వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అన్యాయం జరిగితే ఊరుకోం: సబిత, సిఎంకు కార్మికుల కృతజ్ఞతలు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు డిజైన్ మార్చాలన్న ప్రభుత్వ ఆలోచనను వెంటనే విరమించుకోవాలని కాంగ్రెస్ నేత, మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. లేని పక్షంలో తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆమె హెచ్చరించారు.

మెదక్ జిల్లా వరకు వచ్చే ప్రాజెక్టు రంగారెడ్డి జిల్లాకు ఎందుకు రాదో ప్రభుత్వం చెప్పాలని సబిత ప్రశ్నించారు. ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని టిఆర్ఎస్ కూడా చేసిందని అన్నారు. చేవెళ్ల సభలో సిఎం కెసిఆర్ ఏం మాట్లాడారో ప్రజలకు తెలుసని ఆమె అన్నారు.

రంగారెడ్డికి పాలమూరు ప్రాజెక్టు వస్తుందని, ప్రాణహితను ఆపుతున్నారని విమర్శించారు. ఒక జిల్లాకు రెండు ప్రాజెక్టులు రావద్దా? అని సబిత ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ప్రాజెక్టుల విషయంలో రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునేది లేదని సబితాఇంద్రారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

Sabitha Indra Reddy

సిఎం కెసిఆర్‌కు పారిశుద్ధ్య కార్మికుల కృతజ్ఞతలు

తమకు ప్రభుత్వం 47 శాతం వేతనాలు పెంచినందుకుగాను జీహెచ్‌ఎంసీ కార్మికులకు హర్షం వ్యక్తం చేశారు. ఈమేరకు శుక్రవారం కార్మిక నేతల ఆధ్వర్యంలో సీఎం క్యాంపు కార్యాలయానికి వెళ్లి కేసీఆర్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

సీఎం కేసీఆర్‌కు తమ జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. మరింత ఉత్సాహంగా మరిన్ని ఎక్కువ గంటలు పని చేసేందుకు సిద్దంగా ఉంటామన్నారు. తమకు దశలవారీగా ఇళ్లు కట్టించి ఇస్తామని సీఎం హామీ ఇచ్చినట్టు వెల్లడించారు.

English summary
Congress leader and former minister Sabitha Indra Reddy questioned Telangana CM K Chandrasekhar Rao about Pranahita chevella Project on Friday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X