• search
  • Live TV
హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  

Sai Dharam Tej:చేతులెత్తి దండం పెడుతున్నా-ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్-నరేష్‌పై బండ్ల గణేష్

|

మెగా హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఘటనపై సీనియర్ నటుడు నరేష్ స్పందించిన తీరు వివాదాస్పదమవుతోంది. తన కొడుకు నవీన్,సాయి ధరమ్ తేజ్‌లు మంచి స్నేహితులని... బైక్ రైడింగ్ విషయంలో ఇద్దరికీ కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నానని నరేష్ వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలు ఈ ఇద్దరికీ బైక్ రేసింగ్ అలవాటు ఉందేమో అన్న సందేహాలు రేకెత్తించాయి. దీంతో మంచికి పోతే చెడు ఎదురైందన్నట్లుగా నరేష్ వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్ నరేష్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఇంతలోనే నరేష్ మరోసారి వివరణ ఇచ్చి వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేశారు.

నరేష్‌ వ్యాఖ్యలపై బండ్ల గణేష్ రియాక్షన్

'చిన్న ప్రమాదం జరిగింది... సాయి ధరమ్ తేజ్ షూటింగ్స్ చేస్తారు... అద్భుతంగా ఉంటారు.. ఈ టైమ్‌లో నరేష్ గారు ఎవరెవరో ప్రమాదవశాత్తు మరణించినవాళ్ల పేర్లు చెప్పడం గానీ.. అట్లా మాట్లాడటం కానీ కరెక్ట్ కాదు... ఇప్పుడెందుకు సార్ రేసింగ్ చేశాడు... అది చేశాడు,ఇది చేశాడని... మీ ఇంటి దగ్గరకొచ్చాడు... ఎందుకివన్నీ... తప్పు కదా సార్... ఇలాంటప్పుడు ఆ పరమేశ్వరుడిని ప్రార్థించి త్వరగా కోలుకోవాలి... సాయి ధరమ్ తేజ్ సంతోషంగా ఉండాలని కోరుకోవాలి.. అంతేగానీ ఇదంతా ఎందుకు మాట్లాడుతున్నారో అర్థం కావట్లేదు.ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడేం మాట్లాడాలో నేర్చుకోండి సార్ అందరూ దయచేసి... మీకు చేతులెత్తి దండం పెడుతున్నా.. భగవంతుని ఆశీసులతో సాయి ధరమ్ తేజ్ చిన్న ప్రమాదం నుంచి బయటపడ్డాడు. బ్రహ్మాండంగా ఉంటుంది.' అని సాయి ధరమ్ తేజ్ వ్యాఖ్యానించాడు.

నరేష్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ అభ్యంతరం...

నరేష్ వ్యాఖ్యలపై శ్రీకాంత్ అభ్యంతరం...


'సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ గురించి అందరికీ తెలిసిందే.చాలా చిన్న యాక్సిడెంట్... కామన్‌గా జరిగిదే... రోడ్డుపై ఇసుక వల్లే స్కిడ్ అయి పడిపోయాడు.త్వరగా కోలుకుంటాడు... కోలుకోవాలని మనస్పూర్తిగా దేవుడిని కోరుతున్నాను. దయచేసి వీడియో బైట్లు పెట్టేముందు ఆలోచించి పెట్టండి.నాకు తెలిసిన యువతలో సాయి ధరమ్ తేజ్ చాలా మెచ్యూర్డ్. నాకు తెలుసు... అతను రాష్ డ్రైవింగ్ చేసే వ్యక్తి కాదు. కుటుంబ సభ్యులంతా టెన్షన్‌లో ఉన్న సమయంలో... ఆ వీడియో బైట్స్ వారిని మరింత ఆందోళన గురిచేస్తాయి. నరేష్ పెట్టిన బైట్‌లో చనిపోయినవాళ్ల గురించి ప్రస్తావించకుండా ఉంటే బాగుండేదని అనిపించింది. ఇటువంటి బైట్స్ ఎవరూ పెట్టవద్దని కోరుకుంటున్నాను.త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.' అని శ్రీకాంత్ పేర్కొన్నారు.

వివరణ ఇచ్చిన నరేష్...

'నేను పొద్దున్నే సాయి ధరమ్ తేజ్ గురించి ప్రార్థించాను.సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకుంటున్నాడు.త్వరలో సాధారణ స్థితిలోకి వస్తాడు.నేను స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇద్దరూ కలిసి వెళ్లిన మాట వాస్తవమే గానీ... ఇద్దరూ ఒక ఛాయ్ షాపు ఓపెనింగ్‌కి వెళ్లారు. అక్కడి నుంచి ఎవరికి వారు వస్తున్నప్పుడు ఇద్దరు సెపరేట్‌గా ఉన్నారు. వీళ్లెవరూ రేసులో లేరు. ఆ సమయంలో సాయి ధరమ్ తేజ్ సాధారణ స్పీడ్ 60,70కి.మీ వేగంతో వెళ్తున్నాడు. రోడ్డుపై ఉన్న మట్టి కారణంగానే ప్రమాదం జరిగింది. అంతే తప్ప ఇది నిర్లక్ష్యం కాదు.యాక్సిడెంట్ మాత్రమే.కాబట్టి బిడ్డలు బాగుండాలని కోరుకుంటాం తప్ప వేరే ఆలోచన లేదు.సేఫ్‌గా బయటపడినందుకు సంతోషంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నాను.' అని నరేశ్ వివరణ ఇచ్చుకున్నారు.

దుమారం రేపిన నరేష్ వ్యాఖ్యలివే...

దుమారం రేపిన నరేష్ వ్యాఖ్యలివే...

'బైక్ ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ నా బిడ్డ లాంటివాడు. త్వరగా కోలుకుని వెంటనే షూటింగ్స్‌కి వెళ్లాలని భగవంతుడిని,మా అమ్మను ప్రార్థిస్తున్నాను. సాయి,మా అబ్బాయి నవీన్ క్లోజ్ ఫ్రెండ్స్.బ్రదర్స్ లాగా ఉంటారు.సాయంత్రం ఇక్కడి నుంచే బయలుదేరారు.నాలుగైదు రోజుల క్రితం వీరికి కౌన్సెలింగ్ ఇద్దామనుకున్నాను.ఎందుకంటున్నానంటే.. ఇది మంచి వయసు... పెళ్లి చేసుకుని కెరీర్‌లో సెటిల్ కావాల్సిన వయసు. ఈ టైమ్‌లో ఇలాంటి రిస్కులు తీసుకోకుండా ఉంటే మంచిది.నేను కూడా ఇంతకుముందు బైక్ ప్రమాదానికి గురైనప్పుడు మా అమ్మ నాతో ఒట్టేయించి బైక్ రైడింగ్ మానిపించింది. అప్పటినుంచి బైక్స్ ముట్టడం లేదు. గతంలో కోట శ్రీనివాసరావు,బాబూ మోహన్,కోమటిరెడ్డి... వాళ్ల అబ్బాయిలు రోడ్డు ప్రమాదానికి గురై కుటుంబాలను శోకసంద్రంలో ముంచెత్తారు. రానున్న రోజుల్లో బైక్స్ ముట్టుకోవద్దని నా ప్రార్థన. సాయి కచ్చితంగా కోలుకుని షూటింగ్స్‌కి వెళ్తాడు. ఆ కుటుంబం బాగుండాలని కోరుకుంటున్నాను.' అని నరేష్ పేర్కొన్నారు.

ఓవర్ స్పీడా.. లేక అదే కారణమా..?

ఓవర్ స్పీడా.. లేక అదే కారణమా..?

ప్రమాదానికి ఓవర్ స్పీడే కారణమని పోలీసులు చెబుతున్నారు.నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద ఐపీసీ 336, 184 ఎంవీ యాక్ట్ కింద రాయదుర్గం పోలీసులు సాయి ధరమ్‌పై కేసు కూడా నమోదు చేశారు.ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. మరోవైపు సినీ ఇండస్ట్రీకి చెందిన సెలబ్రిటీలు మాత్రం ఇది రాష్ డ్రైవింగ్ వల్ల జరిగిన ప్రమాదం కాదని అంటున్నారు. రోడ్డుపై మట్టి ఉండటం వల్లే ప్రమాదం జరిగిందంటున్నారు. హీరో శ్రీకాంత్,నటి మంచు లక్ష్మి,సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్,ఇతర నటీ నటులు, ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు..'సాయిధరమ్ తేజ్ ఆక్సిడెంట్ విషయంలో అతివేగం కేసు నమోదు చేసిన పోలీసులు, అదేసమయంలో అక్కడ రోడ్డుపై ఇసుక పేరుకు పోవటానికి కారణమైన.. అక్కడ ఉన్న కన్‌స్ట్రక్షన్ కంపెనీపై,ఎప్పటికప్పుడు రోడ్డుని క్లీన్ గా ఉంచాల్సిన మున్సిపాలిటీ పై కూడా కేసు పెట్టాలని ఆర్పీ పట్నాయక్ డిమాండ్ చేశారు. ఆర్పీ పట్నాయక్ అభిప్రాయాన్ని కొంతమంది సమర్థిస్తుంటే మరికొందరు వ్యతిరేకిస్తున్నారు. రోజూ ఎంతోమంది సామాన్యులు ఆ మార్గంలో రాకపోకలు సాగిస్తున్నారని... సాయి ధరమ్ తేజ్ బైక్ మాత్రమే ఎందుకు స్కిడ్ అయిందని ప్రశ్నిస్తున్నారు.ఓవర్ స్పీడ్‌ను కవర్ చేసేందుకు పోలీసులను నిందించడం సబబు కాదంటున్నారు.

English summary
The reaction of senior actor Naresh over the accident of mega hero Sai Dharam Tej in become controversial.Producer,actor Bandla Ganesh expressed his anger on Naresh through a twitter video.However,Naresh once again given clarity over his comments on the incident.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X