వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకేష్‌తో సండ్ర భేటీ, ఆ మీటింగ్‌కు రేవంత్ హజరౌతారా, షాకిస్తారా?

By Narsimha
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్:తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారనే ప్రచారం సాగుతున్న తరుణంలో ఈ నెల 20వ, తేదిన తెలంగాణ టిడిపి ముఖ్య నేతల సమావేశం హైద్రాబాద్‌లో నిర్వహించనున్నారు.ఈ పమావేశానికి రేవంత్ రెడ్డి హజరౌతారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

కారణమిదే: బాబు ముందు రేవంత్ 3 ప్రతిపాదనలు, జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?కారణమిదే: బాబు ముందు రేవంత్ 3 ప్రతిపాదనలు, జైపాల్‌రెడ్డి చక్రం తిప్పారా?

అదే సమయంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో తెలంగాణ టిడిపి నేత ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అమరావతిలో బుదవారం నాడు సమావేశం కావడం ప్రాధాన్యత సంతరించుకొంది.

కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్కెసిఆర్ కాళ్ళకు దండం పెడితే తప్పేంటీ: రేవంత్‌పై పరిటాల శ్రీరామ్ ఫైర్

తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి ఢిల్లీలో రెండు రోజుల పాటు గడిపారు. అయితే ఢిల్లీలో ఎఐసిసి ఉపాధ్యక్షుడు రాహూల్‌గాంధీతో రేవంత్‌రెడ్డి సమావేశమయ్యారనే ప్రచారం సాగింది. అయితే ఈ ప్రచారాన్ని రేవంత్‌రెడ్డి ఖండించారు.

టిడిపిలోకి రేవంత్ ఇలా: బాబుకు నమ్మినబంటు, అనతికాలంలోనే కీలకపదవిటిడిపిలోకి రేవంత్ ఇలా: బాబుకు నమ్మినబంటు, అనతికాలంలోనే కీలకపదవి

కాంగ్రెస్ పార్టీ తెలంగాణ చీఫ్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి కూడ తీవ్రంగా ఖండించారు.ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య లోకేష్‌తో చర్చించారని సమాచారం.

Recommended Video

రేవంత్ మనసు నుంచి సంచలనాలు : కేసీఆర్, పరిటాల, యనమల పై హాట్ కామెంట్స్ | Oneindia Telugu
రేవంత్‌ వ్యవహరంపై లోకేష్‌తో సండ్ర వెంకటవీరయ్య భేటీ

రేవంత్‌ వ్యవహరంపై లోకేష్‌తో సండ్ర వెంకటవీరయ్య భేటీ


తెలంగాణ టిడిపి నేత, సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అమరావతిలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌తో సమావేశం అయ్యారు.తెలంగాణ టిడిపి వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరుతారనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఈ పరిణామాలతో పార్టీ నాయకత్వం ముందు జాగ్రత్త చర్యలను తీసుకొంటుంది. రేవంత్ వ్యవహరం నేపథ్యంలో లోకేష్‌తో సండ్ర వెంకట వీరయ్య చర్చించారనే ప్రచారం సాగుతోందని సమాచారం.

అక్టోబర్20న, టి.టిడిపి ముఖ్యుల సమావేశం

అక్టోబర్20న, టి.టిడిపి ముఖ్యుల సమావేశం

తెలంగాణ టిడిపి ముఖ్యుల సమావేశం అక్టోబర్ 20వ, తేదిన నిర్వహించనున్నారు. రేవంత్‌రెడ్డి ఎపిసోడ్ నేపథ్యంలో భవిష్యత్‌లో తీసుకోవాల్సిన చర్యలపై చర్చించే అవకాశం లేకపోలేదు.టిడిపి చీఫ్ చంద్రబాబునాయుడు విదేశీ పర్యటనలో ఉన్నారు. బాబు విదేశాల నుండి తిరిగి వచ్చిన తర్వాత రేవంత్‌రెడ్డి బాబును కలవనున్నారు. రేవంత్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే పార్టీ నుండి వలసలు వెళ్ళకుండా పార్టీ నాయకత్వం జాగ్రత్తలు తీసుకొంటుంది.అయితే ఈ సమావేశానికి రేవంత్ రెడ్డి హజరుకానున్నారా లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సమావేశానికి రేవంత్ హజరైతే సమావేశంలో ఎలాంటి చర్చ జరుగుతోందోననే ఆసక్తి నెలకొంది.

ఎన్నికల సమయంలోనే పొత్తులపై చర్చ

ఎన్నికల సమయంలోనే పొత్తులపై చర్చ


ఎన్నికల సమయంలోనే పొత్తులపై చర్చించనున్నట్టు తెలంగాణ టిడిపి అధ్యక్షుడు ఎల్. రమణ చెప్పారు.పొత్తులపై టిడిపి జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిర్ణయం తీసుకొంటారని ఎల్. రమణ అభిప్రాయపడ్డారు. అదే సమయంలో పొత్తులపై పార్టీ నేతలు చేస్తున్న ప్రకటనలన్నీ కూడ వారి వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమేనని రమణ చెప్పారు.

గందరగోళంలో తెలంగాణ టిడిపి నేతలు

గందరగోళంలో తెలంగాణ టిడిపి నేతలు


రేవంత్ రెడ్డి వ్యవహరం తెలంగాణ టిడిపి నేతల్లో కలకలానికి కారణమైంది.రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రంగం సిద్దం చేసుకొన్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది.పొత్తుల వ్యవహరంపై ప్రధానంగా రేవంత్ రెడ్డి తన ప్రతిపాదనలకు వ్యతిరేకంగా పార్టీలో కొందరు నేతలు ఉన్నారనే అభిప్రాయంతో ఉన్నారు. ఇదే సమయంలో రేవంత్ రెడ్డి పార్టీ వీడితే తెలంగాణలో టిడిపి పరిస్థితి మరింత దిగజారే పరిస్థితి ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయంతో ఉన్నారు.

English summary
Telangana Tdp key leaders will meet on Oct 20 at Hyderabad at Hyderabad. There is a discussion on Revanth Reddy attend this meeting or skip.Sattupalli MLA Sandra Venkata veeraiah met Tdp general secretary Lokesh on Wednesday at Amaravati.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X