వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

గాల్లోనే పేలిన విమానం, సురక్షితంగా బయటపడ్డా, కెసిఆర్‌కు ప్రజలే బుద్ది చెబుతారు: ఉత్తమ్‌

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వాయు సేనలో పనిచేసే సమయంలో గాల్లోనే విమానం పేలిపోయి ప్రాణాలతో సురక్షితంగా బయటపడినట్టు తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి చెప్పారు. అయితే ఈ తరహ ఘటనల్లో పది లక్షల మందిలో ఒకరు కూడ బతికి బయటపడడం కష్టమని ఉత్తమ్‌కుమార్ రెడ్డి. ప్రస్తుతం తనది బోనస్ జీవితమని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. తెలంగాణ ప్రభుత్వంపై నిశ్శబ్ద విప్లవం వస్తోందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

తెలంగాణలో సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టిక్కెట్లు: ఇలా అయితే కట్తెలంగాణలో సర్వే ఆధారంగానే కాంగ్రెస్ టిక్కెట్లు: ఇలా అయితే కట్

తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డితో ఓ తెలుగు న్యూస్ చానెల్ ఇంటర్వ్యూ చేసింది.ఈ ఇంటర్వ్యూలో ఉత్తమ్ కుమార్ రెడ్డి పలు అంశాలను ప్రస్తావించారు. తన రాజకీయ జీవితంతో పాటు ఆర్మీలో పనిచేసిన అనుభవాలను ఆయన గుర్తు చేసుకొన్నారు.

అది భజనసేన, టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, కెసిఆర్‌కు భయమదే: కాంగ్రెస్అది భజనసేన, టిఆర్ఎస్‌లో విలీనం చేయాలి, కెసిఆర్‌కు భయమదే: కాంగ్రెస్

రాజకీయ పునరేకీకరణ పేరుతో ఇతర పార్టీల నుండి గెలిచిన వారిని టిఆర్ఎస్ తమ పార్టీలోకి ఆహ్వనించడాన్ని ఉత్తమ్ తప్పుబట్టారు.తెలంగాణలో రాజకీయ వ్యవస్థ భ్రష్టుపట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. తెలంగాణలో కెసిఆర్ రాజకీయాలను దిగజార్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు.

Recommended Video

Uttam Kumar Reddy Warns To KCR and KTR
పేలిన విమానం నుండి సురక్షితంగా బయటపడ్డాను

పేలిన విమానం నుండి సురక్షితంగా బయటపడ్డాను

రాజకీయాల్లోకి రాక ముందు ఇండియన్ వాయుసేనలో పైలెట్ ఆఫీసర్‌గా, క్లాస్ వన్ గెజిటెడ్ ఆఫీసర్‌గా చేరినట్టు పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. 16 ఏళ్ళ వయస్సులో పూణెలోని డిఫెన్స్ అకాడమీలో సైనిక శిక్షణ పొందినట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. అయితే బోర్డర్ సమీపంలో విమానంలో ఫ్లైయింగ్ చేస్తున్న సమయంలో విమానం గాల్లోనే పేలిపోయింది. అది సింగిల్ పైలెట్ విమానం. ఈ విమానంలో తాను ఉన్న సమయంలోనే విమానం పేలిపోయిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు .యుద్ధవిమానంలో ఎజెక్షన్‌ అనే బటన్‌ ఉంటుంది. దాన్ని నొక్కితే విమానం నుంచి సీట్‌తో సహా పైలట్‌ను బయటకు షూట్‌ చేస్తుంది. దాంతో పారాచూట్‌ సాయంతో సమీపంలోని అడవుల్లో పడ్డట్టు ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆ ప్రమాదం నుండి పది లక్షల మందిలో ఒకరు కూడ బతకడం చాలా అరుదని రష్యన్ నిపుణులు చెప్పారని ఉత్తమ్ గుర్తు చేసుకొన్నారు.

రాష్ట్రపతి వద్ద చేరా

రాష్ట్రపతి వద్ద చేరా

ఈ ప్రమాదం నుండి కోలుకోవడానికి ఆరు మాసాలు పట్టిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. ఆ ప్రమాదంలో నా వెన్నెముక విరిగింది. మోకాలు ఫ్రాక్చర్‌ అయిందని ఉత్తమ్ చెప్పారు. మళ్ళీ ఇదే తరహ ప్రమాదంలో చిక్కుకొంటే వెన్నెముక పూర్తిగా దెబ్బతినే అవకాశం ఉందని వైద్యులు సూచించారని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీంతో పైలెట్ బాధ్యతల నుండి తప్పుకోవాల్సి వచ్చిందని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. దీంతో ఆ సమయంలో ఎయిర్ చీఫ్ మార్షల్ అప్పటి భారత రాష్ట్రపతి వెంకట్రామన్‌ను సంప్రదించి పీస్ పోస్టింగ్ ఉద్యోగాన్ని ఇప్పించారని ఉత్తమ్ చెప్పారు. తర్వాత తన మిలటరీ హోదాను మార్చి ఐఎఎస్ హాోదాకు మార్చి రాష్ట్రపతి వద్ద శాశ్వత ఉద్యోగిగా మార్చారని ఉత్తమ్ కుమార్ రెడ్డి గుర్తు చేసుకొన్నారు.

 తెలంగాణలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టింది.

తెలంగాణలో రాజకీయ వ్యవస్థ భ్రష్టు పట్టింది.

తెలంగాణలో రాజకీయ వ్యవస్థను భ్రష్టు పట్టించింది కేసీఆరే. కొత్త రాష్ట్రంలో రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని మేం ఊహించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.కొత్త రాష్ట్రంలో రాజకీయాలు ఇంతగా దిగజారుతాయని ఊహించలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.. ఏ ఎంపీకి, ఏ ఎమ్మెల్యేకి ఏం ప్యాకేజి ఇచ్చారో బయట ఎవరినడిగినా చెబుతారన్నారు.

 కెసిఆర్ వాస్తవాలను కప్పి పుచ్చుతున్నారు

కెసిఆర్ వాస్తవాలను కప్పి పుచ్చుతున్నారు

కెసిఆర్ వాస్తవాలను కప్పి పుచ్చుతున్నారని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. తెలంగాణలో క్షేత్ర స్థాయిలో జరిగే పరిణామాలను బయటకు రాకుండా కెసిఆర్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

 అహంకారాన్ని తెలంగాణ ప్రజలు సహించరు

అహంకారాన్ని తెలంగాణ ప్రజలు సహించరు

తెలంగాణ ప్రజలు అహంకారాన్ని సహించరని తెలంగాణ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి అభిప్రాయపడ్డారు. ప్రజలు సహించని విషయం ఏమిటంటే అహంకారం. తెలంగాణను పాలిస్తున్న వాళ్లు కళ్లు నెత్తికెక్కి, చిన్నా, పెద్దా, మంచీ చెడూ, డిగ్నిటీ ఏమీ లేకుండా మాట్లాడుతున్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలో దళితులను తీసుకుపోయి పోలీస్‌లు టార్చర్‌ చేస్తే కనీసం చర్యలు తీసుకోలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు.

English summary
Telangana PCC Chief Uttam Kumar Reddy said that I safely escaped from flight accident while he was in the air force.A Telugu channel interviewed him on Tuesday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X