వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్టీసీ కార్మికుల తొలగింపు ... సీఎం కేసీఆర్ అహంకారానికి నిదర్శనం... ఇది పెద్ద కుట్ర : భట్టి ఫైర్

|
Google Oneindia TeluguNews

తమ డిమాండ్ల సాధన కోసం ఆర్టీసీ కార్మికులు సమ్మె బాట పడితే, పండుగ సమయాల్లో ప్రజలకు ఇబ్బందులు కలిగించవద్దని, విధుల్లో చేరి తీరాలని తెలంగాణ సర్కారు హుకుం జారీచేసింది. ఒకవేళ సమ్మె చేస్తే ఎస్మా ప్రయోగిస్తామని, ఉద్యోగాల నుండి తొలగిస్తామని సీఎం కేసీఆర్ తమ ప్రభుత్వ నిర్ణయాన్ని ప్రకటించారు. అయినా ప్రభుత్వ నిర్ణయాన్ని బేఖాతరు చేస్తూ ఆర్టీసీ కార్మికుల సమ్మె చేయడాన్ని సీరియస్ గా తీసుకున్న గులాబీ బాస్ చివరికి అనుకున్నదే చేశారు. ఐదో తేదీ సాయంత్రం 6 గంటలకు విధులకు హాజరు కాని వారందరినీ ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించారు.

ఇక దీంతో ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులే కాదు, ప్రతిపక్ష పార్టీల నేతలు సైతం సీఎం కేసీఆర్ నిరంకుశత్వం పై నిప్పులు చెరుగుతున్నారు. సమ్మె చేస్తున్న ఆర్టీసీ కార్మికులను తొలగించి కొత్త సిబ్బందిని నియమిస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన ప్రకటనను సీఎల్పీ నేత భట్టి విక్రమార్క ఖండించారు. ఆయన సీఎం కేసీఆర్ నిర్ణయాన్ని తీవ్రంగా ఆక్షేపించారు. ఆ ప్రకటన ఆయన అహంకారానికి నిదర్శనమని భట్టి విక్రమార్క పేర్కొన్నారు. ప్రజాస్వామ్య రాష్ట్రంలో కార్మికులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేయడం ఓ భాగమన్న భట్టి విక్రమార్క వారితో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాల్సింది పోయి ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నాము అని ప్రకటించడం ముఖ్యమంత్రి అహంభావానికి నిదర్శమని మండిపడ్డారు.

Bhatti Vikramarka

ఇక అంతే కాదు ఆర్టీసీ నష్టాలకు, కార్మికుల కష్టాలకు కారణం ప్రభుత్వ విధానాలే అని ఆయన నిప్పులు చెరిగారు. ఆర్టీసీ నష్టాలకు కార్మికులు కారణం కాదన్న భట్టి , డీజిల్‌పై రాష్ట్రప్రభుత్వం వేసే అధిక పన్నులే కారణమని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల విషయంలో సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయంతో దీని వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన ఆరోపిస్తున్నారు. ఆర్టీసీని హస్తగతం చేసుకునేందుకు కేసీఆర్ పెద్ద కుట్ర చేస్తున్నట్టు కనబడుతోందని భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇక అంతే కాదు కాంగ్రెస్ ఆర్టీసీ విషయంలో కార్మికుల పక్షానే నిలబడుతుందని స్పష్టం చేశారు. వారి న్యాయమైన డిమాండ్ల సాధనకు కృషి చేస్తామని పేర్కొన్నారు. ఆర్టీసీ కార్మికుల కోసం ఎంతవరకైనా ప్రయాణం చేస్తామని కాంగ్రెస్ పార్టీ నాయకులు తేల్చి చెబుతున్నారు. సీఎం కేసీఆర్ నిరంకుశ విధానాలను ఇప్పటికైనా విడనాడాలని, లేకుంటే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదని హెచ్చరిస్తున్నారు.

English summary
Telangana Chief Minister KCR's statement on RTC workers condemned by CLP leader Bhatti Vikramarka. Bhatti Vikramarka said the statement was a testament to KCR's pride.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X