• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ప్రకృతి కరుణించదు..! అదికారులు కనికరించరు..! దయనీయ స్థితిలో తెలంగాణ రైతులు..!!

|

హైదరాబాద్ : తెలంగాణ రైతులను అనేక సమస్యలు చుట్టుముడుతున్నాయి. ఓపక్క వరుణుడు కరునించక ఏరువాక మొదలు పెట్టని రైతులకు పెట్టుబడి సాయం ఊరిస్తోంది. ప్రభుత్వం ప్రకటించిన రైతుబంధు పధకం సకాలంలో అందక రైతులు దిగాలు పడుతున్నారు. కొంత మంది రైతులకు అసలు రైతుబంధు కింద ప్రభుత్వం అందిస్తానన్న సాయం అందదని, అందుకు రైతు దగ్గర సరైరన ఆధారాలు లేవని అదికారులు రైతులకు ఆర్థిక సాయాన్ని నిరాకరిస్తున్నారు. దీంతో రైతులు దిక్కుతోచని పరిస్ధితిలోకి వెళ్లి పోతున్నారు.

బతుకుతానని అనుకోలేదు, మహిళ FRO కన్నీళ్లు.. డీఎస్పీ, సీఐ ఔట్.. ప్రభుత్వంపై విపక్షాల దాడి

  అదిలాబాదులో భారీ వర్షం, ఆనందంలో రైతులు
  కొందరికే రైతుబంధు..! ఇబ్బంది పడుతున్న రైతన్న..!!

  కొందరికే రైతుబంధు..! ఇబ్బంది పడుతున్న రైతన్న..!!

  ఇదిలా ఉండగా ఖరీఫ్ మొదలయ్యి నాలుగు వారాలు దాటుతున్నా ఇంతవరకు రైతులు పొలంలో నాట్లు వేసుకున్న ధాఖాలాలు కనిపించగం లేదు. అటు వరుణుడు కరుణించక, పొలంలో బోరు బావులు ఎండిపోయి వ్యవసాయ దారులు అనేక ఇబ్బందులు పడుతున్నట్టు తెలుస్తోంది. ప్రభుత్వం అందిస్తున్న విత్తనాలు, ఎరువులు కాడా ఇంతవరకు చాలా గ్రమాలకు చేరలేదని, చేరినా అదికారులు అనేక నిబంధనలు పెట్టి ఇబ్బందులను పెడుతున్నట్టు రైతులు వాపోతున్నారు. ఇక రైతుబంధు పథకం క్రింద ఇచ్చే ఆర్థిక మొత్తం కూడా చాలా వరకు తమకు చేరడం లేదని రైతులు విచారాన్ని వ్యక్తం చేస్తున్నారు.

  40 శాతం మందికి మాత్రమే పెట్టుబడి సాయం..! 252.63 కోట్లకు గాను ఇచ్చింది 119 కోట్లే..!!

  40 శాతం మందికి మాత్రమే పెట్టుబడి సాయం..! 252.63 కోట్లకు గాను ఇచ్చింది 119 కోట్లే..!!

  జిల్లాలో రైతుబంధు కొందరికే అందింది. ప్రభుత్వం విడతల వారీగా నిధులను మంజూరు చేస్తుండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఖరీఫ్‌ సీజన్‌ పనులు ప్రారంభమై రోజులు గడుస్తున్నా రైతులకు పూర్తి స్థాయిలో పెట్టుబడి సహాయం అందలేదు. జిల్లాలోని 40 శాతం రైతాంగానికి మాత్రమే పెట్టుబడి సాయం అందగా, మరో 60 శాతం మంది రైతులకు అందాల్సి ఉంది. ఆయా రైతులకు సాయం అందాలంటే మరింత సమయం పట్టే అవకాశం ఉంది. జిల్లాలోని 2,29,566 మంది రైతులకు పెట్టుబడి సహాయం అందించాలని వ్యవసాయ శాఖ అధికారులు ప్రభుత్వానికి నివేదించారు. ఇందుకోసం రూ.252.63 కోట్ల నిధులు అవసరమని తేల్చారు. మే చివరి వారం లో రైతుబంధు పథకం కింద పెట్టుబడి స హాయంను అందించేందుకు ప్రభుత్వం ని ధులు విడుదల చేయడం ప్రారంభించింది.

  ఎదురు చూస్తున్న వేలాది మంది రైతులు..! అందని ద్రాక్షగా ఆర్థిక సాయం..!!

  ఎదురు చూస్తున్న వేలాది మంది రైతులు..! అందని ద్రాక్షగా ఆర్థిక సాయం..!!

  ఇప్పటి వరకు 20 విడతల్లో రైతులకు పెట్టుబడి సహాయం అందింది. ఇప్పటి వ రకు రూ.119 కోట్ల మేర రైతుల ఖాతాల్లో జమ అయ్యాయి. మరో రూ.133.63 కోట్ల నిధులు మంజూరు కావాల్సి ఉంది. ఖరీఫ్‌ సీజను పనులు రెండు వారాల క్రితమే ప్రారంభమయ్యాయి. జిల్లాలోని రైతులు పసుపు, మొక్కజొన్న, సొయా విత్తనాలు విత్తే పనిలో పడ్డారు. వరి పంటను సాగు చేయడానికి నారు సిద్ధం చేసుకుంటున్నారు. విత్తనాలు, ఎరువులను ఇప్పటికే కొందరు రైతులు కొనుగోలు చేయగా, మరి కొందరు రైతులు కొనుగోలు చేయడానికి ఏర్పా ట్లు చేసుకుంటున్నారు.

  పట్టించుకోని అదికారులు..! తిప్పించుకుంటున్న బ్యాంక్ సిబ్బంది..!!

  పట్టించుకోని అదికారులు..! తిప్పించుకుంటున్న బ్యాంక్ సిబ్బంది..!!

  అయితే, రైతులకు గడచిన మే నెలలోనే పెట్టుబడి సహాయం అందించి ఉంటే ఇప్పటికే రైతులు పంటల సాగు కోసం అన్ని ఏర్పాట్లు చేసుకునే వారు. అయితే, రైతుబంధు అందించడానికి ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో రైతులకు ఎదురు చూపులు తప్పడం లేదు. ఇప్పటికైనా సర్కారు స్పందించి త్వరగా ఆర్థిక సాయం అందించాలని అన్నదాతులు కోరుతున్నారు. తొందరలోనే రైతులందరికీ రైతుబంధు నిధులు ఖాతాల్లోకి చేరుతాయి. ప్రభుత్వం దశల వారీగా నిధులు మంజూరు చేస్తోంది. త్వరలోనే నిధులు పూర్తి స్థాయిలో విడుదల అయి రైతులకు పెట్టుబడి సహాయం అందుతుంది.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  There are many problems surrounding Telangana farmers. Investment assistance is being given to farmers who do not start their own business without being gracious. The farmers' scheme announced by the government is moving all the farmers in a timely manner. Some farmers have been denied assistance by the government under the original farmer's bond, and the officials have refused to provide financial support to the farmers.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more