వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఎమ్మెల్యేల జీతం భారీగా పెంపు: రూ.42.67 కోట్ల భారం, ఎవరికి ఎంత?

By Srinivas
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో భాగంగా సోమవారం నాడు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల జీతాల పెంపు బిల్లును మంత్రి హరీష్ రావు అసెంబ్లీలో ప్రవేశ పెట్టారు. బిల్లు ఆమోదం పొందితే... వేతనాల పెంపు ద్వారా ప్రభుత్వం పైన ఏడాదికి రూ.42.67 కోట్ల భారం పడనుంది.

ఎమ్మెల్యేల జీతాలు.. జీతభత్యాలు సహా రూ.3 లక్షలకు పెరగనున్నాయి. ఎమ్మెల్యేలకు జీతం రూ.20వేలు, అలవెన్సులు రూ.2.30 లక్షలు, రూ.25వేలు భద్రతకు, రూ.30వేలు బుల్లెట్ ప్రూఫ్ కారుకు ఇవ్వనున్నారు.

Salaries of Telangana MLAs hiked to Rs 3 lakh

ఉప ముఖ్యమంత్రి, మంత్రులకు జీతం రూ.30వేలు ఇవ్వనున్నారు. సభాపతి, చైర్మన్‌లకు రూ.41వేలు ఇవ్వనున్నారు. డిప్యూటీ స్పీకర్, చైర్మన్లకు రూ.30వేలు ఇవ్వనున్నారు.

ముఖ్యమంత్రికి రూ.51వేలు జీతం రానుంది. రూ.8వేలు ప్రత్యేక భత్యం, రూ.7వేలు ఆతిథ్య భత్యం రానుంది. ప్రభుత్వ చీఫ్ విప్, విప్‌లకు రూ.30వేలు రానుంది. ఒక టర్మ్ పని చేసిన ఎమ్మెల్యేలకు రూ.30వేలు పింఛన్ ఇవ్వనున్నారు. ఈ బిల్లును మంత్రి హరీష్ రావు సభలో ప్రవేశ పెట్టారు.

English summary
Salaries of Telangana MLAs hiked to Rs 3 lakh.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X