• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

తెలంగాణాలో కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె .. బస్సులు బంద్ .. డిపోల వద్ద 144 సెక్షన్

|

ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. గత అర్ధ రాత్రి నుండి సమ్మె బాట పట్టారు ఆర్టీసీ కార్మికులు .తమ డిమాండ్ల సాధన కోసం సమ్మెబాట పట్టిన ఆర్టీసీ కార్మికులను సమ్మె ఆలోచన విరమించుకోవాలని వారితో చర్చలు జరిపిన త్రిసభ్య కమిటీ కోరింది. ఇక అంతే కాదు డిస్మిస్‌ చేస్తాం. ఎస్మా ప్రయోగిస్తాం. మీ స్థానాల్లో కొత్త వారిని తీసుకుని పోస్టులను భర్తీ చేస్తాం అంటూ హెచ్చరికలు జారీ చేసింది. డిస్మిస్‌ చేసినా, ఎస్మాను ప్రయోగించినా సమ్మెను ఆపేది లేదని ఆర్టీసీ జేఏసీ తెగేసి చెప్పింది. దీంతో రాష్ట్రంలోని 97 డిపోల డ్రైవర్లు, కండక్టర్లు, ఇతర కార్మిక వర్గాలు విధులను బహిష్కరించాలని నిర్ణయించిన నేపథ్యంలో అన్ని డిపోలు, యూనిట్లలో కార్మికులు సమ్మెలో పాల్గొని, ఒక్క బస్సు కూడా బయటకు వెళ్లకుండా చూడాలని కార్మిక నేతలు పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఆర్టీసీ సమ్మె కొనసాగుతుంది.

ఎస్మా ప్రయోగంతో ఆందోళన అణిచే యత్నం ... నాడు జయలలిత.. నేడు కేసీఆర్ ?

ప్రభుత్వం దిగొచ్చే దాకా నిరవధిక సమ్మె చేయనున్న ఆర్టీసీ కార్మికులు

ప్రభుత్వం దిగొచ్చే దాకా నిరవధిక సమ్మె చేయనున్న ఆర్టీసీ కార్మికులు

ప్రభుత్వం దిగి వచ్చేదాకా సమ్మెను నిరవధికంగా కొనసాగిస్తామని హెచ్చరించారు ఆర్టీసీ కార్మిక జేఏసీ . ఆర్టీసీ సమ్మె పై అటు ప్రభుత్వం, ఇటు కార్మిక సంఘాలు ఎటు తగ్గకపోవడంతో ఏం జరుగుతుందోనన్న ఆందోళన నెలకొంది. ఏది ఏమైనప్పటికీ ఆర్టీసీ కార్మిక సంఘాల తలపెట్టిన నిరవధిక సమ్మె కొనసాగుతోంది. ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. రాష్ట్రంలోని 50వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మెలో పాల్గొంటారని జేఏసీ నేత అశ్వత్థామరెడ్డి తెలిపారు. అదే విధంగా కార్మికులు ఆందోళనల్లో పాల్గొంటున్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలని సూచించిన సీఎం కేసీఆర్

ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలని సూచించిన సీఎం కేసీఆర్

ఆర్టీసీ సమ్మె నేపథ్యంలో ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చెయ్యాలని ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఆర్టీసీలో పదివేల బస్సులు నడుస్తున్నాయని, ఇందులో 2100 బస్సులు ఆర్టీసీ అద్దెకు తీసుకున్న బస్సులని సీఎం కేసీఆర్‌కి అధికారులు చెప్పారు. మరో ఐదు వేల మంది తాత్కాలిక డ్రైవర్లుగా పని చేయడానికి ముందుకు వచ్చారన్నారు. దీంతో 7వేలకు పైగా బస్సులు నడపడం సాధ్యమతుందని చెప్తున్నారు . ఇక అన్ని రకాల ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై దృష్టి సారించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా చూడాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. ఇక అదే సమయంలో ఆర్టీసీ కార్మికుల సమ్మె పై తీవ్రంగా మండిపడ్డారు.

సమ్మె చేస్తున్న కార్మికులు ఉద్యోగాలు వదులుకున్నట్టే అంటున్న సర్కార్

సమ్మె చేస్తున్న కార్మికులు ఉద్యోగాలు వదులుకున్నట్టే అంటున్న సర్కార్

సమ్మెకు దిగుతున్న కార్మికులపై కఠిన నిర్ణయాలు తీసుకోవాలని నిర్ణయించిన ప్రభుత్వం ఇకపై వారితో చర్చలు ఉండవని తేల్చేసింది. శనివారం సాయంత్రం 6 గంటల్లోపు ఆర్టీసీ డిపోల్లో విధుల్లో చేరిన వారిని మాత్రమే ఇకపై ఆర్టీసీ ఉద్యోగులుగా పరిగణించాలని నిర్ణయం తీసుకున్నట్లు గా తెలుస్తోంది. అప్పటికి విధుల్లో చేరని వారిని తమంతట తాముగా ఉద్యోగాలు వదిలిపెట్టి వెళ్లిన వారిగా గుర్తించాలని ప్రభుత్వం నిశ్చయించింది. విధుల్లో చేరని వారిని ఇక ఎట్టి పరిస్థితుల్లోనూ తిరిగి ఉద్యోగంలోకి తీసుకోరాదని ప్రభుత్వం విధాన నిర్ణయం తీసుకుంది. విధుల్లో చేరి, బాధ్యతలు నిర్వర్తిస్తున్న కార్మికులకు పూర్తిస్థాయిలో రక్షణ, ఉద్యోగ భద్రత కల్పిస్తామని స్పష్టం చేసింది. ఇక ఈ నేపద్యంలో కార్మికులు సమ్మెలో పాల్గొంటున్నప్పటికీ తమ ఉద్యోగం ఏమవుతుందో అన్న ఆందోళన మాత్రం కొనసాగుతోంది.

తెలంగాణాలో డిపోలకే పరిమితం అయిన బస్సులు .. డిపోల వద్ద 144 సెక్షన్

తెలంగాణాలో డిపోలకే పరిమితం అయిన బస్సులు .. డిపోల వద్ద 144 సెక్షన్

తెలంగాణ వ్యాప్తంగా అర్ధరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగడంతో ఎక్కడి బస్సులు అక్కడే నిలిచిపోయాయి. ఇక ఆర్ టి సి కార్మికులకు ప్రతిపక్షాలు మద్దతు పలికాయి. డిపోల దగ్గర అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. అన్ని డిపోల దగ్గర 144 సెక్షన్ విధించి గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. భారీగా పోలీసులు మోహరించారు. కార్మికుల సమ్మె ప్రభావం దసరాకు సొంతూళ్లకు వెళ్లేవారి మీద పడకుండా ఆర్టీసీ యాజమాన్యం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోంది.

 పోలీసుల భద్రత నడుమ బస్సులు నడిపే యత్నం

పోలీసుల భద్రత నడుమ బస్సులు నడిపే యత్నం

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 9 డిపోల్లో 4,153 మంది కార్మికులు విధులకు హాజరుకాకుండా ధర్నాకు దిగారు. ఇక ఖమ్మం జిల్లాలో ఆర్టీసీ కార్మికులు ఆందోళన బాట పట్టారు. దీంతో పోలీసు భద్రతతో ఆర్టీసీ సర్వీసులు నడుస్తున్నాయి. డిపోల దగ్గర భారీగా పోలీసుల మోహరించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఏడు డిపోల్లోని ఆర్టీసీ కార్మికులు విధులకు హాజరు కాలేదు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 6 డిపోల పరిధిలోని 2500 మంది కార్మికులు విధులకు దూరంగా ఉన్నారు. నివురుగప్పిన నిప్పు లాగ ప్రస్తుతానికి ఆర్టీసీ సమ్మె కొనసాగుతోంది.

English summary
RTC workers went on strike from midnight across Telangana. The opposition supported the RTC workers. Police have taken precautionary measures to prevent unexpected incidents near the depots. Section 144 has been set up at all depots with a tight monitoring . Heavily deployed by the police. RTC management is making alternative arrangements so that the impact of the workers' strike will not fall on Dussehra travellers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more