హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం (ఫోటోలు)

By Nageshwara Rao
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: హైదరాబాద్‌లోని నెహ్రూ జులాజికల్ పార్కులోని 28 సంవత్సరాల వయసున్న సుజీ అనే చింపాంజీ విలాసవంతమైన జీవితాన్ని గడుపుతోంది. ఈ చింపాంజీ తినే తిండితో సహా వాడే వస్తువులు అన్ని కూడా బ్రాండెడ్ కంపెనీకి చెందినవే కావడం విశేషం.

అంతేకాదు లగ్జరీ ట్రీట్‌మెంట్ విషయంలో ఏ మాత్రం తేడా వచ్చిన అస్సలు అంగీకరించడం లేదంట. హైదరాబాద్ జూలోని మిగతా జంతువులతో పోలిస్తే ఈ చింపాంజీ స్టార్‌డమ్‌ను అనుభవిస్తోంది.
సహారా సంస్ధ చైర్మన్ సుబ్రతా రాయ్‌కు చెందిన ఈ చింపాంజీ ఇప్పుడు హైదరాబాద్ జూలో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా నిలిచింది.

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

సుజీ సాధారణమైన చింపాజీ కాదు. అందుకే దానికి విలాసవంతమైన జీవితాన్ని అందిస్తున్నామని జూ అధికారులు చెబుతున్నారు. ఉదయాన్నే పెప్సోడెంట్ టూత్‌పేస్ట్‌ను ఉపయోగించి పళ్లను తోముతూ దినచర్య ప్రారంభిస్తుంది. పీయర్స్ సబ్బుతో స్నానం చేస్తుంది.

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

ఆ తర్వాత కొబ్బరినూనెతో తలంటుకుంటుంది. నెస్కెఫే కాఫీ మాత్రమే తాగుతుంది. అప్పుడప్పుడు కాంప్లాన్ హెల్త్‌డ్రింక్ తీసుకుంటుంది. బ్రేక్‌ఫాస్ట్‌లో కూడా సాదాసీదా ఆహార పదార్థాలను ముట్టదు. బ్రెడ్ విత్ ఫ్రూట్‌జామ్, పచ్చిపండ్లు మాత్రమే తీసుకుంటుంది.

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

ఇక భోజనం విషయానికి వస్తే జూ పార్కులోని మిగతా జంతువులతో పోలిస్తే అత్యంత ఖరీదైన భోజనం తీసుకుంటుంది. తేనె, మొక్కజొన్న, డ్రైఫ్రూట్స్, నట్స్‌తో క్యాడ్‌బరీ చాక్లెట్లు తింటుంది. అంతేకాదు కేవలం మినరల్ వాటర్ మాత్రమే తాగుతుంది.

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

ఇక చింపాంజీ కప్పుకోవడానికి వాడేసిన పాత బ్లాంకెట్ ఇస్తే వెంటనే గుర్తుపడుతుంది. ప్రతీరోజు ఉతికిన కొత్త బ్లాంకెట్ ఇవ్వాల్సిందే. దీంతో పాటు వేసవిలో కూలర్ ఏర్పాటు చేయాలి. దోమల నివారణకు కూడా ప్రత్యేక చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

ఈ చింపాంజీ లాగా పుట్టాలి: నెస్కెఫే కాఫీ, ఖరీదైన భోజనం

ఈ చింపాంజీకి కల్పిస్తోన్న సదుపాయాలను చూస్తుంటే ఇటీవల జైలు నుంచి విడుదలైన చింపాంజీ మాజీ యజమాని సుబ్రతారాయ్ కూడా ఇటువంటి సౌకర్యాలను పొందలేదని ఖచ్చితంగా చెప్పొచ్చు.

English summary
A 28-year-old chimpanzee named Suzi, who once belonged to Sahara chairman Subrata Roy, has become the centre of attraction at the Hyderabad zoo.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X