వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వేములవాడలో నేడే సద్దుల బతుకమ్మ : రెండు రోజుల ముందే ఎందుకంటే

|
Google Oneindia TeluguNews

బతుకమ్మ.. తెలంగాణ ఆడపడుచులు అంతా ఇష్టంతో జరుపుకునే పూల పండుగ. ప్రకృతిని ఆరాధించే కమనీయమైన పండుగ. సంస్కృతి సాంప్రదాయాలకు పట్టం కట్టే తెలంగాణకే సొంతమైన పండుగ. అలాంటి బతుకమ్మ సంబరాలను తొమ్మిది రోజుల పాటు ఘనంగా నిర్వహిస్తారు. చివరి రోజున సద్దుల బతుకమ్మ గా పేర్కొంటారు. ఆరోజు అత్యంత ఘనంగా వేడుకలు నిర్వహించి బతుకమ్మలను నిమజ్జనం చేసి గౌరమ్మను సాగనంపుతారు. రాష్ట్రవ్యాప్తంగా సద్దుల బతుకమ్మ అక్టోబర్ 6వ తేదీన నిర్వహించనున్నారు. అయితే అందుకు భిన్నంగా రెండు రోజులకు ముందే నేడు వేములవాడ పట్టణంలో సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించడానికి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

వేములవాడ లోని మూలవాగు వద్ద సద్దుల బతుకమ్మ వేడుకలు ఘనంగా నేడు నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలకు భిన్నంగా వేములవాడలో ఏడు రోజులకే సద్దుల బతుకమ్మ వేడుకలు జరుపుకోవడం అనాదిగా వస్తున్న ఆనవాయితీ. రాజరాజేశ్వర స్వామి కొలువైన వేములవాడలో ఎప్పటికీ ఏడు రోజులకే సద్దుల బతుకమ్మను నిర్వహిస్తారు. పుట్టినింటికి మెట్టినింటికి అనుసంధానంగా రాజరాజేశ్వరి దేవి కొలువైన వేములవాడ పుణ్యక్షేత్రం లో మాత్రమే రెండు రోజుల ముందుగా సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహిస్తారు.

Saddula Batukamma celebrations today at vemulawada ..why because

వేములవాడలో నేడు సద్దుల బతుకమ్మ వేడుకలు నిర్వహించుకునే వారు తర్వాత తల్లి గారి ఇంటికి వెళ్లి అక్కడ సైతం సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించుకుంటారు. అమ్మవారు కొలువైన పుణ్యక్షేత్రం కాబట్టి రెండు రోజుల ముందే సద్దుల బతుకమ్మ వేడుకలను నిర్వహించి ఆ తల్లిని పూజిస్తారు. కేవలం ఇది వేములవాడ పట్టణంలో మాత్రమే కనిపిస్తుంది. చుట్టుపక్కల గ్రామాలను యధావిధిగా తొమ్మిది రోజులకు బతుకమ్మ ఆడతారు. ఇక నేడు జరగనున్న సద్దుల బతుకమ్మ వేడుకలకు మూలవాగు వద్ద అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. బతుకమ్మ తెప్ప వద్ద వేములవాడ పురపాలకసంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.ఫ్లడ్ లైట్లు ఏర్పాటు చేశారు. బతుకమ్మ ఆడుకునేందుకు వచ్చే మహిళలకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా అన్ని చర్యలు చేపడుతున్నారు.

English summary
Sadulla Batukamma ceremonies will be held today at the mula vagu of Vemulawada. Unlike the rest of the state, Vemulawada is a seven-day celebration of Sadduku Batukamma. In the Vemulavada, where the Rajarajeswara Swamy and amma is held, the Saddula Batukamma is performed for seven days. The two-day pre-Saddu Batukamma celebrations are held only in the Vemulavada Shrine of Rajarajeswari Devi.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X