వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ ఎఫెక్ట్.. అదుపుతప్పి వాగులోకి బస్సు

|
Google Oneindia TeluguNews

కల్వకుర్తి : ఆర్టీసీ సమ్మె ప్రభావం తీవ్రంగా కనిపిస్తోంది. ఒకవైపు బస్సులు సరిగా లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు తాత్కాలిక సిబ్బందితో బస్సులు నడుపుతుంటే అవి ప్రమాదాలకు గురవుతున్న సంఘటనలు కొకొల్లలు. టెంపరరీ డ్రైవర్లను ఎలాంటి టెస్టులు లేకుండా తీసుకోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి. ఆ క్రమంలో నాగర్ కర్నూల్ జిల్లాలో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది.

కల్వకుర్తి మండలంలోని రఘుపతి పేట్ గ్రామ సమీపంలోని దుందుభి వాగు దగ్గర ఆర్టీసీ బస్సు అదుపు తప్పింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన నేపథ్యంలో తాత్కాలిక డ్రైవర్లతో ఆ రూట్‌లో బస్సులు నడుపుతున్నారు. ఆ క్రమంలో బుధవారం నాడు (09-10-2019) ఆర్టీసీ బస్సుకు ప్రమాదం తప్పింది. దుందుభి వాగు సమీపంలోకి రాగానే ఒక్కసారిగా అదుపుతప్పి వాగులోకి దూసుకెళ్లి ఓ సైడుకు ఒరిగిపోయింది. వెంటనే అలర్టైన ప్రయాణీకులు బస్సులో నుంచి కిందకు దిగేశారు.

rtc bus rush into river in nagarkurnool district with temporary driver

అవసరమైతే తెలంగాణ బంద్.. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ హెచ్చరికఅవసరమైతే తెలంగాణ బంద్.. ప్రభుత్వానికి ఆర్టీసీ జేఏసీ హెచ్చరిక

దింతో ప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డ ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు.మరో పక్క దుందిబి వాగు పొంగిపొర్లుతు ఉండటంతో తెల్కపల్లి కల్వకుర్తి మధ్య రాక పోకలు పూర్తిగా నిలిచి పోయాయి..ఒక పక్క తాత్కాలిక డ్రైవర్ కoడక్టర్ లతో బస్సులను నడుపుతున్న ప్రభుత్వ హయాంలో ఈ సంఘటన చోటు చేసుకోవడం పై సమ్మె చేస్తున్న ఆర్టీసీ డ్రైవర్ లు ప్రభుత్వం పై మండి పడుతున్నారు.

తాత్కాలిక డ్రైవర్లతో ఆర్టీసీ బస్సులు నడుపుతున్న నేపథ్యంలో అక్కడక్కడ ఇలాంటి ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. ఇక ఛార్జీల విషయంలో కూడా ప్రయాణీకులకు, టెంపరరీ కండక్టర్లకు మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదాలు జరుగుతున్నాయి. కొందరు టికెట్లు ఇవ్వకుండానే నోటికి ఎంతొస్తే అంత చెప్పి ఛార్జీలు వసూలు చేయడం ప్రయాణీకులకు ఆగ్రహం తెప్పిస్తోంది. ఈ క్రమంలో కొన్ని చోట్ల ఘర్షణకు దారి తీస్తున్న సందర్భాలు అనేకం.

English summary
Telangana RTC Bus rush into river with temporary driver untrained driving.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X