హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

15రోజులు.. సాయి చైతన్య మిస్సింగ్ ఇంకా మిస్టరీగానే: ఏమయ్యాడో!..

ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో.. ఇంటినుంచి వెళ్లిపోయిన సాయిచైతన్య అనే యువకుడి అదృశ్యం మిస్టరీగా మారింది.

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: ప్రేమించిన యువతి పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో.. ఇంటినుంచి వెళ్లిపోయిన సాయిచైతన్య అనే యువకుడి అదృశ్యం మిస్టరీగా మారింది.

<strong>నాలుగేళ్లుగా నేనే భర్త అంది!: ప్రియురాలి మోసంతో సెల్ఫీ వీడియో పెట్టి..</strong>నాలుగేళ్లుగా నేనే భర్త అంది!: ప్రియురాలి మోసంతో సెల్ఫీ వీడియో పెట్టి..

Recommended Video

Heavy Rains Damage Roads In Hyderabad వాన దంచికొట్టడంతో హైదరాబాద్ అతలాకుతలం| Oneindia Telugu

ఇంటి నుంచి వెళ్లేముందు సెల్ఫీ వీడియో తీసి పంపించడం.. గతంలోను ఓసారి ఆత్మహత్యకు యత్నించి ఉండటంతో.. ఏదైనా అఘాయిత్యానికి ఒడిగట్టాడా? అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి. సాయిచైతన్య మిస్టరీతో అతని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

 ఆత్మహత్యాయత్నం:

ఆత్మహత్యాయత్నం:

బంధువుల కుమార్తె సంధ్య, సాయిచైతన్యల మధ్య కొన్నేళ్లు ప్రేమ వ్యవహారం నడిచింది. ఏమైందో తెలియదు కానీ కొన్ని నెలలుగా సంధ్య సాయి చైతన్యను దూరం పెడుతోంది. సాయి చైతన్య టార్చర్ చేస్తున్నాడని పోలీస్ స్టేషన్ లోను ఫిర్యాదు చేసింది. ఇదే క్రమంలో సంధ్య ఇంటికెళ్లి మాట్లాడటానికి ప్రయత్నించిన సాయిచైతన్య.. ఆత్మహత్యకు కూడా యత్నించాడు.

నచ్చజెప్పినా:

నచ్చజెప్పినా:

ఆత్మహత్యాయత్నం తర్వాత సాయిచైతన్యకు తల్లిదండ్రులు నచ్చజెప్పారు. ఆ అమ్మాయిని వదిలేయమని చెప్పారు. కానీ సాయిచైతన్య మాత్రం తన ప్రేమను చంపుకోలేకపోయాడు. సర్వస్వం అనుకున్న అమ్మాయి మోసం చేసిందని చెబుతూ.. ఓ సెల్ఫీ వీడియో పంపించి ఎక్కడికో వెళ్లిపోయాడు. దీంతో కొడుకు ఎక్కడికి వెళ్లాడో.. ఏ అఘాయిత్యానికి పాల్పడ్డాడో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

 పోలీసుల నివేదిక

పోలీసుల నివేదిక

అక్టోబర్‌ 20న మాదాపూర్‌ డివిజన్‌ ఏసీపీ సాయిచైతన్య ఘటనపై రాయదుర్గం పోలీసులు జీడీ ఎంటర్‌ చేసినట్టు తెలుస్తోంది. సాయి చైతన్యను వివాహం చేసుకోవాలని సంధ్యతో చెప్పే అధికారం పోలీసులకు లేదని రాయదుర్గం ఇన్‌స్పెక్టర్‌ ఏసీపీ రమణకుమార్‌ నివేదిక ఇచ్చినట్టు సమాచారం.

 ఇప్పటికీ 15రోజులు

ఇప్పటికీ 15రోజులు

బహుశా పోలీసుల నివేదిక విషయం తెలిసే సాయి చైతన్య మరింత మనస్తాపం చెంది ఉంటాడని తెలుస్తోంది. పోలీసులు కూడా తనకు సహకరించట్లేదని అతను ఆరోపిస్తున్నాడు. పోలీసులు నివేదిక ఇచ్చిన రోజు సాయి చైతన్య ఇంటి నుంచి వెళ్లిపోయాడు.

దీంతో అతని తల్లి మల్కాజిగిరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు సమయంలో సాయి చైతన్య రాసిన సూసైడ్‌ నోట్, తన సెల్పీ వీడియో క్లిపింగ్‌లను జత చేసింది. సాయి చైతన్య మిస్సింగ్ 15రోజులు గడుస్తున్నప్పటికీ ఇప్పటికీ అతని ఆచూకీ తెలియరాలేదు.

 కొనసాగుతున్న దర్యాప్తు

కొనసాగుతున్న దర్యాప్తు

సాయి చైతన్య మిస్సింగ్ పై ఇన్ స్పెక్టర్ జానకిరెడ్డి స్పందించారు. మిస్సింగ్ పై అతని తల్లి ఫిర్యాదు చేసిందని చెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. అంతకుముందు అక్టోబర్ 6న సాయి చైతన్య ప్రేమించిన అమ్మాయి సంధ్య కూడా ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. సాయి చైతన్య తనను, తన కుటుంబాన్ని బెదిరిస్తున్నాడని, తన వ్యక్తిగత ఫోటోలను సోషల్ మీడియాలో ఉంచాడని ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది అన్నారు.

English summary
Sai Chaitanya, A love failure person was left home 15days back, still police did't find his address
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X