వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సాయిబాబ గుడిలో పేలుడు: నిందితుడు16 ఏళ్లుగా అత్తరు అమ్ముతూ

By Pratap
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: దిల్‌షుక్ నగర్‌లో గల సాయిబాబా ఆలయంలో పేలుళ్ల కేసు నిందితుడు మొహమ్మద్ షఫీక్ ముజావార్‌ను ఖతర్ తెలంగాణ పోలీసులకు అప్పగించింది. సాయిబాబా ఆలయంలో 2002లో పేలుడు సంభవించిన విషయం తెలిసిందే.

లష్కరే తోయిబా కార్యకర్తగా భావిస్తున్న నిందితుడు షఫీక్ గత 16 ఏళ్లుగా దుబాయ్‌లో అత్తరు అమ్ముతున్నట్లు తెలంగాణ పోలీసులు గుర్తించారు. నిందితుడు ముజావార్ పేలుళ్ల కోసం దుబాయ్‌లో సహ నిందితులతో కలిసి సమావేశాలు నిర్వహించి కుట్ర చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి.

Sai baba temple blast, Accused sold perfume

సాయిబా ఆలయంలో జరిగిన బాంబు పేలుడులో ఇద్దరు మరణించారు. ముజావార్ నిషేధిత సిమీ కార్యకర్త అని తెలుస్తోంది. ఒకటో నిందితుడు మొహమ్మద్ బారీ ఇంకా పరారీలో ఉన్నాడు. అతను కూడా దుబాయ్‌లోనే ఆశ్రయం పొంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు.

కేసులో పోలీసులు 11 మందిని నిందితులుగా గుర్తించారు. వీరిలో కొంత మంది మధ్యలో మరణించారు. ఇతరులపై విచారణ సాగుతోంది. దుబాయ్ నుంచి దోహాకు వెళ్తుండగా షఫీక్‌ను పట్టుకున్నారు. మంగళవారంనాడు అతన్ని పోలీసులు కోర్టులో హాజరు పరిచారు.

English summary
According to reports - Qatar deported 'wanted' Mohammed Shafeeq Mujawar, an accused in the 2002 Dilsukhnagar Sai Baba temple blast.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X