వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఏపీలోనే కాదు తెలంగాణాలోనూ ఇసుక కొరత .. నిర్మాణ రంగానికి తప్పని తిప్పలు

|
Google Oneindia TeluguNews

ఏపీలో మాత్రమే కాదు తెలంగాణా రాష్ట్రంలోనూ ఇసుక కొరత నెలకొంది. వర్షాలు, వరదల కారణంగా నదులు, వాగులు నిండు కుండల్లా మారటంతో తెలంగాణా రాష్ట్రంలోనూ ఇసుక కష్టాలు ఇబ్బంది పెడుతున్నాయి. అసలే పెరిగిన సిమెంట్ ధరలకు తోడు ఇసుక కొరతతో ధర విపరీతంగా పెరిగింది. దీంతో విపరీతంగా పెరిగిన నిర్మాణ వ్యయ అంచనాలతో నిర్మాణ రంగంలోని వారు తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొంటున్నారు.

 ఏపీలో ఇసుక ఉండదు, పక్క రాష్ట్రాల్లో ఎలా..? లక్షకు చేరిన ధర, కార్మికుల గోడు పట్టదా..? ఏపీలో ఇసుక ఉండదు, పక్క రాష్ట్రాల్లో ఎలా..? లక్షకు చేరిన ధర, కార్మికుల గోడు పట్టదా..?

ఇసుక లభ్యత లేక ఏపీలో నిర్మాణ రంగ కార్మికులు రోడ్డున పడ్డారు. ఆంధ్రప్రదేశ్‌లో ఇసుక కొరత చాలా ఇబ్బందులను సృష్టిస్తోందని, ఇది నిర్మాణ రంగాన్ని నిర్వీర్యం చేసిందని ప్రతిపక్ష పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నాయి. ఇప్పుడు, తెలంగాణలో కూడా ఇసుక కొరత సమస్య తీవ్రతరమైంది. ఇసుక కొరత ఉన్నందున తెలంగాణా రాష్ట్ర వ్యాప్తంగా అనేక నిర్మాణ పనులు నిలిపివేయబడ్డాయి. కొన్ని నిర్మాణాలు నత్తనడకన సాగుతున్నాయి. సాధారణంగా క్వారీల నుండి ఇసుక తీయబడుతుంది కాని నదీ పరీవాహక ప్రాంతాలలోని క్వారీలలో అధిక స్థాయిలో నీరు ఉండటం వల్ల ఇసుక తీయడం కష్టంగా మారింది.

sand shortage , not only in the AP but also in Telangana

ట్రాక్టర్ ఇసుక నాలుగు వేల నుండి 5 వేల ధర పలుకుతుంది అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వాగులు వంకలు నిండుకుండల్లా మారాయి. గత మూడు నెలలుగా ఇసుక తవ్వకాలకు వెసులుబాటు లేని పరిస్థితి ఇసుక కొరతకు కారణంగా తెలుస్తుంది. విపరీతంగా పెరిగిన ఇసుకతో సామాన్యులు నిర్మాణాలు చేయలేక మధ్యలోనే ఆపేశారు. విధిలేని పరిస్థితుల్లో కొందరు అధిక ధర పెట్టి ఇసుకను కొనుగోలు చేసి మరీ నిర్మాణాలు సాగిస్తున్నారు. ఇక దీనితో పాటు కొందరు దళారులు ఇసుక అక్రమ వ్యాపారానికి తెరతీశారు. ఇసుక కొరతను దృష్టిలో పెట్టుకొని ప్రజల అవసరాలను బట్టి ధర చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఏది ఏమైనా గతంలో ఎన్నడూ లేనంతగా ఈసారి ఇష్టపడితే ఏర్పడడం తెలంగాణ రాష్ట్రంలోని నిర్మాణ రంగానికి సైతం దెబ్బ అని చెప్పొచ్చు.

English summary
unavailability of sand is creating a lot of trouble in Andhra Pradesh and it has crippled the construction sector. Now, Telangana is also facing the problem of sand scarcity. With each passing, the availability of sand is decreasing. Many construction works have been halted in the telangana state as there was a scarcity of sand. Generally, sand will be extracted from Manair but due to high levels of water in Manair, the extraction of sand has become difficult.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X