వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

సివిల్స్ అభ్యర్థే హంతకుడు: మిత్రా హత్య కేసులో సందీప్ అరెస్ట్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: నగరంలోని చైతన్యపురి పోలీస్ స్టేషన్ పరిధిలో తన వద్ద తీసుకున్న డబ్బును తిరిగివ్వాలని కోరిన స్నేహితుడు శ్రీ మిత్రాను చంపి పరారైన నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన సందీప్ రెడ్డిని సోమవారం పోలీసులు అరెస్ట్ చేశారు. సందీప్ రెడ్డి సివిల్స్ కోచింగ్ తీసుకుంటూ ఈ దారుణానికి పాల్పడటం గమనార్హం.

హత్యకు దారితీసిన పరిణామాలను గమనించినట్లయితే.. వరంగల్‌ జిల్లా ములుగుకు చెందిన మిత్రా అనే యువకుడు నగరంలోని యూసుఫ్‌గూడలో ఉంటూ ఉద్యోగాన్వేషణ చేస్తున్నాడు. నల్గొండ జిల్లా రామన్నపేటకు చెందిన సందీప్‌రెడ్డి అశోక్‌నగర్‌లో ఉంటున్నాడు. వీరు ఇంజినీరింగ్‌లో స్నేహితులు.

ఇంత దారుణమా?: డబ్బు తిరిగివ్వమన్నందుకు ఫ్రెండ్ హత్య(పిక్చర్స్ఇంత దారుణమా?: డబ్బు తిరిగివ్వమన్నందుకు ఫ్రెండ్ హత్య(పిక్చర్స్

కాగా, మిత్ర తన అక్క కూతుళ్లకు ఏస్ అకాడమీలో ట్రాన్స్ కో, జెన్ కో పోస్టుల పరీక్షకు కోచింగ్ ఇప్పించడానికి స్నేహితుడైన సందీప్‌ను సంప్రదించాడు. ప్రవేశ పరీక్షకు శిక్షణ ఇచ్చే సంస్థలో మిత్రాతోపాటు రాకేష్‌ అనే వ్యక్తికి సీటు ఇప్పిస్తానంటూ ట్వంటీ ఫస్ట్ సెంచరీలో సివిల్స్ కోచింగ్ తీసుకుంటున్న సందీప్‌రెడ్డి రూ.50 వేలు తీసుకున్నాడు.

mitra-sandeep

సీటు ఇప్పంచకపోగా, కొంత కాలంగా డబ్బులు కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో నాగోలులో ఉండే స్నేహితుడైన ఉమేష్‌ ఇంటికి శుక్రవారం మరో స్నేహితుడు పవన్‌తో కలిసి మిత్ర, రాకేష్ చేరుకున్నారు. అక్కడ సందీప్‌రెడ్డిని తాము ఇచ్చిన డబ్బుల గురించి వారు నిలదీశారు. దీంతో వారి మధ్య స్వల్ప వాగ్వాదం చోటు చేసుకుంది.

ఈ క్రమంలో సందీప్ రెడ్డి తన వెంట తెచ్చుకున్న కత్తితో మిత్రాపై దాడి చేశాడు. దీంతో అతడి గొంతు, మెడభాగంలో తీవ్రగాయాలయ్యాయి. దీంతో తీవ్ర రక్తస్రావంతో కప్పకూలిపోయిన మిత్రాను స్నేహితులు కొత్తపేటలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు.

పరిస్థితి విషమంగా ఉందని చెప్పడంతో ఉస్మానియా ఆస్పత్రికి తరలించగా, అక్కడే మిత్రా మృతి చెందాడు. నిందితుడు సందీప్ రెడ్డిపై హత్య కేసు నమోదు చేశారు పోలీసులు. ఘటన జరిగిన అనంతరం పరారీలో ఉన్న నిందితుడు సందీప్ రెడ్డి... పోలీసులు సోవమారం నల్గొండలో అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకున్నారు.

English summary
civils candidate Sandeep Reddy arrested on Monday, in Mitra murder case.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X