వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోత్కుపల్లి అప్పుడే చచ్చిపోయాడు, కేసీఆర్ దేవుడా? పవన్, జగన్‌పైనా..: సండ్ర నిప్పులు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై తీవ్ర విమర్శలు చేసిన టీటీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులుపై ఆ పార్టీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం ఉదయం చంద్రబాబుపై మోత్కుపల్లి విమర్శలు చేసిన అనంతరం సండ్ర వెంకటవీరయ్య మీడియాతో మాట్లాడారు.

గవర్నర్ పదవి ఇవ్వకపోవడాన్ని ప్రపంచం బద్దలైపోయినట్లు మోత్కుపల్లి చెబుతున్నారని అన్నారు. గవర్నర్‌గిరి రాకపోవడంతోనే మోత్కుపల్లి విమర్శలు చేస్తున్నారని అన్నారు.

మోత్కుపల్లి కావాలనే విషం చిమ్ముతున్నారు..

మోత్కుపల్లి కావాలనే విషం చిమ్ముతున్నారు..

మహానాడు సమయంలో మోత్కుపల్లి నర్సింహులు కావాలనే విషం చిమ్ముతున్నారని సండ్ర మండిపడ్డారు. మోత్కుపల్లికి నర్సింహులుకు నోటి దురుసు ఎక్కువని అన్నారు. అందుకే 1989లో ఎన్టీఆర్.. మోత్కుపల్లి పార్టీ టికెట్ ఇవ్వలేదని చెప్పారు.

కేసీఆర్ దేవుడా?

కేసీఆర్ దేవుడా?

జిల్లాలో అందర్నీ ఇబ్బంది పెట్టిన నీచుడు మోత్కుపల్లి నర్సింహులు అంటూ తీవ్రంగా విమర్శించారు సండ్ర వెంకటవీరయ్య. తెలంగాణ సీఎం దుర్మార్గపు పాలన చేస్తున్నారని విమర్శించిన మోత్కుపల్లికి కేసీఆర్ ఇప్పుడు దేవుడయ్యాడా? అని సండ్ర మండిపడ్డారు.తెలుగుదేశం పార్టీని విమర్శించే అర్హత మోత్కుపల్లికి లేదని అన్నారు.

పవన్, జగన్‌ను పొగుడుతారా?

పవన్, జగన్‌ను పొగుడుతారా?

మోత్కుపల్లి రాజకీయ ప్రత్యర్థుల చేతిలో కీలు బొమ్మగా మారారని ఆరోపించారు. టీడీపీలో ఉంటూనే కేసీఆర్, పవన్ కళ్యాణ్, వైయస్ జగన్మోహన్ రెడ్డిని పొగుడుతారా? అని సండ్ర మండిపడ్డారు. మోత్కుపల్లి వెనుక ఎవరున్నారో తెలుసని అన్నారు.
టీఆర్ఎస్, కేసీఆర్‌ను ఆకాశానికెత్తుతుంటేనే అర్థమవుతోందని అన్నారు.
మోత్కుపల్లి తన రాజకీయ జీవితానికి ఆయనే సమాధి తవ్వుకుంటున్నారని సండ్ర ఎద్దేవా చేశారు. చంద్రబాబు నాయకత్వంలోనే తెలంగాణ టీడీపీ పనిచేస్తుందని సండ్ర స్పష్టం చేశారు.

 అప్పుడే మోత్కుపల్లి చచ్చిపోయాడు

అప్పుడే మోత్కుపల్లి చచ్చిపోయాడు

నిన్నటి వరకు చంద్రబాబును పొగిడి.. ఇప్పుడు సంస్కరహీనంగా విమర్శిస్తారా? అంటూ మోత్కుపల్లిపై సండ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ పార్టీలో తెలంగాణ టీడీపీని విలీనం చేసినప్పుడే మోత్కుపల్లి నర్సింహులు చచ్చిపోయాడని.. ఇంకా ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేయడమేంటని అన్నారు.

మరొకరు వెళ్లినా నష్టం లేదు.. మోత్కుపల్లిపై...

మరొకరు వెళ్లినా నష్టం లేదు.. మోత్కుపల్లిపై...

ఇలాంటి దుర్మార్గున్ని టీడీపీ మహానాడుకు ఎలా ఆహ్వానిస్తారని సండ్ర ప్రశ్నించారు. ఎన్టీఆర్ ఘాట్ వద్ద ముక్కు భూమికి రాసి తప్పైందంటే టీటీడీపీకి మహానాడుకు పిలిచేవాళ్లమని అన్నారు. మోత్కుపల్లి లాంటి దుర్మార్గున్ని టీడీపీ కార్యకర్తలెవ్వరూ దగ్గరికి రానీయకూడదని అన్నారు.రేవంత్ రెడ్డి ఓ పార్టీలోకి వెళ్లారని, మోత్కుపల్లి కూడా మరో పార్టీకి వెళ్లినా తమకు నష్టం లేదని చెప్పారు.

English summary
TTDP MLA Sandra Venkata Veeraiah on Monday takes on at motkupalli Narasimhulu for allegations on Andhra Pradesh CM Chandrababu Naidu.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X