వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

50 వేల జీతాలెక్కడ సీఎం గారూ.. పే స్లిప్పులతో వినూత్న నిరసన..!

|
Google Oneindia TeluguNews

నిర్మల్‌ : ఆర్టీసీ కార్మికుల సమ్మెపై టీఆర్ఎస్ ప్రభుత్వం మండిపడుతోంది. వేలకు వేలు జీతాలు తీసుకుంటూ ఆర్టీసీ కార్మికులు ఇలా సమ్మె చేయడం చట్ట విరుద్దమని సీఎం కేసీఆర్ చేస్తున్న వ్యాఖ్యల్ని వారు తీవ్రంగా ఖండిస్తున్నారు. ఆర్టీసీలో సీనియర్ ఉద్యోగులు 50 వేల రూపాయలకు పైబడి జీతాలు తీసుకుంటున్నారని స్వయంగా కేసీఆర్ ప్రకటించడాన్ని ఆర్టీసీ జేఏసీ నేతలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. అంతంత జీతాలు ఎక్కడ ఇస్తున్నారంటూ ఉద్యోగులు ఫైరవుతున్నారు.

50 వేల జీతాలెక్కడ.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపాటు

50 వేల జీతాలెక్కడ.. సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై మండిపాటు

ఆర్టీసీ ఉద్యోగులు 50 వేల రూపాయలకు పైగా జీతాలు తీసుకుంటున్నారన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలపై నిర్మల్ జిల్లా ఆర్టీసీ కార్మికులు ఆందోళనకు దిగారు. జిల్లా కేంద్రంలోని బస్ డిపో దగ్గర బుధవారం నాడు వినూత్న నిరసన చేపట్టారు. పే స్లిప్పులను చూపిస్తూ.. ఎక్కడ వేలకు వేల జీతాలు ఇస్తున్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

ఆర్టీసీ సరే.. అప్పుల ప్రభుత్వాన్ని ప్రైవేట్ చేస్తారా.. జస్టిస్ చంద్రకుమార్ లాజిక్‌తో కొట్టారుగా..!ఆర్టీసీ సరే.. అప్పుల ప్రభుత్వాన్ని ప్రైవేట్ చేస్తారా.. జస్టిస్ చంద్రకుమార్ లాజిక్‌తో కొట్టారుగా..!

నిర్మల్ ఆర్టీసీ కార్మికుల వింత నిరసన.. పే స్లిప్పులు చేతబట్టి

సీఎం కేసీఆర్ అలా మాట్లాడటాన్ని తీవ్రంగా ఖండించారు నిర్మల్ జిల్లా ఆర్టీసీ జేఏసీ నేతలు. 20 ఏళ్లుగా ఆర్టీసీకి సేవలందిస్తున్నప్పటికీ ప్రస్తుతం 25 వే ల రూపాయలే వేతనం లభిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అన్నీ తెలిసి కూడా కేసీఆర్ ఇలా మాట్లాడటం తగదని హెచ్చరించారు. సీనియారిటీ ఉన్న ఆర్టీసీ ఉద్యోగులు 50 వేల రూపాయల జీతాలు తీసుకుంటున్నారని సీఎం కేసీఆర్ అబద్దపు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.

ఏళ్లకు ఏళ్లుగా సీనియారిటీ ఉన్నప్పటికీ జీతాలు మాత్రం చాలా తక్కువగా ఉన్నాయంటూ వాపోయారు. మా పే స్లిప్పులు చూస్తే తాము ఎంత జీతాలు తీసుకుంటున్నామనే విషయం బోధపడుతుందని.. వీటిని ఒకసారి కేసీఆర్ పరిశీలించాలని సూచించారు.

కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..!

కేసీఆర్ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు..!

ఆర్టీసీ కార్మికులు భారీ వేతనాలు తీసుకుంటున్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆరోపించారు. క్షేత్రస్థాయిలో తమ వేతనాలు ఒకలా ఉంటే.. దాన్ని డబుల్ చేసి చూపించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా తప్పుడు ప్రచారం మానుకోవాలని.. లేదంటే ప్రభుత్వం తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలెంత.. సోషల్ మీడియాలో వివరాల పట్టిక వైరల్

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలెంత.. సోషల్ మీడియాలో వివరాల పట్టిక వైరల్

అదలావుంటే ఆర్టీసీ ఉద్యోగుల జీతాలకు సంబంధించిన వివరాలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అందులో పది సంవత్సరాల సర్వీస్ ఉన్న డ్రైవర్‌కు నెల జీతం కటింగ్స్ అన్నీ పోను చేతికి వచ్చేది 24,762 రూపాయలు కాగా.. కండక్టర్‌కు 22,865 రూపాయలుగా ఉంది. అదే ఇరవై సంవత్సరాల సర్వీస్ ఉన్న డ్రైవర్‌కు 30,856 రూపాయలు.. కండక్టర్‌కు 28,682 రూపాయలుగా కనిపిస్తోంది. ఇక ముప్పై సంవత్సరాల సర్వీస్ ఉన్న డ్రైవర్‌కు 37,227 రూపాయలు.. కండక్టర్‌కు 34,775 రూపాయల వేతనం లభిస్తోంది.

కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్

కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఫైర్

ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఎంతున్నాయో ఈ పట్టిక చూస్తే తెలిసి పోతుందంటూ నెటిజన్లు ఈ వివరాలను బాగా షేర్ చేస్తున్నారు. ఆర్టీసీ కార్మికుల జీవితాలతో ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. వారికి సంపూర్ణ మద్దతు ప్రకటించాలని కోరుతూ సోషల్ మీడియాలో చాలామంది కామెంట్స్ పెడుతున్నారు. తక్కువ జీతాలతో ఎక్కువ పని చేయించుకోవడమే గాకుండా.. భారీ వేతనాలు ఇస్తున్నామని కేసీఆర్ ప్రకటించడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.

ఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ ఎఫెక్ట్.. అదుపుతప్పి వాగులోకి బస్సుఆర్టీసీ తాత్కాలిక డ్రైవర్ ఎఫెక్ట్.. అదుపుతప్పి వాగులోకి బస్సు

English summary
CM KCR's comments that RTC workers are taking salaries of more than 50 thousand have taken an innovative protest in Nirmal district. The pay slips caused concern.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X