వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్: కిరోసిన్‌తో నిప్పంటించుకొన్న డ్రైవర్.. ప్రభుత్వ నిర్ణయంతో మనస్తాపం?

|
Google Oneindia TeluguNews

ఖమ్మంలో ఆర్టీసీ డ్రైవర్ ఆత్మహత్యయత్నం చేశారు. ఆర్టీసీ ఖమ్మం డిపోలో పని చేస్తున్న శ్రీనివాసరెడ్డి, తన ఇంటివద్ద కిరోసిన్ పోసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు. శ్రీనివాస రెడ్డి శరీరం తొంబైశాతం మేర కాలిపోయినట్టు సమాచారం. దీంతో ఆయన పరిస్థితి విషమంగా తయారైందని వైద్యులు తెలిపారు. అయితే సమ్మెపై మనస్థాపం చెంది ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డట్టు ప్రచారం జరుగుతోంది.

ఆర్టీసీ సమ్మె ఓ ఉద్యోగి ప్రాణాల మీదకు తెచ్చింది. గత ఎనిమిది రోజులుగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుండడంతో ఖమ్మం డిపోలో పనిచేస్తున్న శ్రీనివాస రెడ్డి మనస్థాపానికి గురయినట్టు ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో ఆయన ఇంట్లోనే కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. అయితే హుటాహుటిన ఖమ్మం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కాగా శ్రీనివాస రెడ్డి శరీరం తోంబైశాతం కాలిపోవడంతో పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

RTC driver committed suicide

ఆర్టీసీ కార్మీకులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో గత నెల జీతాలు ఇచ్చిన పరిస్థితిలేదు . ఓవైపు ప్రభుత్వం సమ్మెపై కఠినంగా వ్యవహరిస్తుండగా, కార్మికులు సైతం మెట్టు దిగడం లేదు. దీంతో సమ్మె ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలియని పరిస్థితి నెలకోంది. తాజాగా సీఎం కార్మీకుల సమ్మెను గుర్తించమని చెబుతుండగా కార్మికులు మాత్రం సమ్మెను ఉదృతం చేసేందుకు సమాయత్తమయ్యారు. రేపటి నుండి ప్రతిపక్షాలతో కలిసి ఐక్యకార్యచరణను ప్రకటించి 19న బంద్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే.

English summary
RTC driver attempts suicide who is working in Khammam Depot. Srinivasa Reddy committed suicide at his home Family members said.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X