హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ప్రముఖ జర్నలిస్టు, సాహిత్య అకాడెమీ గ్రహీత దేవీ ప్రియ కన్నుమూత

|
Google Oneindia TeluguNews

హైదరాబాదు: ప్రముఖ జర్నలిస్టు తెలుగు కవి, సాహిత్య అకాడెమీ గ్రహీత దేవీ ప్రియ కన్నుమూశారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో నిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్నారు. దేవీ ప్రియ ఆరోగ్య పరిస్థి విషమించడంతో శనివారం ఆయన మృతి చెందారు. ఆయన వయస్సు 71 ఏళ్లు.దేవీ ప్రియకు కొడుకు, కూతురు ఉన్నారు. పొలిటికల్ సైటైరికల్ కార్టూన్లు మరియు కవితల ద్వారా మంచి గుర్తింపు పొందారు దేవీ ప్రియ.

2017లో దేవీ ప్రియ కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డును అందుకున్నారు. గాలి రంగు అనే పుసక్తం రాసినందుకు గాను ఆయన్ను ఈ అవార్డు వరించింది. ఉదయం తెలుగు దినపత్రికలో సమకాలిన రాజకీయాలపై తాను ఇచ్చే విశ్లేషణ చాలామందిని ఆలోచింపజేసింది. ఆ తర్వాత పలు ఛానెల్స్‌లో కూడా రాజకీయ పరమైన విశ్లేషణలు చేశారు దేవీ ప్రియ. ఇక తెలుగు సినిమాలకు కూడా పలు పాటలను రాశారు. మా భూమి చిత్రం కోసం ఆయన రాసిన జంభల్ భారీ భాయ్ అనే పాటు బాగా పాపులర్ అయ్యింది. గరీబు గీతాలు, అమ్మ చెట్టు ,చేప చిలుక, తుఫాను తుమ్మెద, సామాజనంద స్వామి లాంటి పుస్తుకాలను రచించారు. తన ఇంటికి తాను రచించిన తొలిపుస్తకం పేరు అమ్మ చెట్టును పెట్టుకున్నారు.

Sahitya Akademi awardee Devi Priya passes away at the age of 71 due to illness

Recommended Video

Kaloji Narasimha Rao Biography | Kaloji Narasimha Rao Inspiring Story || Oneindia Telugu

ఇక జర్నలిస్టుగా కూడా తాను ఎంతో ప్రాచుర్యం పొందారు. ప్రముఖ కవి శ్రీశ్రీ ఆత్మకథను తీసుకురావడంలో దేవీ ప్రియ కృషి చేశారు. దేవీ ప్రియ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లా తాడికొండలో పుట్టారు. ఆయన అసలు పేరు షేక్ ఖాజా హుస్సేన్. అయితే రచయితగా దేవీ ప్రియ పేరుతో ఆయన మరింత పాపులర్ అయ్యారు. ఇక దేవీ ప్రియ మృతికి సంతాపం తెలిపారు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేసీఆర్, జగన్.

English summary
Journalist , Poet Sahitya akademi awardee Devi Priya dies due to illness on saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X