజా తల్లిదండ్రులను ఓదార్చారు.

ప్రమాదం - ఢీకొట్టిన బస్సు

ప్రమాదం - ఢీకొట్టిన బస్సు

స్నేహితురాళ్లు అయిన సుస్మిత, హస్నరీజ మృతి చెందడంతో వారు నివాసం ఉండే కాలనీల్లో విషాదఛాయులు అలుముకున్నాయి. హస్నరీజా ఉండే డిఫెన్స్‌కాలనీలోని సాయి మిత్రమార్‌వెల్‌ అపార్ట్‌మెంట్‌లోని ఆమె ఇంటి వద్ద విషాదం వాతావరణం నెలకొంది. హస్నరీజా తల్లిదండ్రులు సయ్యద్‌ అలీరజా, వినత్‌రజాకు ఐదుగురి సంతానంలో అందరి కంటే హస్నరీజా చిన్నది. ఈమె తల్లికి అనారోగ్యం ఉండడంతో కుమార్తె మృతి విషయం చెప్పలేదు.

ప్రమాదం - స్కూటీ కంటే బస్సు ఢీకొట్టిన ఆటో

ప్రమాదం - స్కూటీ కంటే బస్సు ఢీకొట్టిన ఆటో

రంగారెడ్డి జిల్లా కీసర మండలం దమ్మాయిగూడ శశాంక్‌ ఎన్‌క్లేవ్‌లోని బీపీ రెసిడెన్సీలో నివసిస్తున్న సుబ్రమణ్య శర్మ, లత దంపతుల చిన్న కుమార్తె అయిన సుష్మిత మృతి చెందడంతో దమ్మాయిగూడలోని శశాంక్‌ఎన్‌క్లేవ్‌లో విషాదం అలుముకుంది. రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన సుష్మిత శర్మ నిశ్చితార్థం వారం రోజుల్లో జరగనుంది. ఇందుకు సంబంధించి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. వేడుకకు కావాల్సిన దుస్తులు సైతం కొనుగోలు చేశామని సుష్మిత తల్లి శవాగారం వద్ద భోరున విలపిస్తూ చెప్పింది. ఇటీవల జరిగిన కళాశాల బ్యూటీ కాంటెస్ట్‌లో మొదటి స్థానంలో నిలిచిందని కన్నీరుమున్నీరైంది. ఉదయం కళాశాలకు బయలు దేరే ముందు వెళ్లొస్తా అని చెప్పి బయలుదేరిందని తిరిగి రాకుండా పోయిందని రోదించారు.

English summary
2 Girl students were killed as the RTC Bus hits Scooty in Hyderabad.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X