వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

విజయారెడ్డి దాడిపై అధికార పార్టీ నేతల ప్రోత్సాహం : ఎంపీ రేవంత్ రెడ్డి

|
Google Oneindia TeluguNews

సజీవ దహనం అయిన అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ విజయారెడ్డి పై దాడిని ఎంపీ రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. కొత్తపేటలో ఆమె బౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఈ నేపథ్యంలోనే ఆయన మీడియాతో మాట్లాడారు. మేజిస్ట్రేట్ అధికారాలు ఉన్న విజయారెడ్డిపై దాడి జరగడం వెనక ముమ్మాటికి అధికార పార్టీ నేతల ప్రోద్భలం ఉందని ఆరోపణలు చేశారు. ఇటివల రెవెన్యూ ఉద్యోగులను ప్రభుత్వం దొంగలుగా, దోపిడిదారులుగా చీత్రీకరించే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దాని ప్రభావమే అధికారులపై దాడులని పేర్కోన్నారు.

ఇక మహిళ అధికారికి నివాళులు అర్పించేందుకైన ముఖ్యమంత్రితోపాటు హరీష్‌రావులు రాకపోవడంపై చాల బాధకరమని అన్నారు. మరోవైపు ఆమే అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని డిమాండ్ చేశారు. తహాసీల్దారు దాడి ఘటనపై సీబీఐ విచారణ జరపాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. దాడికి ప్రత్యక్షంగా , పరోక్షంగా కారణమైన వారిపై కఠిన చర్యలు చేపట్టాలని అన్నారు.

ruling party leaders encouragement behind an attack of Tahsildar

మరోవైపు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు జరిగిన దాడిని తీవ్రంగా పరిగణించి, ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కొరారు. ప్రభుత్వం ఒత్తిడి తెచ్చేందుకు రెవెన్యూ సంఘాలు కార్యచరణ ప్రకటిస్తే అందుకు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ప్రకటిస్తుందని చెప్పారు.

ఇక కాసేపటి క్రితమే విజయా రెడ్డి అంతిమ యాత్ర ప్రారంభమైంది. నాగోలులోని స్మశానవాటికలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలోనే అంతిమ యాత్రలో పాల్గోందుకు ఇతర తహాసీల్దార్లతో పాటు, డిప్యూటి కలెక్టర్లు, ఇతర ఉద్యోగసంఘాల నాయకులు పాల్గోన్నారు. అంతకు ముందు ఆమెకు పలువురు ఉద్యోగులు నివాళులు అర్పించారు.

English summary
MP Revant Reddy has strongly condemned the attack on Abdullapurmet Tehsildar Vijaya Reddy. there were the ruling party leaders encouragement behind an attack he added.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X