• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సాగర్ ఉపఎన్నికలో అనూహ్య ట్విస్ట్ -12 ఏళ్ల తర్వాత కారుకు కమ్యూనిస్టుల మద్దతు! -కేసీఆర్ సభ రద్దుకు పిల్

|

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. జిల్లాలో ఒకప్పుడు బలంగా ఉండి, ఇప్పుడు అభ్యర్థులను సైతం నిలపలేని దుస్థితికి చేరిన కమ్యూనిస్టు పార్టీలు.. ఉన్న కొద్దిపాటి బలంతో అధికార టీఆర్ఎస్ పార్టీకి భుజం కాయాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. ప్రతిపక్ష కాంగ్రెస్ ముందుగానే మద్దతు కోరినా, వాళ్లను కాదని, ఎర్రన్నలిద్దరూ కారు ఎక్కబోతున్నట్లు వినికిడి. మరోవైపు ఈనెల 14న సీఎం కేసీఆర్ తలపెట్టిన భారీ బహిరంగ సభపై నీలి నీడలు కమ్ముకున్నాయి..

అయినా సరే హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ -అసంపూర్ణంగా సుప్రీంకోర్టు కొలీజియం భేటీ -సీజేఐ బోబ్డే రికార్డుఅయినా సరే హాజరైన జస్టిస్ ఎన్వీ రమణ -అసంపూర్ణంగా సుప్రీంకోర్టు కొలీజియం భేటీ -సీజేఐ బోబ్డే రికార్డు

12ఏళ్ల తర్వాత రీ యూనియన్

12ఏళ్ల తర్వాత రీ యూనియన్

ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్సార్ ప్రభంజనాన్ని తట్టుకునేందుకు 2009లో టీఆర్ఎస్, టీడీపీ, కమ్యూనిస్టు పార్టీలు ఏకతాటిపైకొచ్చి మహాకూటమిగా ఏర్పడినా ప్రతికూల ఫలితాలు వచ్చాయి. తర్వాతి కాలంలో సీపీఎం సమైక్యాంధ్ర నినాదానికి కట్టుబడటంతో తెలంగాణలో ఘోరంగా దెబ్బతినింది. తెలంగాణ వాదం వినిపించినా, సరైన కార్యాచరణ లేక సీపీఐ సైతం చల్లబడింది. గడిచిన ఏడేళ్లలో దాదాపు అన్ని ఎన్నికల్లో విఫలమైన కమ్యూనిస్టు పార్టీలు.. ఒకప్పటి తమ కంచుకోట నాగార్జున సాగర్ లో కనీసం అభ్యర్థిని కూడా దించకపోవడం తెలిసిందే. మళ్లీ 12 ఏళ్ల తర్వాత లెఫ్ట్ పార్టీలు టీఆర్ఎస్ తో రీయూనియన్ అయ్యేందుకు సాగర్ వేదికైనట్లు సమాచారం..

కాంగ్రెస్ కోరినా కారుకే జై కొట్టారు..

కాంగ్రెస్ కోరినా కారుకే జై కొట్టారు..

సాగర్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలంటూ టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క తదితర నేతలు.. కమ్యూనిస్టు పార్టీలకు లేఖలు రాసి రిక్వెస్టులు చేశారు. కాంగ్రెస్ అభ్యర్థనపై ఎలాంటి నిర్ణయం తీసుకోని ఎర్రన్నలు.. చివరికి కారు గుర్తు పార్టీకి మద్దతు ఇవ్వాలని డిసైడైనట్లు తెలుస్తోంది. సాగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌కు సీపీఎం, సీపీఐ మద్దతు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది. అయితే టీఆర్‌ఎస్‌కు మద్దతుపై అధికారికంగా వామపక్షాలు ఇప్పటివరకు ప్రకటించకపోవడం గమనార్హం. కాగా,

తిరుమలలో జస్టిస్ రమణ -జగన్ బాబాయి దగ్గరుండి -రెండు సార్లు దర్శనం, 24న సీజేఐ హోదాలో మళ్లీ!తిరుమలలో జస్టిస్ రమణ -జగన్ బాబాయి దగ్గరుండి -రెండు సార్లు దర్శనం, 24న సీజేఐ హోదాలో మళ్లీ!

నోములకు బీసీ సంఘాల మద్దతు

నోములకు బీసీ సంఘాల మద్దతు

నాగార్జున సాగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో బీసీల ఓట్లు గణనీయంగా ఉన్న నేపథ్యంలో యాదవ సామాజిక వర్గానికి చెందిన టీఆర్‌ఎస్ అభ్యర్థి నోముల భగత్‌కు బీసీ సంక్షేమ సంఘం మద్దతు పలకడం కీలకంగా మారింది. బీసీ సంక్షేమ సంఘం జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే ఆర్. కృష్ణయ్య.. భగత్ కు మద్దతు ప్రకటించారు. బీసీలకు సాగర్‌ టికెట్ కేటాయించడాన్ని ఆయన స్వాగతించారు. బీసీలంతా భగత్‌కు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. భగత్‌ను గెలిపించి కొత్త చరిత్రకు బీసీలు నాంది పలకాలని కృష్ణయ్య పిలుపునిచ్చారు. మరోవైపు..

14న హోలియాలో టీఆర్ఎస్ భారీ సభ

14న హోలియాలో టీఆర్ఎస్ భారీ సభ

ఇప్పటికే సాగర్‌లో టీఆర్‌ఎస్ ప్రచార హోరును పెంచింది. దీనికి తోడు ఈ నెల 14న హాలియాలో సీఎం కేసీఆర్ సభ ఏర్పాటు ఖాయమైంది. కేసీఆర్‌ పాల్గొనే బహిరంగ సభను లక్ష మందితో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తోంది. సాగర్‌ ఉప ఎన్నిక పోలింగ్‌ ఈ నెల 17న ఉండగా, ప్రచార గడువు ముగియటానికి దాదాపు 24 గంటల ముందు జరిగే సభలో సీఎం కేసీఆర్‌ పాల్గొనబోతున్నారు. అప్పటికి నియోజకవర్గంలో టీఆర్‌ఎస్‌ ప్రచారాన్ని తారస్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో పార్టీ నేతలు క్షేత్రంలో శ్రమిస్తున్నారు. ఓవైపు ప్రచారంలో భాగస్వాములవుతూనే, మరోవైపు కేసీఆర్‌ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. అయితే..

  Nagarjuna Sagar Bypoll: BJP's Candidate Dr P Ravi Kumar - Ravindra Nayak press meet
  సీఎం కేసీఆర్ సభ రద్దు చేయాలంటూ..

  సీఎం కేసీఆర్ సభ రద్దు చేయాలంటూ..

  సాగర్‌లో ఈనెల 14న సీఎం కేసీఆర్ తలపెట్టిన భారీ సభను రద్దు చేయాలంటూ యుగ తులసి చైర్మన్ కె. శివ కుమార్ ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై హైకోర్టులోనూ సోమవారం లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేయనున్నారు. తెలంగాణలో రోజురోజుకీ కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో ప్రజారోగ్యం దృష్ట్యా బహిరంగ సభ రద్దు చేయాలని, వైరస్ తీవ్రత దృష్ట్యా ఏప్రిల్ 30వ తేదీ వరకూ ఎటువంటి సభలు, సమావేశాలు, ర్యాలీలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఇచ్చిన జీవోను ముఖ్యమంత్రే ఉల్లంఘించినట్లవుతుందని శివ కుమార్ వాదిస్తున్నారు.

  English summary
  In an interesting turn amid Nagarjuna sagar assembly by election, it is learned that both communist parties cpi and cpm likely to support kcr led TRS. however, Left parties or trs has not yet officially announced. BC welfare society leader R. Krishnaiah also expressed support to TRS candidate Nomula Bhagat. sagar bypoll will be on april 17.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X