వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణలో ఆయుధపూజ రోజు అంతా అరెస్టులే.. గన్ పార్క్ వద్ద ఆర్టీసీ నేతల అరెస్టు..

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసీ రూపంలో మొదటి ప్రతిఘటన ఎదురైంది. అదికూడా ప్రభుత్వాన్ని కుదిపేసే స్ధాయిలో ఎదురు దెబ్బ తగిలింది. ఆర్టీసి కార్మికులు తమ డిమండ్ల సాధన కోసం పట్టుపట్టడం, ప్రభుత్వం అంతకన్నా మొండిగా వ్యవహరించి ససేమిరా అనడంతో నువ్వా నేనా అనేంతవరకు పరిస్ధితి వెళ్లింది. దీంతో దసరా పండగ పూట సామాన్య ప్రజానికం అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. పండగ సెలవులను పురస్కరించుకుని గ్రామాలకు వెళ్లి తమ బంధువులతో ఆప్యాయంగా గడుపుదామనుకున్న వాళ్లకు నిరాశే ఎదురయ్యింది. ఆర్టీసి కార్మికుల సమ్మెతో బస్సులు లేక దూరప్రాంతాలకు వెళ్లే వారు అనేక ఇబ్బందులు పడ్డట్టు తెలుస్తోంది.

 ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు .. ఉద్యోగుల తొలగింపు కరెక్ట్ కాదన్న పవన్ ఆర్టీసీ కార్మికుల సమ్మెకు జనసేన మద్దతు .. ఉద్యోగుల తొలగింపు కరెక్ట్ కాదన్న పవన్

వివిధ ఆర్టీసి సంఘాల నేతల అరెస్టు..

వివిధ ఆర్టీసి సంఘాల నేతల అరెస్టు..

గన్ పార్క్ వద్ద ఉద్రిక్తం.. వివిధ ఆర్టీసి సంఘాల నేతల అరెస్టు..
తెలంగాణ ప్రభుత్వానికి ఆర్టీసి కార్మికుల వ్యవహారం శరాఘాతంలా పరిణమించింది. పండుగ పూట ప్రజలకు శుభాకాంక్షలు కూడా చెప్పలేని పరిస్ధితులను ప్రభుత్వానికి కల్పించారు ఆర్టీసి కార్మికులు. తాము జీతాల కోసం పోరాడటం లేదని, జీవితాల కోసం పోరాటం చేస్తున్నామని ఆర్టీసి కార్మిక నేతలు స్పష్టం చేస్తున్నారు. తమది చాలా న్యాయమైన డిమాండ్ అని, ప్రభుత్వం కావాలనే సమస్యను ఝఠిలం చేస్తోందని కార్మిక నేతలు ఘాటుగా విమర్శిస్తున్నారు. ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ఇందిరా పార్క్ వద్ద గల ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమాలకు పిలుపునిస్తే పోలీసులతో అణచివేసే కుట్రకు ప్రభుత్వం పాల్పడిందని కార్మిక నేతలు ఆరోపిస్తున్నారు. శాంతి యుతంగా అమర వీరుల స్ధూపం వద్ద నివాళులు అర్పిస్తున్న కార్మిక సంఘాల నేతలను కూడా ప్రభుత్వం అరెస్టులు చేయించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేసారు.

 అమరుల త్యాగాలతోనే సీఎం ఐన కేసీఆర్.. వారి సాక్షిగా అరెస్టులు చేయించారన్న నేతలు..

అమరుల త్యాగాలతోనే సీఎం ఐన కేసీఆర్.. వారి సాక్షిగా అరెస్టులు చేయించారన్న నేతలు..

పోలీసు కంట్రోల్ రూమ్ ఎదురుగా తెలంగాణ అమరవీరుల స్థూపం గన్ పార్క్ వద్ద నివాళులు అర్పించేందుకు వచ్చిన ఆర్టీసీ జేఏసీ నేతలు, కార్మికులను పోలీసులు అరెస్టు చేశారు. జేఏసీ నేత అశ్వత్థామ రెడ్డితో పాటు రాజిరెడ్డి, విఈ రావు, పలువురు నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్లకు తరలించారు. గన్ పార్క్ వద్దకు వందల సంఖ్యలో వస్తున్న కార్మికులను పోలీసులు ఎక్కడికక్కడ నిరోధించారు. దీంతో ఆ ప్రాంతంలో పోలీసులు, కార్మికుల మధ్య తోపులాట జరిగి ఉద్రిక్తంగా మారింది. తాము శాంతియుతంగా నివాళులు అర్పించేందుకు వస్తే పోలీసులు అదుపులోకి తీసుకుంటున్నారని ఆర్టీసీ కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు.

రెండురోజులు తాత్కాలిక వెసులుబాటు.. బుదవారం కార్యాచరణ తెలియజేస్తామన్న అశ్వద్దామ రెడ్డి..

రెండురోజులు తాత్కాలిక వెసులుబాటు.. బుదవారం కార్యాచరణ తెలియజేస్తామన్న అశ్వద్దామ రెడ్డి..

అమరుల త్యాగాల వల్ల చంద్రశేఖర్ రావు ముఖ్యమంత్రి అయ్యారని, అమరులకు నివాళులు అర్పించే హక్కు తమకు లేదా అని అశ్వత్థమారెడ్డి ప్రశ్నించారు. ఎట్టి పరిస్థితుల్లో సమ్మె విరమించే ప్రసక్తే లేదని భవిష్యత్ కార్యాచరణ త్వరలో వెల్లడిస్తామన్నారు. ఐతే పండగ సందర్బంగా అనేక మంది ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నట్టు తమ దృష్టికి వచ్చినందును రెండు రోజులు సమ్మెకు వెసులుబాటు కల్పిస్తున్నట్టు ఆయన తెలిపారు. తిరిగి బుదవారం మళ్లీ తమ భవిష్యత్తు ప్రణాళిక తెలియజేస్తామని తెలిపారు.

 రాజకీయ పార్టీల మద్దత్తు... కేసీఆర్ రాజ్యంగం చెల్లదన్న బీజేపి..

రాజకీయ పార్టీల మద్దత్తు... కేసీఆర్ రాజ్యంగం చెల్లదన్న బీజేపి..

తెలంగాణలో సమ్మె చేస్తున్న ఆర్టీసి కార్మికులకు మద్దత్తుగా పలు రాజకీయ పార్టీలు సంఘీభావం ప్రకటించాయి. నేషనల్ మజ్దూర్ యూనియన్ సంఘం నేతలు బీజేపి రాష్ట్ర అద్యక్షుడు డాక్టర్ కె లక్ష్మణ్ ను సంప్రదించి వారి ప్రధాన డిమాడ్లను వివరించారు అంతే కాకుండా తమకు బీజేపి తరుపున మద్దత్తు తెలపాలని విజ్ఞప్తి చేసారు. అందుకు డాక్టర్ లక్ష్మణ్ సానుకూలంగా స్పందించారు. ఆర్టీసి కార్మికుల న్యాయమైన డిమాండ్ల సాధనకు రాష్ట్ర బీజేపి మద్దత్తు ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ నుండి మాల్కాజిగిరి ఎంపీ ఏ రేవంత్ రెడ్డి కార్మికుల డిమాండ్లకు అనుకూలంగా ప్రభుత్వం నడుచుకోవాలంటూ ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ రాసారు.

 స్పందించిన పవన్ కళ్యాణ్.... సీఎం కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి..

స్పందించిన పవన్ కళ్యాణ్.... సీఎం కు బహిరంగ లేఖ రాసిన రేవంత్ రెడ్డి..

అంతే కాకుండా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా తెలంగాణలో జరుగుతున్న ఆర్టీసి కార్మికుల సమ్మె గురించి, ప్రభుత్వ చర్యల గురించి ఆవేదన వ్యక్తం చేసారు. ఉద్యోగులను విధుల నుండి తక్షణం తొలగిస్తే వారి కుటుంబాలు రోడ్డున పడతాయని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ తెలంగాణ శాఖ కూడా ఆర్టీసి కార్మికులకు సంఘీభావం ప్రకటించింది. సోమవారం ఉదయం గన్ పార్క్ వద్ద అరెస్టు చేసిన కార్మిక సంఘాల నేతలను టీడిపి నాయకులు యల్ రమణ, రావుల చంద్రశేఖర్ రెడ్డి పోలీస్ స్టేషన్ల నుండి వ్యక్తిగత పూచీకత్తు పై విడుదల చేయించారు. ఇక తెలంగాణ జనసమితి అద్యక్షుడు కోదండరాం కూడా ఆర్టీసి కార్మికులకు తన మద్దత్తులను తెలిపారు.

English summary
The Telangana government encountered the first resistance in the form of RTC. It also suffered a setback at the level of the government. As long as the RTC workers were insisting on the practice of their dimandas and the government was more stubborn, the situation went on.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X