వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ వాళ్లకు పాలన చేతకాదా, చెప్తా: కెసిఆర్ ఆగ్రహం (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ వాళ్లకు పరిపాలన చేతకాదా, అలా అన్నవాళ్లకు జవాబు చెబుతామని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు మంగళవారం అన్నారు. తెలంగాణ అభివృద్ధి కోసం రాజకీయ శక్తులు అన్నీ ఏకం కావాల్నారు. రాష్ట్రాన్ని దిద్దుకోవడం కోసం పునరేకీకరణ అవసరమమన్నారు.

ఇఫ్పటికే కెసిఆర్ విపక్షాలకు చెందిన ఎమ్మెల్యేలను, ముఖ్యనేతలను ఆకర్షిస్తున్నారు. మంగళవారం బస్వరాజు సారయ్య తెరాసలో చేరారు. ఆయన బాటలోనే మరికొందరు కాంగ్రెస్ నేతలు నడవనున్నారని తెలుస్తోంది. వరంగల్ మున్సిపల్ ఎన్నికలకు ముందు సారయ్య చేరిక కాంగ్రెస్ పార్టీకి పెద్ద దెబ్బే.

అదే సమయంలో ఇద్దరు టిడిపి ఎమ్మెల్యేలు కూడా కారు ఎక్కనున్నారని వార్తలు వస్తున్నాయి. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేత సహా నల్గొండ, రంగారెడ్డి, మెదక్ జిల్లాలతో పాటు హైదరాబాదులోని పలువురు నేతలు కారు ఎక్కనున్నారని వార్తలు వస్తున్నాయి.

తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

ప్రస్తుతం రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ చేరికలు సాధారణమైనవి కావని, తెలంగాణ భవిష్యత్తు కోసం ప్రజల బాగు కోసం జరుగుతున్న రాజకీయ పునరేకీకరణలో భాగమని ముఖ్యమంత్రి కెసిఆర్ అన్నారు.

తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

వరంగల్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి బస్వరాజు సారయ్య, టిడిపి నగర అధ్యక్షులు అనిశెట్టి మురళి, కుడా మాజీ చైర్మన్ మూగా రామ్మోహన్, పలువురు మాజీ కార్పొరేటర్లు, కాంగ్రెస్, టిడిపి నాయకులు సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.

 తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కెసిఆర్ మాట్లాడారు. ఎన్నో కష్ట, నష్టాలకోర్చి తెలంగాణ సాధించుకున్నామని, వచ్చిన తెలంగాణను గొప్పగా తీర్చిదిద్దుకోవాల్సిన అవసరముందరి అన్నారు. దేశం ముందు తెలంగాణ నిలిచి, గెలువాలన్నారు. అందుకే తెలంగాణ అంతా ఏకం కావాలని చెప్పారు.

తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

రాజకీయాలంటే ఐదేళ్లకోసారి ఎన్నికలు రావడం.. ఒకరు ఓడటం.. ఇంకొకరు గెలవడం సాధారణమేనన్నారు. ఇప్పుడు కావాల్సింది రాజకీయం కాదన్నారు. తెలంగాణోళ్లకు పరిపాలన చేతకాదన్న వారికి సమాధానం చెప్పాలని ముఖ్యమంత్రి అన్నారు.

తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ తదితర వర్గాల కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నామని, ప్రజలే కేంద్ర బిందువుగా, సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తున్నట్లు తెలిపారు. కరెంటు సమస్య లేకుండా చేశామని, కరువు నివారణకు శాశ్వత చర్యలు తీసుకుంటున్నామన్నారు.

తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

డబుల్ బెడ్‌రూం ఇండ్లు కట్టుకుంటున్నామని, ఇంకా చాలా చేసుకుంటున్నామని సీఎం పేర్కొన్నారు. అవన్నీ పనులు జరగాలని, రాజకీయ శక్తులన్నీ ఏకమై తెలంగాణ రాష్ట్ర అభివృద్ధితో ముందడుగు వేయాలన్నారు.

తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

బస్వరాజు సారయ్య తనకు మిత్రుడని, తెలంగాణ సాధన కోసం తన పద్ధతిలో పని చేశారన్నారు. ఆయన్ని కలుపుకొనిపోతామని, యువకుడు అనిశెట్టి మురళికి కూడా సాదర స్వాగతం అని చెప్పారు.

 తెరాసలోకి చేరికలు

తెరాసలోకి చేరికలు

వరంగల్ అభివృద్ధికి ఇప్పటికే అనేక చర్యలు తీసుకున్నామన్న ముఖ్యమంత్రి, నగరానికి ఏటా రూ.300 కోట్లు కేటాయిస్తామన్నారు. మామునూరు విమానాశ్రయం పునరుద్ధరిస్తామని, అంతా కలిసి అభివృద్ధి చేసుకుందామన్నారు. బస్వరాజు సారయ్య మాట్లాడుతూ.. కాంగ్రెస్ తనకు అన్యాయం చేయలేదని ఎన్నో అవకాశాలిచ్చిందని చెప్పారు.

English summary
Giving a jolt to the already sulking Congress party ahead of the elections to the GWMC elections, former minister and Congress senior leader Basavaraju Saraiah on Tuesday crossed over to the ruling TRS prompting the TPCC to suspend him from the party.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X