హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

అయ్యప్ప భక్తులకు గుడ్‌న్యూస్: తెలుగు రాష్ట్రాల నుంచి ప్రత్యేక రైళ్లు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్/అమరావతి: ప్రముఖ పుణ్యక్షేత్రం శబరిమల అయ్యప్ప దర్శనం కోసం వెళ్లే తెలుగు రాష్ట్రాల భక్తులకు ఇది శుభవార్తే. అయ్యప్ప మాల వేసిన భక్తులతోపాటు సాధారణ భక్తులు కూడా శబరిమల వెళుతుండటంతో భారీ రద్దీ ఏర్పడింది.

ఈ నేపథ్యంలోనే భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని భారతీయ రైల్వే శాఖ శబరిమలకు ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. అయ్యప్ప భక్తుల సౌకర్యం కోసం దక్షిణ మధ్య రైల్వే శాఖ మరికొన్ని రైళ్లను అందుబాటులోకి తెచ్చింది. డిసెంబర్, జనవరి నెలల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి 38 శబరిమల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

 Sabarimala special trains from Andhra Pradesh and Telangana states

హైదరాబాద్ - కొల్లాం (7 సర్వీసులు): 07133 నంబర్‌ గల రైలు డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 ,16 (సోమవారాలు) తేదీలలో హైదరాబాద్ నుంచి బయలుదేరి మరుసటి రోజు కొల్లాం చేరుకుంటుంది.
కొల్లాం - హైదరాబాద్ (7 సర్వీసులు): 07134 నంబర్ గల ట్రైన్‌ డిసెంబర్ 6, 13, 20, 27, జనవరి 3, 10, 17 (మంగళవారం) తేదీలలో కొల్లాం నుంచి బయలుదేరి మరుసటి రోజు హైదరాబాద్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, కోయంబత్తూరు, తిరుప్పూర్, ఈరోడ్‌, పాల్‌ఘాట్, త్రిసూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చెంగనచేరి, తిరువళ్ల, చెంగన్నూరు, మావేలికెర, కాయంకుళం, సస్తాన్‌కోట స్టేషన్లలో ఆగుతాయి.

సికింద్రాబాద్ - కొట్టాయం (6 సర్వీసులు): 07125 నంబర్‌ గల రైలు డిసెంబర్ 4, 11, 18, 25, జనవరి 1, 8 (ఆదివారాలు) సికింద్రాబాద్ నుండి బయలుదేరి మరుసటి రోజు కొట్టాయం చేరుకుంటుంది.
కొట్టాయం - సికింద్రాబాద్ (6 సర్వీసులు): 07126 నంబర్‌ గల రైలు కొట్టాయం నుంచి డిసెంబర్ 5, 12, 19, 26, జనవరి 2, 9 (సోమవారాలు)లలో బయలుదేరి మరుసటి రోజు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడే, పిడుగురాళ్ల, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, కాట్పాడి, జోలార్‌పేట, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్, కోయంబత్తూరు, తిరుప్పూర్, కోయంబత్తూరు, అలువా ఎర్నాకులం టౌన్‌ స్టేషనల్లో ఆగుతాయి.

నర్సాపూర్ - కొట్టాయం (6 సర్వీసులు): 07119 గల రైలు సర్వీసు డిసెంబర్ 2, 9, 16, 30, జనవరి 6, 13 (శుక్రవారాలు) నర్సాపూర్ నుండి బయలుదేరి మరుసటి రోజు కొట్టాయం చేరుకుంటుంది.
కొట్టాయం - నరసాపూర్ (6 సర్వీసులు): 07120 నంబర్‌ రైలు కొట్టాయం నుంచి డిసెంబరు 3, 10, 17 31, జనవరి 7, 14 (శనివారం) తేదీలలో బయలుదేరి మరుసటి రోజు నర్సాపూర్ చేరుకుంటుంది.
ఈ ప్రత్యేక రైళ్లు పాలకొల్లు, భీమవరం, భీమవరం టౌన్, ఆకివీడు, కైకలూరు, గుడివాడ, విజయవాడ, తెనాలి, బాపట్ల, చీరాల, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పేట, కోయంబత్తూరు, కోయంబత్తూరు, కోయంబత్తూరు, తిరుప్‌పూర్‌, తిరుప్‌పూర్‌, తిరుప్‌పూర్‌, పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్ స్టేషన్లలో ఆగుతాయి. శబరిమల వెళ్లే భక్తులు రైలు సౌకర్యాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరారు.

English summary
Sabarimala special trains from Andhra Pradesh and Telangana states.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X