వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రాహూల్‌తో రేవంత్ భేటీ, నవంబర్ 9న, కాంగ్రెస్‌లోకి?

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి టిడిపికి గుడ్ బై చెబుతారనే ప్రచారం సాగుతోంది. రాహూల్ గాంధీతో సమావేశమయ్యారనే ప్రచారం కూడ సాగింది. అయితే టిఆర్ఎస్ మంత్రులపై ఈసీకి ఫిర్యాదు చేసేందుకే తాన

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి టిడిపిని వీడుతారనే ప్రచారం సాగుతోంది. ఢిల్లీలోని కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీని కలిశారని ప్రచారం టిడిపి వర్గాల్లో కలకలం రేపుతోంది. అయితే కాంగ్రెస్ పార్టీలో తాను చేరేందుకు ప్రయత్నిస్తున్నానని వస్తున్న వార్తలను రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.అయితే నవంబర్ 9వ, తేదిన రేవంత్‌రెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం కూడ సాగుతోంది.

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే కొంత కాలంగా ప్రచారం సాగుతోంది.అయితే టిడిపి నేత రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేతలను కలుసుకొనేందుకేనని మంగళవారం ఉదయం నుండి సాగుతోంది.

అయితే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొనేందుకు ఢిల్లీకి వెళ్ళినట్టు వస్తున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి తీవ్రంగా ఖండించారు.. ఇవాళే కాదు కొంత కాలంగా రేవంత్ రెడ్డి టిడిపిని వీడుతారనే ప్రచారం మాత్రం ఉంది.

అయితే ఈ ప్రచారాన్ని రేవంత్‌రెడ్డితో పాటు ఆయన వర్గీయులు తీవ్రంగా ఖండిస్తున్నారు. వచ్చే ఎన్నికల సమయంలో పొత్తుల విషయమై పార్టీ నేతలు చేసిన పరస్పర విరుద్ద ప్రకటనలు పార్టీ శ్రేణుల్లో గందరగోళాన్ని సృష్టించాయి.

టిఆర్ఎస్‌తో టిడిపి పొత్తు పెట్టుకోవడమే కారణమా?

టిఆర్ఎస్‌తో టిడిపి పొత్తు పెట్టుకోవడమే కారణమా?

తెలంగాణలో టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా నిలబడ్డ నేతల్లో రేవంత్‌రెడ్డి ముందుంటారు. అయితే తెలంగాణలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో రేవంత్‌రెడ్డి టిడిపిని వీడాలని నిర్ణయం తీసుకొంటున్నారనే ప్రచారం నెలకొంది.తెలంగాణలో టిఆర్ఎస్‌ను ఎదుర్కొనేందుకు అవసరమైతే కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకొంటామని టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ప్రకటించారు.అయితే ఈ ప్రకటనను కొందరు టిడిపి నేతలు తప్పుబట్టారు. కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా టిడిపి ఆవిర్భవించిన విషయాన్ని కొందరు నేతలు గుర్తుచేస్తున్నారు. అవసరమైతే టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొంటామని టిడిపి సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహ్ములు చేసిన ప్రకటన కలకలాన్ని రేపుతోంది.దీంతోనే రేవంత్ కాంగ్రెస్ వైపు చూస్తున్నారని ప్రచారం సాగుతోంది.

రాహూల్‌గాంధీతో సమావేశారనే ప్రచారం

రాహూల్‌గాంధీతో సమావేశారనే ప్రచారం

ఢిల్లీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీతో టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి మంగళవారం నాడు మధ్యాహ్నం మూడున్నర గంటలకు సమావేశమయ్యారని ప్రచారం సాగుతోంది. తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఆ పార్టీ నేత కొప్పుల రాజు కూడ ఈ సమావేశంలో పాల్గొన్నారనే ప్రచారం సాగుతోంది. అయితే ఈ ప్రచారంపై కాంగ్రెస్ పార్టీ నుండి అధికారికంగా ప్రకటన చేయలేదు. రేవంత్ మాత్రం ఈ ప్రచారాన్ని ఖండిస్తున్నారు.

రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే

రాజకీయంగా భవిష్యత్తు ఉండదనే

తెలంగాణలో టిడిపి వచ్చే ఎన్నికల్లో టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకొంటే రాజకీయంగా భవిష్యత్ ఉండదనే అభిప్రాయంతో రేవంత్ వర్గీయులు ఉన్నారు. టిఆర్ఎస్‌కు వ్యతిరేకంగా కలిసి వచ్చే పార్టీలతో జతకడితేనే టిడిపి బతికి బట్టకడుతోందనే అభిప్రాయం కూడ ఉంది. అయితే అదే సమయంలో టిఆర్ఎస్‌తో పొత్తు పెట్టుకోవడం వల్ల తెలంగాణలో కొన్ని స్థానాలను దక్కించుకోవచ్చని మరికొందరు టిడిపి నేతలు కూడ ఆశతో ఉన్నారు.అయితే వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీతో పొత్తు ఉండాలనే విషయమై తాను చూసుకొంటానని టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు పార్టీ నేతలకు సూచించారు.అయితే అనంతపురం జిల్లాలో కెసిఆర్ టూర్‌లో చోటుచేసుకొన్న పరిణామాలు కూడ తెలంగాణలో టిడిపిపై తీవ్ర ప్రభావం చూపాయి. ఈ విషయమై చంద్రబాబునాయుడు ఏపీకి చెందిన పార్టీ నేతలపై కొంత ఆగ్రహం వ్యక్తం చేశారు.

రాహూల్ సభలోనే రేవంత్ కాంగ్రెస్ లో చేరిక

రాహూల్ సభలోనే రేవంత్ కాంగ్రెస్ లో చేరిక

ఈ ఏడాది నవంబర్ 9వ, తేదిన వరంగల్‌లో నిర్వహించే రాహూల్ గాంధీ సభలో రేవంత్‌రెడ్డి టిడిపికి గుడ్‌బై చెప్పి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం సాగుతోంది. తనతో పాటు మరికొందరు టిడిపి నేతలు కూడ కాంగ్రెస్ పార్టీలో చేరుతారని రేవంత్ రాహూల్‌కు చెప్పారనే ప్రచారం కూడ ఉంది. అయితే ఈ ప్రచారంపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీలో చేరే విషయమై వస్తున్న ప్రచారాన్ని రేవంత్ రెడ్డి ఖండించారు. ఈ ప్రచారాన్ని ఖండించిన కొద్దిసేపటికే రేవంత్ రెడ్డి రాహూల్‌ను కలిశారనే ప్రచారం సాగడం కలకలం రేపుతోంది.

English summary
There is a spreading a rumour Telangana Tdp working president Revanth Reddy met AICC Vicepresident Rahulgandhi.But Revanth Reddy condemned this rumours.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X